17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
 తెలుగునేలపై  దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆరాధించబడ్డ చలన చిత్ర నటీమణులు  మహానటి సావిత్రి...కళాభినేత్రి జమునలు.... ఎవరిలా చీర కట్టలేమని ఒక సందర్భములో పేపరు ప్రకటనిచ్చి, రవీంద్ర భారతిలో జరిగిన ప్రదర్శనలో  ఎవరిని సన్మానించారో....!!!!
ఏ ముగ్ధమనోహర స్త్రీ మూర్తి దేవాలయ సన్నివేశమందు....  పళ్ళెంపై పాదాల నుంచి, రెండు చేతుల్లోనూ వెలిగించిన దీపాలని పెట్టుకొని, శిరసు పై నీరు నింపిన ఒక పాత్ర పెట్టుకుని, చింతామణి పాత్రలో నాట్యం చేసే "తరంగం"  కూచిపూడి నాట్యానికి,నటనకు, అచ్చెరువంది మంత్రముగ్దులై, "నాట్యాచార్య" అని బిరుదు  కవిసామ్రాట్ విశ్వనాథ వారు ఇచ్చి గౌరవించారో...!!!! 
 ఎవరి హొయలు....నాట్యం... నడక స్త్రీ పాత్రలో చూచి కొండవీటి వెంకటకవి గారు నాట్యమయూరి బిరుదుతో...సువర్ణ హస్త కంకణం తో సన్మానించారో....!!!!  ఎవరి  అభినయాన్ని చూడడానికి ఆంధ్ర రాజధానిలో మంత్రులు... సినీనటులు...ఐ. ఏ .ఎస్ అధికారులూ సైతమూ ఉవిళ్లూరే వారో....!!!!!
 అట్టి మహా నటుడు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి నేటి మన చిరస్మరణీయులు...!!
ఆయన నటులే కాదు.. దర్శకుడు..రచయిత..నాటక 
 విశ్లేషకుడు.. కాస్ట్యూమ్స్ డిజైనర్..విగ్గుల మేకర్!!
సకలకళా పారంగతులు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి!!

ఒక రోజు "చింతామణి" నాటక ప్రదర్శన..జరుగుతోంది.
రంగస్థల వేదికపై చింతామణి ప్రవేశం.ఒకటే ఈలలు.
చప్పట్లు....

చింతామణి అందాల రాశి.సకల విద్యలు నేర్చిన నెరజాణ. సంగీత, సాహిత్యాల్లో  నిష్ణాతురాలు.
నాట్య మయూరి. లోకానుభవానికి కొదవే లేదు

చింతామణి రంగస్థలం పైకొచ్చి..తన వగలు..
వలపులు‌ వర్షిస్తోంది…..ప్రేక్షకులంతా మంత్ర
ముగ్ధులై చింతామణి  వలపు  ఒయ్యారాలలో 
చిక్కుకొని చేప్పిల్లల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు.
ప్రపంచంలోని అందాన్నంతా చింతామణి లోనే 
కుప్పగా పోసినట్లుంది ముద్దు ముద్దు మాటలతో కళ్ళెదుట చింతామణి నయగారాలు పోతుంటే..
ఎంతవారలైనా తమాయించుకోవడం కష్టమే... 
మరి.

నాటకం రక్తి లో వుంది. బిల్వమంగళుడ్ని లోబరు
చుకునే సన్నివేశంఅది.

"నాకు ఎన్నో యేండ్ల నుండి "కామశాస్త్రం" నేర్చుకోవాలని వుంది.మీరు కామశాస్త్రంలో 
నిష్ణాతులట గదా ! నాకు నేర్పుతారా?"
అంటూ చింతామణి బిల్వమంగళుడి ఒళ్ళో 
తూలి నట్లు పడి పోతుంది.

ఇంతలో ప్రేక్షకుల్లోనుంచి ఓ ఆగంతకుడు గబగబా
వేదికపైకెళ్ళి బిల్వమంగళుడ్ని పక్కకు తోసేసి….
చింతామణిని అమాంతంగా కౌగిలించుకొని,ముద్దు
లు కురిపించడం మొదలు పెట్టాడు. అనుకోని ఈ
హఠాత్పరిణామానికి అటు  ప్రేక్షకులు, ఇటు  నిర్వా
హకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు..ఆ తర్వాత కొందరు వేదిక పైకెళ్ళి ఆగంతకుడి భరతంపట్టారు
అది వేరేసంగతి…!!

ఇంతకూ..చింతామణి పాత్రధా (రుడు) రి ఎవరో
తెలుసా..? ఆయనే..బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.!!
అందచందాల్లో...వలపు ,వయ్యారాల్లో ఆడాళ్ళకే అసూయ పుట్టించగలిగిన..సాటిలేని మేటి నటుడు
నాట్య మయూర శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి
ఇదేదో.‌తమాషాకు చెబుతున్న విషయం కాదు..
 మంగళగిరిలో చింతామణి నాటక ప్రదర్శన సందర్భంగా జరిగిన ఓ ఆకతాయి వలన జరిగిన్స్ నిజ సంఘటన...!!
ఇలాంటి ఉదంతాలు  ఇదొక్కటే కాదండోయ్ చాలానే వున్నాయి..దటీజ్ బుర్రా ,!!
★బుర్రా గారి ..జీవితం..!!
కృష్ణా జిల్లా దివి తాలూకా '  విశ్వనాధపల్లి లో 
1937,ఫిబ్రవరి,9వతేదీన జన్మించారు.తల్లిదండ్రు
లు..సీతామహాలక్ష్మి,సోమయాజులు. శాస్త్రి గారి
మాతామహుడు కూచిభట్ల రామశాస్త్రి పండితుడు
సకలశాస్త్ర‌ కోవిదుడు‌.

ఐదేళ్ళవరకు బుర్రా తన  తల్లిదండ్రులతో గుంటూరు జిల్లా వెన్ను అనంతారం గ్రామంలోవుండి..ఆతర్వాత కృష్ణాజిల్లా చేరుకున్నారు.తల్లి సీతామహాలక్ష్మి చక్కగా పాడేది.ఆమె పాటల్ని శ్రావ్య
తను చిన్నప్పటి నుండే ఒంటబట్టించుకున్నారు  బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.

తండ్రి సోమయాజులు నట విమర్శకుడు.అభినయ
రీతులతో పాత్ర నటౌచిత్యాలను విడమర్చి చెప్పడం
లో దిట్ట .కావ్యాలు,వేదాల పఠనంతో పద్యరచన 
కూడా చేసేవాడు.తన తండ్రి నాటకాల్లోని నటులకు 
ఇచ్చే గౌరవం చూసి.బుర్రా నాటకంపై ప్రేమను పెంచు
కున్నాడు.చిన్నప్పుడే.."నువ్ళేమవ్వాలను కుంటున్నా
వని "తండ్రి అడిగితే..‌తడుముకోకుండా.."నటుడ్ని "
కావాలలను కుంటున్నానని చెప్పాడు‌ బుర్రా.

బుర్రా తన మేనమామ..కూచిభట్ల రామమూర్తి వద్ద
ప్రాథమిక విద్య ను పూర్తిచేశారు.1947లో అవనిగడ్డ
హైస్కూల్ లో 7వ తరగతిలో చేరారు.అయితే అప్ప
టికే పదోతరగతి స్టాండర్డ్ వుండేది.మరో మేన మామ
కూచిభట్ల కోటెశ్వరరావు ప్రముఖ‌ హరిదాసు .హిందు
స్థానీ‌ సంగీతంలో మీరా కీర్తనలను అలవోకగా పాడే
వారు.అమరగాయకుడు ఘంటసాల చింతామణి నాటకంలో భవానీ శంకరుడిగా, కోటేశ్వరరావు బిల్వ
మంగళుడిగా నటించేవారు.ఈ నాటకాలను చూస్తూ
బుర్రా నటనలోని మెళకువల్ని నేర్చుకున్నారు.నటన
పై..ముఖ్యంగా నాటకంపై ఇష్టం పెంచుకున్నారు.
అయితే తల్లికి మాత్రం బుర్రా నాటకాల వైపుకు వెళ్ళి
డం ఇష్టం వుండేది కాదు.చదువుకోమని చెప్పడమే కాదు..దగ్గరుండి చదివించేది. తల్లికి తెలీకుండా నాటకాలకు వెళ్ళేవారు.విషయం తెలుసుకొని తల్లి 
బెత్తానికి పని చెప్పేది‌ .అయినా బుర్రాకు నాటకం పట్లప్రేమ ,అభిరుచి దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది‌.

కుటుంబ నేపథ్యంతో బుర్రాకు సకల విద్యలూ 
అలవడినాయి.తాతగారి వద్ద వేదాలు..మేనమా
మల వద్ద చదువుతో పాటు నాటకాలు ఒరవడి నేర్చుకున్నారు.ఇవన్నీ భావి జీవితంలో బుర్రా
ఓ పరిపూర్ణనటుడు కావడానికి దోహద పడ్డాయి.
★టెన్త్ లో గోల్డ్ మెడల్..!!
పదో తరగతిలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కి గోల్డ్
మెడల్ వచ్చింది.అయితే ఆర్థిక కారణాల రీత్యా 
చదువు సాగలేదు.మేనమామ శివరామ కృష్ణ వద్ద
నాటకాల్లో మంచి మెళుకువలు నేర్చుకున్నారు.
మేనమామ నటుడు.నాటకంలో స్త్రీ పాత్రల్నికూడా
వేసేవాడు.ఓ రోజు  ఖిల్జీ రాజ్యపతనం నాటకంలో మేనమామ దేవల పాత్ర వేయాల్సి వుండింది.అయి
తే. జ్వరం రావడంతో  ఆయన నాటకం ఆడలేదు
బుర్రా వేషం వేశాడు పాత్రను  మెప్పించారు.ఇలా బుర్రా తొలి నాటకంలో నే నటుడిగా స్త్రీ పాత్రతో శ్రీకారం చుట్టాడు.(1953 మార్చి9.చల్లపల్లి)

★ఉద్యోగం…!!
1956 ప్రాంతంలో చల్లపల్లి స్కూల్లో టీచర్ గా చేరా
రు.అప్పడు ఆయన జీతం 63 రూపాయలు.అలా
ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు.
నాటకం ప్రదర్శనలు కోసం తరుచూ గుంటూరుకు రావడం జరిగేది..ఇలా  రాకపోకలు దేనికని చివరకు  గుంటూరులోనే స్థిరపడ్డారు.

చల్లపల్లిలోని టీచర్ వుద్యోగం వదిలేసి.. 1958లో గుంటూరు లో 100 రూపాయలకు డ్యాన్స్ మేస్టా
రిగా చేరారు.

★నాటకాలు..!!
తొలి నాటకంలో మహామహులైన నటులతో నటించి
స్త్రీ పాత్రను రక్తికట్టించడంతో...బుర్రాకు ఇక వెను
తిరిగి చూడాల్సి రాలేదు.నాటక,సినీ రచయిత పసు
మర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రోత్సాహం లభించింది.
1953నుంచి 1955వరకు బుర్రా కొన్ని సాంఘిక‌ నాటకాల్లో పురుష పాత్రలు ధరించారు.1955 లో
మచిలీపట్నంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు నిర్వ
హించిన నాటక పోటీల్లో .."తనలో తాను" అనే
నాటకంలోని సుబ్బారావు పాత్రలో నటించి ఉత్తమ
నటుడిగా బహుమతి పొందాడు బుర్రా‌.అప్పటికి
ఆయన వయసు18 యేళ్ళు.
ఆతర్వాత అనార్కలి అనే నాటకంలో ' అనార్ఠలి'
గా నటించారు..ఆ నాటకాన్ని చూసిన ప్రముఖ రంగు
స్థల నటులు డి.వి.సుబ్బారావు గారు తమ' డ్రమె
టిక్  నాటక కంపెనీ " లోకి బుర్రాను ఆహ్వానించారు
బుర్రాకు ఇది టర్నింగ్ పాయింట్ అయింది.సినిమా
రచయిత పింగళి నాగెంద్ర అప్పుడు ఆ కంపెనీలో నే
రచయితగా వుండటం,సీనియర్ నటులు సాంగత్యం బుర్రాకు కలిసొచ్చింది.ఓ పరిపూర్ణమైన నటుడిగా 
స్థిరపడటానికి అవకాశం కలిగింది.

★బుర్రా...స్త్రీ పాత్రలు…!!

*అనార్కలి..(అనార్కలి నాటకం)
*చింతామణి/ శ్రీహరి. (చింతామణి నాటకం)
*వింధ్యారాణి,(వింధ్యారాణి నాటకం)
*చంద్రమతి.  (హరిశ్చంద్ర)
*సతీ సక్కుబాయి/ అత్త  (సతీ సక్కుబాయి)
*ద్రౌపది  (పాఃడవోద్యోగాలు)
*సత్యభామ. ( శ్రీకృష్ణ తులాభారం)
*రాజశ్రీ. (నా రాణి)
*మెకానిక్. (మేనక  విశ్వామిత్ర)
*కాళింది. (వరవిక్రయం)
*మధురవాణి. (కన్యాశుల్కం)
*రమాదేవి (పల్లె పడుచు)
*మోహిని. (మోహినీ భస్మాసుర)
*శశిరేఖ ‌(మాయాబజార్)
*విద్యార్ధి. (కాళిదాసు)
*మాధురి. (వేమన )
*దమయంతి..(చిత్రాలన్నీ యేం)
*చిత్రాంగి (విషాదం సారంగాపూర్)
*విశ్వద (విశ్వదాభిరామ)
*వరూధిని (వరూధిని)
*మల్లమదేవి (బొబ్బిలి యుద్ధం)
*కైక /మందిరం (పాదుకా పట్టాభిషేకం).
*చిన్నదేవి (నాగరాజు)
*రజనీ (సిఐడి)
*అత్త. (దైవం మానుష రూపేణ )
*సుబ్బమ్మ (ప్రజానాయకుడు)
*తారా (తారాశశాంకం)
*సో ఈజ్ దామిని (సౌదామిని)
*ప్రమీల (ప్రమీలార్జునీయం)
*దేశంలో/ మోరియా (ఖిల్జీ రాజ్యపతనం)
* పరంజ్యోతి‌ (ఎదురీత )
 

*పురుష పాత్రలు..!!
*నక్షత్రకుడు.(సత్యం హరిశ్చంద్రీయం )
*అక్రూరుడు. నారదుడు ( గయోపాఖ్యానం)
*విద్యాధరుడు ( ప్రతాప్ రుద్రీయం )
*సుబ్బారావు (తనలో తాను)
*గోపి. (పల్లె పడుచు)
*ప్రేమ పక్షి. (ప్రేమ పక్షులు )
.
1957లో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి సొంతంగా 
సతీ సక్కుబాయి నాటకాన్ని ప్రదర్శించారు.దాని
దర్శక, నిర్మాత ఆయనే.

రావూరి భరద్వాజ రాసిన మేనకా విశ్వామిత్రలో 
మేనకగా నటించి మెప్పించారు.మోహిని భస్మాసుర లో మోహిని పాత్ర.బొబ్బిలి యుద్ధం లో మల్లమదేవి ,
చింతామణి లో చింతామణి..బుర్రాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.మూడు తరాల నటులతో నటించిన ఏకైక రంగస్థలనటుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.

స్థానం నరసింహారావు.ఉప్పులూరి సంజీవరావు,
ముప్పిడి జగ్గారావు,పారుపల్లి సుబ్బారావు, టంగు
టూరి ప్రకాశం పంతులు,అక్కినేని నాగేశ్వరరావు
అవధానాలు పురుషోత్తం‌గోవింరాజులు నాయుడు,
దీక్షితులు‌, సుసర్ల‌ రామ్ చంద్ర రావు,జగర్లపూడి,
రాణి సత్యనారాయణ,ఇందుపల్లి గోవిందరావు,
రేబాల రమణ,,కొండేటి కమాల్ సాహెబ్,తదితరులు
స్త్రీ పాత్రల్లో నటించారు.రాణించారు.అయితే….
స్థానం వారి తర్వాత బుర్రా వారి పేరే స్త్రీ పాత్రలకు
గుర్తుడిపోతుంది.

★సినిమా ఫక్కీలో  అభినయం…!!

బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అభినయం సినిమా
ఫక్కీలోవుండేది.వాచికం.పద్యం పాడటంఅభినయం
అంతా ప్రత్యేకం.అంతెందుకు..స్త్రీ పాత్రకు ఆయనే 
స్వయంగా మేకప్ వేసుకునేవారు.చీరకట్టునుండి..
నుదుట తిలకం దిద్దుకునే వరకు అంతా ఆయన 
అభిరుచే కనబడేది.గాత్రం కూడా మెత్తగా, వుండటం
తో స్త్రీ పాత్రలకు సరిగ్గా అతికేది.ఆయన రంగస్థలం పై పాట పాడినా.పద్యాన్ని ఆలపించినా.ఎంతో 
మాధుర్యంగా వుండేది.ఆయన వాచికంలో నవరసా
లూ ..పండేవి.ఇక ఆంగికాభినయాన్ని గురించి ఎంత
చెప్పినా తక్కువే..ఆయన దేహ‌భాష స్త్రీ పాత్రకు 
పర్యాయపదంగా వుండేది.కళ్ళతో కూడా ఆయన
భావాల్ని పలికించగలరు.అందుకే...బుర్రా వారి 
స్త్రీ పాత్రల్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు.

ఈయన పాత్రలో ఆహార్య,వ్యవహారాల్లో కూడా 
ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు.పురాణాల్లోని 
స్త్రీపాత్రలను క్షుణ్ణంగా అథ్యయనం చేసి,వాటి 
స్వభావానికి అనుగుణంగా కాస్ట్యూమ్స్ ధరించే
వారు.ఇక సాత్వికాభినయానికి ఆయన పెట్టింది
పేరు.తన సహనటుల తో ఆయన టైమింగ్ గొప్ప
గా వుండేది.బుర్రా వారి కాంబినేషన్లో నటించేటపు
డు సహనటులు ఒళ్ళు దగ్గరబెట్టు కుని నటించేవారట. 

★సకల కళావల్లభుడు..!!

బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారకి  వివిధ కళలలో 
చక్కటి ప్రవేశం వుంది కూచిపూడి నృత్యం.చిత్ర
లేఖనం,హరికథ, శాస్త్రీయసంగీతం,ఆథ్యాత్మికత,
సంస్కృతం,ఛందస్సులో పరిజ్ఞానం,విగ్గుల తయారీ.
టైలరింగ్ తదితర ‌అంశాల్లోఆయన  ఆరితేరారు.

★సినిమా/ టివి సీరియల్స్..!!

నాలాగే ఎందరో,స్వయం కృషి, శ్రీ సత్యనారాయణ స్వామి వంటి సినిమాల్లో నటించారు.అలాగే…..
రుద్ర పీఠం,విక్రమార్క,సిద్ధేంద్రయోగి,గురునారా
యణ చరిత్ర..తదితర సీరియల్స్ లో నటించారు.

★నాటక దర్శకుడిగా!!
అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు బుర్రా.
చండీ ప్రియ,సమ్మక్క సారక్కసక్కుబాయి,అభిజ్ఞాన శాకుంతలం,అనార్కలి,వి,చింతామణి విశ్వదాభి
రామ,సత్య హరిశ్చంద్రీయం,తారాశశాంకం,శ్రీకృష్ణ 
తులాభారం..వంటి నాటకాలకు ఆయన దర్శకత్వం 
వహించారు.కృష్ణ తులాభారం,తారా శశాంకానికి 
ఉత్తమ దర్శకుడిగా బహుమతులు పొందారు.

*బిరుదులు…!!
బుర్రా వారి బిరుదులు జాబితా చాంతాడంత వుంది.
నటమయూర,నటకావతంస,కళాకౌముది,అభినయ విశారద,అభినయ కళాకోవిద,లలిత కళాప్రపూర్ణ…
తెలుగు వెలుగు,భృకుంస రత్న...ఇంకా ఎన్నో..
ఎన్నెన్నో‌.‌!!

ఇక పురస్కారాలు. సమ్మానాలకు లెక్కే లేదు.
స్వర్ణ నంది..ఎన్టీఆర్ పురస్కారం,చాట్ల శ్రీరాములు అవార్డ్, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కా
రం.బళ్ళారి రాఘవ అవార్డ్.ఇలా పొడుగైన జాబితా
నే వుంది.

బుర్రావారు కేవలం నటుడిగానే గాక, రచయిత
గా.దర్శకుడిగా,నాటక విశ్లేషకుడిగా ,పౌరాణిక వ్యాఖ్యాతగా..ఎన్నో రూపాల్లో కనబడతారు‌.

కొంతకాలం తెలుగు విశ్వవిద్యాలయం లోని పద్యం నాటకాల విభాగంలో ఆచార్యుడిగా పనిచేశారు.
దూరదర్శన్లో దేవీభాగవతం,యోగతారావళి,అష్టాతక్కువే.బుర్రా
వక్రగేల్,సుందరాకాండ..యోగ మార్గం వంటివి 
చేశారు. 
తెలుగు నాటక రంగము మీద విశిష్ట పాత్రలతో వెలిగిన కళా రత్నం ది 7-4-2019న  ఆ నటరాజులో  ఐక్యమయింది..
ఈ బహుముఖ నాటక కళాకారుడి గురించి
ఎంత చెప్పినా సుబ్రహ్మణ్య శాస్త్రి
గారి కళకు విలువ కట్టే షరాబు లేడంటే…..
అతిశయోక్తికాదు…!! 
ఆయనే బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి...!!
స్త్రీ పాత్రలపోషణలో సాటి రాలేదాయనకు ఏ స్త్రీ...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి