17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 

 నటనలో ఆయనొక మేరువు...!!
ఆంధ్ర కేసరి వారికి గురువు...!!
  వారే నేటి మన చిరస్మరణీయులు...!!
 ఆయన రాజమండ్రిలో ఓ బడి పంతులు...నాటక దర్శకులు...శిక్షకులు...నిర్వహికులు...ప్రేమికులు...
ఒక రోజు అమలాపురంలో రాత్రి నాటకం ఆడాలి..అయితే దానిని 
,నిర్వహించుటకు పంతులు గారికి సెలవు దొరకలేదు....ఆ రోజుల్లో రాజమండ్రి నుండి అమలాపురానికి నేటివలె ప్రయాణ సౌకర్యాలు అంతగా లేవు..ఆయన  వెళ్లకపోతే నాటకం ఆగిపోతుంది.అందుకే నటులు అందరినీ ముందురోజు రాత్రి ఎద్దుల బళ్ళ మీద పంపించి.. తాను మాత్రం స్కూల్ అయ్యేక కాలి నడకన అమలాపురం చేరి,ఆ రాత్రి నాటకం ప్రదర్శించారు...రానూ పోనూ 100 కిలో మీటర్లు దూరం ఉంటుంది..నాటక ప్రదర్శన కోసం అంత దూరం నడిచి వెళ్ళిన కళాపిపాసి...!!
నిజాయితీ...నిస్వార్ధం..దేశభక్తి...అంకితభావం.. గుండెధైర్యాలను నింపి ఆంధ్రకేసరి టంగుటూరి ని జాతి కందించిన మనుషుల్లో ఋషి... !!
ఆయనే ఇమ్మానేని..!!
శ్రీ ఇమ్మానేని హనుమంతరావు  నాయుడు గారు...
 తెలుగు నాటకం నిలద్రొక్కుకొంటున్న తొలిదశలో ..
నాటకానికి పరిపూర్ణమైన నిర్వచనం చెప్పిన మహానుభావుడు...ఇమ్మానేని హనుమంతరావు నాయుడు..నటులకు మార్గదర్శిగా,నాటక నిర్వహణకు ప్రణాళికా రూపకర్తగా,తెలుగు నాటక విజయ సూత్ర కర్తగా..సుప్రసిద్ధుడు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు..అంతేకాదు..
ఒక మనిషి ఎలా ఉండాలో..ఎటువంటి త్యాగశీలత కలిగి ఉండాలో తన జీవితం ద్వారా లోకానికి వెల్లడి చేసిన త్యాగధనుడు..తనువులో ప్రాణం ఉన్నంత వరకూ..కంఠంలో కొన ఊపిరి ఉన్నంతవరకూ..నాటకాన్ని..అందునా తెలుగు నాటకాన్ని విడవకుండా సకల విధాలుగా సమార్చించిన ధన్యపురుషుడు ఇమ్మానేని హనుమంత రావు నాయుడు.
నేటి ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు సమీపంలోని కొత్త పట్నం వారి స్వగ్రామం.బాల్యంనుండే ఇమ్మానేని వారి ప్రతిభ ప్రకాశించింది..చదువులో ఆయన చాలా గొప్పవాడు. ముఖ్యంగా గణిత శాస్త్రంలో ఆయన ప్రతిభ అసామాన్యం..అందుకే కేవలం మెట్రిక్ మాత్రమే పాసైనా,ఆయన దగ్గర డిగ్రీ విద్యార్థులు పాఠాలు చెప్పించు కొనేవారట..ఆనాటి వారి శిష్యులలో దేశభక్త కొండా వెంకటప్పయ్య కూడా ఒకరు..
ఒంగోలులోనే ఇమ్మానేని వారి నాటక ప్రయాణం ఆరంభం అయ్యింది.కొన్నాళ్లకు రాజమహేంద్రవరంలో  వారికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది..ఒంగోలు నుండి రాజమహేంద్రవరం వచ్చేసారు..తనతో పాటుగా తనకు ప్రేమాస్పదుడైన టంగుటూరి ప్రకాశం ని కూడా వెంటబెట్టుకు వచ్చేరు..ఆనాటికి రాజ మహేంద్రవరంలో నాటకం నిలద్రొక్కుకొంటోంది.చిలకమర్తి లక్ష్మీనరసింహం రచయితగా,సత్యవోలు గున్నేశ్వరరావు నిర్వహకుడిగా ..ఇమ్మానేని.. నాటకాలను ప్రదర్శించడం ఆరంభించారు.1889లో హిందూ నాటక సమాజం ఆవిర్భవించింది.ఈ సమాజం ద్వారా ఎన్నో గొప్ప నాటకాలు వెలుగు చూశాయి.
 కీచక వధ, ద్రౌపదీ పరిణయం,
గయోపాఖ్యానం,పారిజాతాపహరణం..వంటి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు ఇమ్మానేనివారు...
నాయుడుగారు ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు..సంభాషణలను పలకడంలో ఆయనకు ఆయనే సాటి..సాత్వికంగా నటించడంలో వారి స్థాయి చాలా గొప్పది.నాటకం మీద వారి నిబద్ధత ఎంత గొప్పదో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి..వాటిలో ఒకటి మాత్రమే..
చివరిరోజుల్లో ఆయన కాళ్ళు చచ్చుబడిపోయాయి..
అప్పటికే టంగుటూరి ప్రకాశం పేరొందిన గొప్ప న్యాయవాది..వారు నాయుడు గారికి వైద్యం చేయిం చారు.
ఇమ్మానేని హనుమంతరావునాయుడు ఈ రోజు జీవించి లేరు..కానీ,తెలుగు నాటకానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయంగా నిలిచే ఉంటుంది..తెలుగు నాటకానికి వెలుగు ప్రసాదించిన మహనీయుల్లో ప్రముఖులుగా ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారిని ఎప్పటికీ నాటక రంగం గుర్తుంచుకొంటూనే ఉంటుంది..తెలుగు జాతి కి...భారత దేశానికి...త్యాగశీలత..గుండె నిబ్బరం...మొండిపట్టుదల... పట్టుదల...నిజాయితీ గల ఒక మహానుభావుని  ఆంధ్రదేశాన ప్రజానీకానికి అందించిన  ఆయన రుణం ఎన్నటికీ తీరదేమో..!!
★★★★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు💐
★★★★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి