17, అక్టోబర్ 2020, శనివారం

చందాల కేశవ దాసు

'#పర #బ్రహ్మా  #పరమేశ్వర"
ప్రార్ధనా గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు...
తొలి సినీ గేయరచయితగా, సినీరచయితగా, కవిగా నాటకర్తగా, అష్టావధానిగా, హరిదాసుగా, ఆధ్యాత్మిక గురువుగా తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధులైన చందాలకేశవదాసు క్రీ.శ. 1876 జూన్ 20న లక్ష్మీనారాయణ,పాపమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించారు.

బాల్యం నుంచే చదువు మీద, ఆధ్యాత్మిక విద్యల పై ఆసక్తికలిగింది. ప్రజలలో ధార్మిక చింతన, పాపభితి ఏర్పడితేప్రజల జీవితం కుదురు కుంటుదనే విశ్వాసం అతనిలోకలిగి భక్తి తత్త్వాన్ని ప్రజల్లో ప్రచారం చేసి సమతా భావాన్నిపారమార్థిక చింతనను ప్రచారం చేయటం ప్రారంభిచాడు.

నంగీత సాహిత్యాలను అభిరుచిగా సాధన చేన్తూసంప్రదాయంగా వస్తున్న వైద్యవృత్తిని జీవికకు స్వీకరించారు.సాహిత్యాన్ని సంపాదనకోసం, వినోదకాలక్షేపం కోసం కాక
సందేశాత్మకంగా ప్రజల్లో మార్పు కలిగించాలనే ఉద్దేశ్యంతోవివిధ ప్రయోగాలు చేసి చూపారు.

20వ శతాబ్దం ఆరంభంలో అనగా 'ప్లవంగనామ నంవత్సర శ్రావణ బహుళ వక్షం1907లో కోదాడ దగ్గరి
"తమ్మర"గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలోనప్తాహాలు ప్రారంభించి 108 నప్తాహాలునిర్వహించారు. తొలిసారిగా ఈదేవాలయాన్ని సందర్శించటంతోనే
ఆశుకవితతో స్వామిని స్తుతి చేశారు.

ఆ దేవాలయ వూజారిగా ఉన్న
నర్సింహాచార్యులు ఇతని వాగ్దాటికిఆశ్చర్య పోయిన నర్సింహాచార్యులు
ఇతనితో మైత్రి చేశాడు. నర్సింహాచార్యుల వద్ద శ్రీవైష్ణవ తత్త్వాన్నికవితానిర్మాణ లక్షణాలను, పౌరాణికరచనా శైలిని నేర్చి అతనినే గురువుగా భావించాడు. ఆదేవాలయానికి తన ఇంటి నిర్మాణం కోసం సమకూర్చుకున్నకలపను వాడటమేగాక,అష్టావధానాలు,హరికథలుగానంచేసి తద్వారా లభ్యమైన ఆదాయాన్ని ఆ దేవాలయనిర్మాణానికి వాడినారు. దేవాలయ గాలిగోవురంధ్వజస్తంభం పనులను వారి భార్య చేతిబంగారుగాజులమ్మి కొనసాగించారు. 
తాను నిర్వహించే సప్తాహాల్లో
పండిత సత్కారాలకు ధనం సరిపోకపోతే చేతి బంగారుకంకణాన్ని అమ్మి కొనసాగించారు. పోలంపల్లి గ్రామంలోకనకతార' నాటకం వేయించగా వచ్చిన వదివేలరూపాయలతో ఆ ఊరి గ్రంథాలయంలో బీరువాలుచేయించి పుస్తకాలు కొని యిచ్చారు

శ్రీ రామనవమి వేడుకలకు భద్రాచలం వేళ్ళేయాత్రికులు తిరువూరులో భోజన విశ్రాంతులకొరకు ఆగుతారు. వారి సౌకర్యార్ధం సొంతఖర్చుతో మంచినీళ్ళ బావి తవ్వించినారు.

ఇలాంటి సత్కార్యాలు ఎన్నో చేసిన కేశవదాసు ధనవంతుడు కాడు.

కేశవదాసు తెలుగుసాహిత్యంలో వివిధ
ప్రక్రియల్లో అనేక రచనలను చేశాడు. 1911లోకనక్తార నాటకాన్ని రచించాడు. 
ఈ రచనదాదాపు నాలుగు దశాబ్దాల కాలం

తెలుగునాట వేల ప్రదర్శనలనుప్రదర్శించటం జరిగింది. ఈనాటకాన్ని 1937లో నరన్వతీటాకీనువారు
సినిమాగాతెరకెక్కించారు. 
హెచ్. వి. బాబుదర్శకత్వంలో తీసిన ఈ సినిమాకుగూడవల్లి రామబ్రహ్మం స్క్రీన్ ప్లే
కేశవదాసు,సముద్రాల మాటలు పాటలు వ్రాసారు. కేశవదాసుగారి కనక్తార నాటకంలోని రెండు సీన పద్యాలను, మూడు
పాటలను మాత్రమే ఈ సినిమాలో స్వీకరించారు. దీనిలోప్రధాన పాత్రధారులుగా దొమ్మేటి నూర్యనారాయణ
కన్నాంబలు నటించారు. ఈ చిత్రానికి మాటలు సముద్రాల
రాఘవాచార్యులు నమకూర్చారు. ఇదే పేరుతో మరొకసినిమాను 1955లో తీశారు. ఈ పాటలనే అందులోనూకొనసాగించారు

పద్యాలు

ఏ పాపమెఱుగని పాపలకీ చావు
గల్బింపజేయుట ఘనమెనీకు
ఏ కర్మమెఱుగని యీ పసికందుల
నంతమొందించుట యశమై నీకు
దప్పిచే నాలుక దడిపాడిలేక డా
హము దాహమని యెంత అడలినావో
స్మృతిలేక పడిన దుస్థితిలోననే మృగ
మ్ములు పొట్టలో బడి పోయినావో
పాటలు
ఎంతబాగుండాడి
యేం రాణ గుండాది
యెంత నక్కందిరా పడుసు
ఐంతిలాగుండాడి
బావేసుగుండాది
పొంతకుండ మూకుడంబోలె మొకము |Iఎంత
సక్కనిగుంటకి రాయే నాయెంట
సరస గూసుంట
పెళ్లిసేనుకుంట
నక్కనిగుర్రాన్మెక్తి
తాక కూడాన్నానొత్త
సర్రూన వూగి వూరేగివత్తా

కనకతార నాటకాన్ని వరంగల్ జిల్లా నెల్లుట్ల గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ న్యాయవాది, భూస్వామి రామనర్సింహారావు మాటల సందర్భంలో కేశవదాసుని ఒక నాటకంరాయమని ప్రోత్సహించి ఆనాటక ప్రదర్శనకు, ముద్రణకుఅయ్యే ఖర్చు తాను భరిస్తానని కోరడంతో ఈ నాటకాన్నిరచించాడు. అందుకనే ఆ నాటకంలో ఒకచోట "నైజాము
నక్కనిదేశమునం గల నెల్లుట్ల పురవరవాసుండు పుణ్యమూర్తిఅను ప్రస్తావన చేశాడు. ఈ నాటకాన్ని జగ్గయ్య పేటపట్కారి బజారులో ఉన్న పర్మినెంటు డ్రామా కంపెనీఅనేకసార్లు ప్రదర్శించారు. 

మైలవరం రాజా సూరనేని
వెంకటపాపయారావు 1913లో మైలవరంలో బాలభారతిసమాజం స్థాపించాడు. ఆ తరువాత 1916-17 లలోబెజవాడలో మైలవరం థియేటర్ నిర్మాణం జరిగినతరువాత బాలభారతి సమాజం కార్యక్రమాలు బెజవాడలోకొనసాగాయి. ఈ నాటక సమాజంలో జీతాలపై నటులునటి న్తూ నటనను వృత్తిగా న్వీకరించారు. నంగీత
విద్వాంసులు పాపట్లకాంతయ్య రాజమండ్రి నుంచిహార్మోనిన్గు ఎ.టి. రామానుజులు, తబలిస్టు బగ్గన్నలుహైదరాబాదు నుంచి ఈ నాటకసమాజంలో చేరిన తరువాతకనక్తార నాటకాన్ని వేల ప్రదర్శనలు చేశారు. ఈ నాటకంలోతార పాత్ర వేసిన ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వరరావు కూడాఒకరు. 1935 లో 'బలిబంధనము' అను పౌరాణికనాటకాన్ని రచించారు. 
1931లో హెచ్.ఎమ్. రెడ్డి 'భక్తప్రహ్లాద' సినిమాతీస్తూచందాల కేశవదాసు గూర్చివిని ప్రత్యేకంగా ఓ పాటను
రాయించారు.

పరితాపభారంబు భరియింపతరమా
కటకట నేవిధి గడువంగ జాలుదు
పతి అజ్ఞను మీర గలనా
పరి
పుత్రుని కాపాడగలనా/ ఈ విషము నేనెటుల
తనయుని త్రావించగలను / ధర్మము కాపాడుడునా
తనయుని కావగలనా
పరి

అందులోని లీలావతి పాత్ర పాడేందుకు ఈ పాటను
రాయించారు. ఈ పాట తెలుగు సినిమా చరిత్రలో
సినిమాకోసం రాసిన తొలి పాట ఇది. ఈ పాట రాసిన
కాలములోనే తమ్మర దేవాలయ గాలిగోపుర నిర్మాణంచేపట్టారు

193లో 'సతీఅనసూయ' చిత్రానికి మొదటిసారిగా
కథా, మాటలు, పాటలు రాయగా ఈ చిత్రాన్ని అరోరా
ఫిల్మి కార్పోరేషన్ వారు కలకత్తాలో నిర్మించారు. బారువాపిక్చర్స్ ద్వారా అదే సంవత్సరం యీ చిత్రం విడుదలఅయింది. ఈ చిత్ర నిర్మాణంలో దాసరి కోటిరత్నం భాగంపంచుకున్నారు.
 దానరి కోటిరత్నం క్లోజవ్ స్టిల్తో
సినిమాకథను 'Synopsis of the story' ఇంగ్లీషు, తెలుగు
భాషల్లో యిస్తూ సినిమాపాటలతో సహా Sunday Chronicle
Press, Mount Road Madras వారు ఈ సినిమా పై చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. అందులో చందాల కేశవదాసు
చేతిలో సతీఅనసూయ అను బేనర్తో అతని ఫొటోలు కూడాముద్రించారు.
ఈ సినిమాకు సుప్రసిద్ధ బెంగాలీ నటులైన అపహిన్చౌదరి దర్శకత్వం వహించగా, కాళ్ళకూరి వీరభద్రరావుసహాయ దర్శకులుగా పని చేశారు. ఇందులో తుంగలచలపతిరావు నారదునిగా, దాసరికోటిరత్నఅనసూయగా ఎన్.కృష్ణమాచారిఅత్రిమహర్షిగా,ఎస్.పి.లక్ష్మణస్వామిమన్మధునిగా, ఎమ్. గోపాలరావు విష్ణువుగా, డి.లీలాకుమారి నర్మదగా, వెంకుబాయి లక్ష్మీదేవిగా, ఎమ్
వుష్పచిత్ర గంగాదేవిగా నటించారు. ఈ సినిమాలోపధ్నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు, ఇరవైఆరు పాటలుఉన్నాయి. 1936 చివరిలో ఇదే యితివృత్తంతో సి.పుల్లయ్య దర్శకత్వంతో చిన్నపిల్లల చిత్రంగాను, 1957లోరాజశ్రీ వారు, 1971లో శ్రీకాంత్ వారుఇదేపేరుతోసినిమానిర్మించినప్పటికీ ఇతివృత్త అనుసరణ ఉన్నప్పటికీకేశవదాసుకు ఈ చిత్రాలతో సంబంధంలేదు.
చివరిలో రాధాఫిల్మి కంబైన్స్ వారు కాళ్ళకూరినదాశివరావు దర్శకత్వంలో 'లంకాదహనం' చిత్రాన్నిలో
చందాల కేశవదాసు చేతిలో సతీ అనసూయ పుస్తకంతోతీశారు. ఆ చిత్రం స్క్రిప్ట్ ను కేశవదాసు రచించారు

1939లో లక్ష్మీసినీటోన్ వారు నిర్మించిన 'రాధాకృష్ణ చిత్రానికి కేశవదాసు కొన్ని పాటలు రచించారు. 
దాసుగారురచించిన ఒక పాటను 1945లో ప్రతిభా బేనర్ వారునిర్మించిన 'బాలరాజు'సినిమాలోఉపయోగించుకున్నారు.ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు బాలరాజుగానటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం ఘంటసాలబలరామయ్య వహించారు

1922లో ముత్తరాజు సుబ్బారావు రచించిన 'శ్రీకృష్ణతులాభారం' నాటకం కోసం చందాల కేశవదాసు 22పాటలు రచించారు.
వీటిని“శ్రీకృష్ణతులాభారములోని కీర్తనలు” పేరుతోకురుకూరి సుబ్బారావు 1929లో ప్రచురిస్తూ గ్రంథముఖచిత్రంపై "ఇయ్యది జగ్గయ్యపేట వాస్తవ్యులు, గానవిద్యావిశారదులును అగు బ్రహ్మశ్రీపావట్లలక్ష్మీకాంతయ్యగారి ప్రియశిష్యుండగు చందాల కేశవదాసు
గారిచే రచించ బడి, బెజవాడ మైలవరం కంపెనీ వారిచేప్రదర్శనము లందు ఉపయోగింప బడుచున్నవి.
ఇందుగల వర్ణములకు భావయుక్తముగా మైలవరంకంపెనీ హార్మోనిస్టుగారైన అలుగులపాటి రామానుజులుగారిచే స్వరములు కూర్చ బడినవి" అని పేర్కొనటంజరిగింది. ఈ నాటకంలో బాగాపేరుతెచ్చుకున్న నాలుగు
పాటలు ఆనాడు తెలుగునాట ప్రతి ఒక్కరినోటా వినిపించేవి
అందులో ఈ పాట ..

బలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరకదు
త్వరన్ గొనుడు సుజనులార
బలే
విలువ ఇంతయని తెల్సుట కలవిగాని బేరము
సలిలజ గర్భాడులో ఘనుల కందని బేరము
కలుముల చేదియకు సతము నిలయమైన బేరము
బలేఫలాపేక్షరహిత భక్తసులభమైన బేరము

ఈ పాటతో పాటు 'మీరజాలగదా..
మునివరా తుద కిట్లు
కొట్టుకొట్టండిరా..
అను ఈ పాటలు కూడా ప్రఖ్యాతమైనవి. 1955లోరాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీవారు ని.యన్.రావుదర్శకత్వంలోపునర్నిమించారు. దీనిలో రఘురామయ్య
యస్. వరలక్ష్మి, శ్రీరంజని, సూరిబాబు, రేలంగి, సూర్యకళసూర్యకాంతం మొదలైనవారు నటించారు. ఈ సినిమాలోకేశవదాసు పాటలను వాడుకొని అతని పేరు పేర్కొనకుండాదైతా గోపాలం పేరు పెట్టుకొన్నారు

1966లో సురేశ్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడు తిరిగి
శ్రీకృష్ణ తులాభారం' చిత్రాన్ని నిర్మించి ఈ పాటలనువాడుకున్నారు.ఈచిత్రంలోనూ కేశవదాను పేరుపేర్కొనలేదు. వారి కుటుంబ సభ్యుల అనుమతితీసుకొనలేదు. 
1966లో ఈ విషయాన్ని గమనించిన
కేశవదాను కుమారుడు కృష్ణమూర్తి ఖమ్మం జిల్లా
న్యాయస్థానంలో 0.S. No. 1966 డి.రామానాయుడు
వాణి డిస్ట్రిబ్యూటర్స్, విజయా డిస్ట్రిబ్యూటర్స్, మాజేటి
సీతారామాంజనేయ గుప్తలపై కాపీరైట్ క్రింద దావా వేశారు

ఈ కేసులో దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీలు సాక్ష్యం ఇచ్చారు
చివరకు 1971 ఫిబ్రవరి 17న డిస్ట్రిక్ట్ కోర్టు"భలేమంచి చౌకబేరము' 'మునివరా తుదకిట్లు
కొట్టుకొట్టండిరా' అనే మూడు పాటలు కేశవదానువి
శ్రీకృష్ణతులాభారం' సినిమాలో వాడుకున్నారని తీర్పుఇవ్వడంతో 1971 తరువాత వచ్చిన సినిమాప్రింట్లలోకేశవదాసు పేరు పేర్కొనటం జరిగింది.
స్థానం నర్సింహారావు మీరజాల గలడా నా యానతిఅనే పాటను అనేక నాటకాల్లో పాడుతూ వచ్చి ఆఖరికితన ఆత్మకథ 'నటస్థానం' లో తానే రచించినట్లు పేర్కొనటం
దురదృష్టకరం. 
1935లో 'బలిబంధనము' అను ఆరుఅంకముల నాటకమును రచించినాడు. ఈ నాటకము విశేషప్రచారం పొంది అనేక ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది

1936లో వరమభాగవతోత్తముడగు 'నందడినాగదాను చరిత్రము'ను నంప్రదాయ హరికథ'నురచించడమే కాక అనేక ప్రాంతాల్లో స్వయంగా కేశవదాసు
గానం చేయటం జరిగింది. 'భక్త అంబరీష', 'సీతాకల్యాణంలవకుళ' హరికథలను స్వయంగా రచించి కేశవదాసు అనేకప్రాంతాల్లో గానం చేయటం జరిగింది
1926లో 'కేశవ శతకం'ను రచించారు. దీనిలో 108
పద్యాలు (ఉత్పలమాల 44, చంపకమాల 29, మత్తేభాలు
శార్ాలాలు 15) ఉన్నాయి. 'వంచముఖఅంజనేయస్వామి దండకం'ను రచించారు. నల్గొండజిల్లాలోని కోదాడ, తమ్మర, హుజూర్ నగర్కందిబండలలో,
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోను, ఖమ్మంలోను కేశవదాను
అష్టావధానాలు చేశారు. మోతీలాల్ నెహ్రూ మరణించి
నపుడు 'స్మృతి పద్యాలు' రచించారు. 1925లో తమ్మర
గ్రామంలోనిసీతారామచంద్రస్వామిపై 'సీతారామస్తవరాజమును' రచించారు. ఈస్వామిపైనే'శ్రీరామనామామృత గేయం' రచించారు

మంగళ హారతులు' 'జోలపాటలు' 'హెచ్చరిక
పాటలు ఎన్నో కేశవదాసు రచించారు. అవి ఈనాటికీనల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని రామాలయాల్లో కీర్తించటం
ఈనాటికీ గమనించివచ్చు
మంగళంబులు రామచంద్రా! జగన్మంగళప్రద సుగుణసాండ్రా
అంగనామణులు యొయ్యారముప్పొంగ
శృంగార నివ్వాళులన్ కరముల బూని
మి|| రంగదభినవయుక్త మోహ
నాంగ! రఘుకుల నాయకాః రణ
రంగ భీమాభిల మహాఘవిభంగ యనుచు నొంసగిరి
రవికులనీరథి సోమా! అభిరామ! సత్సావన నామా
భవధిమఖ దేవస్తవనీయ సుచరిత్ర
సువిచార ప్రవిమల సుందరమూర్తి
మి|| సర్వభూధవ మహాపాతక
హరణా దాసజన విహరణ
నవఘనాఘన దేవ! యని
ఆనందులై భక్తులిదుదురుయ

దేవాలయ ఉత్సవాలు నిర్వహించు నందర్భంలోఉత్సవిగ్రహాలను దేవాలయంలోనుండి బయటకు తీసుకు
వచ్చి గ్రామమంలో ఊరేగించి, తిరిగి దేవాలయంలోకి
ప్రవేశపెట్టడాన్ని 'వేంచేపు' అంటారు. ఈ సందర్భంలో
దేవాలయ అర్చకులు స్తోత్రపాఠాలతో పాటు "హెచ్చరిక
పేరుతో పాటగా పాడే గీత రచనా ప్రక్రియను కూడా
ఆలాపిస్తారు. కేశవదాను ఈ ప్రక్రియను సంప్రదాయ
పద్దతిలో కాంభోజరాగంలో రూపకతాళంలో గానం చేస్తారు

హెచ్చరిక హెచ్చరికా / హెచ్చరికా రామ
ల్సచ్చరితా మునిజన సం / చారా హెచ్చరికా
సీతామణి హృచ్చోరా / శ్రితజనమందారా

హైవాతాత్మజనుత నామా / వరదా హెచ్చరికా
శాశ్వత జగదేక వీర / శాంత మయాకారా
హెవిశ్వంభర భారభరణ / విభవా హెచ్చరికా
గాధేయ నవనరక్షక / ఖండిత శివచాపా
వేదాది నిఖిల సురగన / వినుతా హెచ్చరికా
హె హె
జనకరాజ జామాతా / జనక వాక్యపాలా
వననిధి బంధన సారస / వదనా హెచ్చరికా
హె
ఈ హెచ్చరికను తమ్మర, కోదాడ, హుజూర్ నగర్
బూరుగడ్డ, సూర్యాపేట దేవాలయ ఉత్సవాల్లో ఈనాటికీగానం చేస్తున్నారు. హుజూర్ నగర్ లోని వేణుగోపాలస్వామి
బూరుగడ్డ దేవాలయాల్లోని గానం చేసే హెచ్చరికను
సీతారామచంద్రస్వామి పరంగానూ, శ్రీకృష్ణుని పరంగానూరచించినారు. దీనిని కూడా కాంభోజిరాగం, రూపకతాకంలో ఈనాటికీ ఆ దేవాలయ ఉత్పవాల్లో గానం చేస్తారు.

హెచ్చరిక హెచ్చరికా / హెచ్చరికా స్వామీ
పచ్చవిలుతుని గన్న / ప్రభుదా హెచ్చరికా
హె
శ్రీ్ీఅందానా దోర్ఖందా / చందా మార్తాండా
కుండలి శయనా / గోవిందా హెచ్చరికా
గోపాలా పరిపాలా / గోపీజనలోలా1.
హె
కుపిత శత్రునిపాల / కృష్ణా హెచ్చరికా
శ్రీరామా జయరామా/ శ్రీ సీతారామాIహె
కారుణ్య గుణధామా / రామా హెచ్చరికా
పురుషోత్తమ పురవైభవ / హరి కల్పకల్లీ
పరితోషిత సుధవెల్లీ / తల్లీ హెచ్చరికా హె

.)కేశవదాసు వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు
తమ్మర కడియాల నారాయణ అక్కయైన లక్ష్మమ్మను
మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఆమెకు సంతానంలేదని నడిగూడెం దగ్గరి సిరిపురం గ్రామంలో ఒకరినిరెండవ వివాహం చేసుకొనగా కొంతకాలానికి ఇద్దరు
భార్యలు మరణించారు. తనకు సంసారయోగ్యతలేదని
భావించి ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ వైరాగ్యంలో ఉన్న
కేశవదాసును సహచరులు ఒప్పించి చిట్టెమ్మ అనే ఆమెతో
వివాహం జరిపించారు. 
ఆ దంపతులకు కృష్ణమూర్తి (-
సీతారామయ్య, ఆండాళ్ళు అనే ముగ్గురు సంతానం
కృష్ణమూర్తి అయుర్వేద వైద్యుడుగాను,సీతారామయ్య
భద్రాచలంలోఉపాధ్యాయునిగా పనిచేశారు. కుమార్తె
ఆందాళ్ళును మునగాల గ్రామ వాస్తవ్యుడు గంధం నర్సయ్య
వివాహం చేసుకున్నాడు.
ఇతడు ఉపాధ్యాయునిగా పనిచేసి విశ్రాంతి జీవితం
గడుపుతున్నాడు.

కేశవదాసు వృద్ధాప్యంలో ఖమ్మం జిల్లా నాయకుల
గూడెం గ్రామంలో ఉంటూ, 1956లో అనారోగ్యంతో
కొంతకాలం బాధపడి అక్కడే మరణించారు. అక్కడే వారి
సమాధి ఈనాటికీ రోడ్డుపక్కనే ఉంది. సూర్యాపేట నుంచి
ఖమ్మం పోయేదారిలో కనిపిస్తూ వుంటుంది.

నల్గొండ వాస్తవ్యులు ఎమ్. పురుషోత్తమా చార్యులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి చందాల కేశవదాసు
సాహిత్యం పై పరిశోధన చేసి గ్రంథాన్ని కూడా గతంలో
ప్రచురించారు.
మేశ్వర"
ప్రార్ధనా గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు...
తొలి సినీ గేయరచయితగా, సినీరచయితగా, కవిగా
నాటకర్తగా, అష్టావధానిగా, హరిదాసుగా, ఆధ్యాత్మిక
గురువుగా తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధులైన చందాలకేశవదాసు క్రీ.శ. 1876 జూన్ 20న లక్ష్మీనారాయణ,పాపమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించారు.

బాల్యం నుంచే చదువు మీద, ఆధ్యాత్మిక విద్యల పై ఆసక్తికలిగింది. ప్రజలలో ధార్మిక చింతన, పాపభితి ఏర్పడితేప్రజల జీవితం కుదురు కుంటుదనే విశ్వాసం అతనిలో కలిగి భక్తి తత్త్వాన్ని ప్రజల్లో ప్రచారం చేసి సమతా భావాన్నిపారమార్థిక చింతనను ప్రచారం చేయటం ప్రారంభిచాడు.

నంగీత సాహిత్యాలను అభిరుచిగా సాధన చేన్తూ సంప్రదాయంగా వస్తున్న వైద్యవృత్తిని జీవికకు స్వీకరించారు.సాహిత్యాన్ని సంపాదనకోసం, వినోదకాలక్షేపం కోసం కాక
సందేశాత్మకంగా ప్రజల్లో మార్పు కలిగించాలనే ఉద్దేశ్యంతోవివిధ ప్రయోగాలు చేసి చూపారు.

20వ శతాబ్దం ఆరంభంలో అనగా 'ప్లవంగనామ నంవత్సర శ్రావణ బహుళ వక్షం1907లో కోదాడ దగ్గరి
"తమ్మర"గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలోనప్తాహాలు ప్రారంభించి 108 నప్తాహాలు,నిర్వహించారు. తొలిసారిగా ఈ దేవాలయాన్ని సందర్శించటంతోనే
ఆశుకవితతో స్వామిని స్తుతి చేశారు.

ఆ దేవాలయ వూజారిగా ఉన్న
నర్సింహాచార్యులు ఇతని వాగ్దాటికి,ఆశ్చర్య పోయిన నర్సింహాచార్యులు
ఇతనితో మైత్రి చేశాడు. నర్సింహాచార్యుల వద్ద శ్రీవైష్ణవ తత్త్వాన్ని,కవితానిర్మాణ లక్షణాలను, పౌరాణికరచనా శైలిని నేర్చి అతనినే గురువుగా భావించాడు. ఆ దేవాలయానికి తన ఇంటి నిర్మాణం కోసం సమకూర్చుకున్న,కలపను వాడటమేగాక,అష్టావధానాలు,హరికథలు గానం చేసి తద్వారా లభ్యమైన ఆదాయాన్ని ఆ దేవాలయనిర్మాణానికి వాడినారు. దేవాలయ గాలిగోవురం,ధ్వజస్తంభం పనులను వారి భార్య చేతి బంగారుగాజులమ్మి కొనసాగించారు. 
తాను నిర్వహించే సప్తాహాల్లో
పండిత సత్కారాలకు ధనం సరిపోకపోతే చేతి బంగారుకంకణాన్ని అమ్మి కొనసాగించారు. పోలంపల్లి గ్రామంలో కనకతార' నాటకం వేయించగా వచ్చిన వదివేల రూపాయలతో ఆ ఊరి గ్రంథాలయంలో బీరువాలు చేయించి పుస్తకాలు కొని యిచ్చారు

శ్రీ రామనవమి వేడుకలకు భద్రాచలం వేళ్ళేయాత్రికులు తిరువూరులో భోజన విశ్రాంతులకొరకు ఆగుతారు. వారి సౌకర్యార్ధం సొంతఖర్చుతో మంచినీళ్ళ బావి తవ్వించినారు.
ఇలాంటి సత్కార్యాలు ఎన్నో చేసిన కేశవదాసు ధనవంతుడు కాడు.
కేశవదాసు తెలుగు సాహిత్యంలో వివిధ
ప్రక్రియల్లో అనేక రచనలను చేశాడు. 1911లోకనక్తార నాటకాన్ని రచించాడు. 
ఈ రచనదాదాపు నాలుగు దశాబ్దాల కాలం

తెలుగునాట వేల ప్రదర్శనలను ప్రదర్శించటం జరిగింది. ఈనాటకాన్ని 1937లో నరన్వతీటాకీనువారుసినిమాగా తెరకెక్కించారు. 
హెచ్. వి. బాబుదర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు గూడవల్లి రామబ్రహ్మం స్క్రీన్ ప్లే
కేశవదాసు,సముద్రాల మాటలు పాటలు వ్రాసారు. కేశవదాసుగారి కనకతార నాటకంలోని రెండు సీన పద్యాలను, మూడు
పాటలను మాత్రమే ఈ సినిమాలో స్వీకరించారు. దీనిలో ప్రధాన పాత్రధారులుగా దొమ్మేటి నూర్యనారాయణ
కన్నాంబలు నటించారు. ఈ చిత్రానికి మాటలు సముద్రాల
రాఘవాచార్యులు నమకూర్చారు. ఇదే పేరుతో మరొక సినిమాను 1955లో తీశారు. ఈ పాటలనే అందులోనూ కొనసాగించారు

పద్యాలు

ఏ పాపమెఱుగని పాపలకీ చావు
గల్బింప జేయుట ఘనమె నీకుఏ కర్మమెఱుగని యీ పసికందుల
నంతమొందించుట 
యశమై నీకు
దప్పిచే నాలుక దడిపాడిలేక దాహము దాహమని యెంత అడలినావో
స్మృతిలేక పడిన దుస్థితిలోననే మృగ

కనకతార నాటకాన్ని వరంగల్ జిల్లా నెల్లుట్ల గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ న్యాయవాది, భూస్వామి రామనర్సింహారావు మాటల సందర్భంలో కేశవదాసుని ఒక నాటకం రాయమని ప్రోత్సహించి ఆనాటక ప్రదర్శనకు, ముద్రణకుఅయ్యే ఖర్చు తాను   భరిస్తానని కోరడంతో ఈ నాటకాన్ని రచించాడు. అందుకనే ఆ నాటకంలో ఒకచోట"నైజాము
నక్కనిదేశమునంగల నెల్లుట్ల పురవరవాసుండు పుణ్యమూర్తి అను ప్రస్తావన చేశాడు. ఈ నాటకాన్ని జగ్గయ్య పేట పట్కారి బజారులో ఉన్న పర్మినెంటు డ్రామా కంపెనీ అనేకసార్లు ప్రదర్శించారు. 

మైలవరం రాజా సూరనేని వెంకట పాపయారావు 1913లో మైలవరంలో బాలభారతి సమాజం స్థాపించాడు.
 ఆ తరువాత 1916-17 లలోబెజవాడలో మైలవరం థియేటర్ నిర్మాణం జరిగిన తరువాత బాలభారతి సమాజం కార్యక్రమాలు బెజవాడలో కొనసాగాయి. ఈ నాటక సమాజంలో జీతాలపై నటులు నటిస్తూ నటనను వృత్తిగా న్వీకరించారు. నంగీత
విద్వాంసులు పాపట్లకాంతయ్య రాజమండ్రి నుంచి హార్మోనిన్గు ఎ.టి. రామానుజులు, తబలిస్టు బగ్గన్నలు హైదరాబాదు నుంచి ఈ నాటక సమాజంలో చేరిన తరువాత కనక్తార నాటకాన్ని వేల ప్రదర్శనలు చేశారు. ఈ నాటకంలో తార పాత్ర వేసిన ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వరరావు కూడాఒకరు. 1935 లో 'బలిబంధనము' అనుపౌరాణికనాటకాన్ని రచించారు. 
1931లో హెచ్.ఎమ్. రెడ్డి 'భక్తప్రహ్లాద' సినిమా తీస్తూ చందాల కేశవదాసు గూర్చివిని ప్రత్యేకంగా ఓ పాటను
రాయించారు.

పరితాప భారంబు భరియింపతరమా
కటకట నేవిధి గడువంగ జాలుదు
పతి అజ్ఞను మీర గలనా

అందులోని లీలావతి పాత్ర పాడేందుకు ఈ పాటను రాయించారు. ఈ పాట తెలుగు సినిమా చరిత్రలో సినిమాకోసం రాసిన తొలి పాట ఇది. ఈ పాట రాసిన కాలములోనే తమ్మర దేవాలయ గాలిగోపుర నిర్మాణంచేపట్టారు

193లో 'సతీఅనసూయ' చిత్రానికి మొదటిసారిగాకథా, మాటలు, పాటలు రాయగా ఈ చిత్రాన్ని అరోరాఫిల్మి కార్పోరేషన్ వారు కలకత్తాలో నిర్మించారు. బారువా పిక్చర్స్ ద్వారా అదే సంవత్సరం యీ చిత్రం విడుదలఅయింది. ఈ చిత్ర నిర్మాణంలో దాసరి కోటిరత్నం భాగం పంచుకున్నారు.
దానరి కోటిరత్నం క్లోజవ్ స్టిల్తో
సినిమా కథను 'Synopsis of the story' ఇంగ్లీషు, తెలుగు
భాషల్లో యిస్తూ సినిమా పాటలతో సహా Sunday Chronicle
Press, Mount Road Madras వారు ఈ సినిమా పై చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. అందులో చందాల కేశవదాసు
చేతిలో సతీఅనసూయ అను బేనర్తో అతని ఫొటోలు కూడా ముద్రించారు.
ఈ సినిమాకు సుప్రసిద్ధ బెంగాలీ నటులైన అపహిన్చౌదరి దర్శకత్వం వహించగా, కాళ్ళకూరి వీరభద్రరావు సహాయ దర్శకులుగా పని చేశారు. ఇందులో తుంగల చలపతిరావు నారదునిగా, దాసరికోటిరత్నం  అనసూయగా ఎన్.కృష్ణమాచారినఅత్రిమహర్షిగా,ఎస్.పి.లక్ష్మణస్వామిమన్మధునిగా, ఎమ్. గోపాలరావు విష్ణువుగా, డి.లీలాకుమారి నర్మదగా, వెంకుబాయి లక్ష్మీదేవిగా, ఎమ్ వుష్పచిత్ర గంగాదేవిగా నటించారు. ఈ సినిమాలో పధ్నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు, ఇరవై ఆరు పాటలుఉన్నాయి. 1936 చివరిలో ఇదే యితివృత్తంతో సి.పుల్లయ్య దర్శకత్వంతో చిన్నపిల్లల చిత్రంగాను, 1957లోరాజశ్రీ వారు, 1971లో శ్రీకాంత్వారు ఇదేపేరుతో సినిమా నిర్మించినప్పటికీ ఇతివృత్త అనుసరణ ఉన్నప్పటికీ
కేశవదాసుకు ఈ చిత్రాలతో సంబంధంలేదు.
చివరిలో రాధాఫిల్మి కంబైన్స్ వారు కాళ్ళకూరినదాశివరావు దర్శకత్వంలో 'లంకాదహనం' చిత్రాన్నిలో
చందాల కేశవదాసు చేతిలో సతీ అనసూయ పుస్తకంతో తీశారు. ఆ చిత్రం స్క్రిప్ట్ ను కేశవదాసు రచించారు

1939లో లక్ష్మీసినీటోన్ వారు నిర్మించిన 'రాధాకృష్ణ చిత్రానికి కేశవదాసు కొన్ని పాటలు రచించారు. 
దాసుగారు రచించిన ఒక పాటను 1945లో ప్రతిభా బేనర్ వారునిర్మించిన 'బాలరాజు'సినిమాలోఉపయోగించుకున్నారు.ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు బాలరాజుగానటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం ఘంటసాల బలరామయ్య వహించారు

1922లో ముత్తరాజు సుబ్బారావు రచించిన 'శ్రీకృష్ణతులాభారం' నాటకం కోసం చందాల కేశవదాసు 22పాటలు రచించారు.
వీటిని“శ్రీకృష్ణతులాభారములోని కీర్తనలు” పేరుతోకురుకూరి సుబ్బారావు 1929లో ప్రచురిస్తూ గ్రంథముఖచిత్రంపై "ఇయ్యది జగ్గయ్యపేట వాస్తవ్యులు, గాన విద్యావిశారదులును అగు బ్రహ్మశ్రీ పావట్ల లక్ష్మీకాంతయ్యగారి ప్రియశిష్యుండగు చందాల కేశవదాసు గారిచే రచించబడి, బెజవాడ మైలవరం కంపెనీ వారిచే ప్రదర్శనము లందు ఉపయోగింప బడుచున్నవి.
ఇందుగల వర్ణములకు
భావయుక్తముగా మైలవరం కంపెనీ హార్మోనిస్టు గారైన అలుగులపాటి రామానుజులుగారిచే స్వరములు కూర్చ బడినవి" అని పేర్కొనటంజరిగింది. ఈ నాటకంలో బాగాపేరు తెచ్చుకున్న నాలుగు
పాటలు ఆనాడు తెలుగునాట ప్రతి ఒక్కరినోటా వినిపించేవి
అందులో ఈ పాట ..

బలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరకదు
త్వరన్ గొనుడు సుజనులార

ఈ పాటతో పాటు 'మీరజాలగదా..
మునివరా తుద కిట్లు,కొట్టుకొట్టండిరా..
అను ఈ పాటలు కూడా ప్రఖ్యాతమైనవి. 1955లోరాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీవారు సి.యన్.రావు దర్శకత్వంలోపునిర్నిమించారు దీనిలో రఘురామయ్య
యస్. వరలక్ష్మి, శ్రీరంజని, సూరిబాబు, రేలంగి, సూర్యకళ సూర్యకాంతం మొదలైనవారు నటించారు. ఈ సినిమాలో కేశవదాసు పాటలను వాడుకొని అతని పేరు పేర్కొనకుండా దైతా గోపాలం పేరు పెట్టుకొన్నారు

1966లో సురేశ్ ప్రొడక్షన్స డి.రామానాయుడు తిరిగి శ్రీకృష్ణ తులాభారం' చిత్రాన్ని నిర్మించి ఈ పాటలను వాడుకున్నారు.ఈచిత్రంలోనూ కేశవదాను పేరుపేర్కొనలేదు. వారి కుటుంబసభ్యుల అనుమతతీసుకొనలేదు. 
1966లో ఈ విషయాన్ని గమనించిన కేశవదాను కుమారుడు కృష్ణమూర్తి ఖమ్మం జిల్లాన్యాయస్థానంలో 0.S. No. 1966 డి.రామానాయుడువాణి డిస్ట్రిబ్యూటర్స్, విజయా డిస్ట్రిబ్యూటర్స్, మాజేటి సీతారామాంజనేయ గుప్తలపై కాపీరైట్ క్రింద దావా వేశారు

ఈ కేసులో దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీలు సాక్ష్యం ఇచ్చారు
చివరకు 1971 ఫిబ్రవరి 17న డిస్ట్రిక్ట్ కోర్టు"భలేమంచి చౌకబేరము' 'మునివరా తుదకిట్లు,కొట్టుకొట్టండిరా' అనే మూడు పాటలు కేశవదానువి,శ్రీకృష్ణతులాభారం' సినిమాలోవాడుకున్నారని తీర్పు ఇవ్వడంతో 1971 తరువాత వచ్చిన సినిమా ప్రింట్లలో కేశవదాసు పేరు పేర్కొనటం జరిగింది.
స్థానం నర్సింహారావు మీరజాల గలడా నా యానతి అనే పాటను అనేక నాటకాల్లో పాడుతూ వచ్చి ఆఖరికి తన ఆత్మకథ 'నటస్థానం' లో తానే రచించినట్లు పేర్కొనటం దురదృష్టకరం. 1935లో 'బలిబంధనము' అను ఆరుఅంకముల నాటకమును రచించినాడు. ఈ నాటకము విశేషప్రచారం పొంది అనేక ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది

1936లో వరమభాగవతోత్తముడగు 'నందడి నాగదాను చరిత్రము'ను నంప్రదాయ హరికథ'ను రచించడమే కాక అనేక ప్రాంతాల్లో స్వయంగా కేశవదాసుగానం చేయటం జరిగింది. 'భక్త అంబరీష', 'సీతాకల్యాణం ,లవకుళ' హరికథలను స్వయంగా రచించి కేశవదాసు అనేకప్రాంతాల్లో గానం చేయటం జరిగింది
1926లో 'కేశవ శతకం'ను రచించారు. దీనిలో 108పద్యాలు (ఉత్పలమాల 44, చంపకమాల 29, మత్తేభాలు శార్ధూలలు 15) ఉన్నాయి. 'వంచముఖ అంజనేయస్వామి దండకం'ను రచించారు. నల్గొండజిల్లాలోని కోదాడ, తమ్మర, హుజూర్ నగర్కంది బండలలో,
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోను, ఖమ్మంలోను కేశవదాసు అష్టావధానాలు చేశారు. మోతీలాల్ నెహ్రూ మరణించినపుడు 'స్మృతి పద్యాలు' రచించారు. 
1925లోతమ్మర గ్రామంలోని సీతారామచంద్రస్వామిపై 'సీతారామస్తవరాజమును' రచించారు. 

మంగళ హారతులు' 'జోలపాటలు' 'హెచ్చరిక
పాటలు ఎన్నో కేశవదాసు రచించారు. అవి ఈనాటికీనల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని రామాలయాల్లో కీర్తించటం
ఈనాటికీ గమనించివచ్చు
మంగళంబులు రామచంద్రా! జగన్మంగళప్రద సుగుణసాండ్రా
అంగనామణులు యొయ్యారముప్పొంగ
శృంగార నివ్వాళులన్ కరముల బూని

భవధిమఖ దేవస్తవనీయ సుచరిత్ర
సువిచార ప్రవిమల సుందరమూర్తి
మి|| రంగదభినవయుక్త మోహ
నాంగ! రఘుకుల నాయకాః రణ
రంగ భీమాభిల మహాఘవిభంగ యనుచు 

దేవాలయ ఉత్సవాలు నిర్వహించు నందర్భంలో ఉత్సవిగ్రహాలను దేవాలయంలోనుండి బయటకు తీసుకు
వచ్చి గ్రామమంలో ఊరేగించి, తిరిగి దేవాలయంలోకి ప్రవేశపెట్టడాన్ని 'వేంచేపు' అంటారు. 
ఈ సందర్భంలోదేవాలయ అర్చకులు స్తోత్రపాఠాలతో పాటు "హెచ్చరిక
పేరుతో పాటగా పాడే గీత రచనా ప్రక్రియను కూడా ఆలాపిస్తారు. కేశవదాను ఈ ప్రక్రియను సంప్రదాయపద్దతిలో కాంభోజరాగంలో రూపకతాళంలో గానం చేస్తారు

హెచ్చరిక హెచ్చరికా / హెచ్చరికా రామ
ల్సచ్చరితా మునిజన సం / చారా హెచ్చరికా
సీతామణి హృచ్చోరా / శ్రితజనమందారా
 
ఈ హెచ్చరికను తమ్మర, కోదాడ, హుజూర్ నగర్,బూరుగడ్డ, సూర్యాపేట దేవాలయ ఉత్సవాల్లో ఈనాటికీ గానం చేస్తున్నారు. హుజూర్ నగర్ లోని వేణుగోపాలస్వామి
బూరుగడ్డ దేవాలయాల్లోని గానం చేసే హెచ్చరికను
సీతారామచంద్రస్వామి పరంగానూ, శ్రీకృష్ణుని పరంగానూ రచించినారు. దీనిని కూడా కాంభోజిరాగం, రూపకతాకంలో ఈనాటికీ ఆ దేవాలయ ఉత్పవాల్లో గానం చేస్తారు.

హెచ్చరిక హెచ్చరికా / హెచ్చరికా స్వామీ
పచ్చవిలుతుని గన్న / ప్రభుదా హెచ్చరికా గోపీజనలోలా..

కేశవదాసు వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు
తమ్మర కడియాల నారాయణ అక్కయైన లక్ష్మమ్మను మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఆమెకు సంతానంలేదని నడిగూడెం దగ్గరి సిరిపురం గ్రామంలో ఒకరిని రెండవవివాహం చేసుకొనగా కొంతకాలానికి ఇద్దరుభార్యలు మరణించారు. తనకు సంసారయోగ్యత లేదని,భావించి ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ వైరాగ్యంలో ఉన్నకేశవదాసును సహచరులు ఒప్పించి చిట్టెమ్మ అనే ఆమెతో వివాహం జరిపించారు. 
ఆ దంపతులకు కృష్ణమూర్తి సీతారామయ్య, ఆండాళ్ళు అనే ముగ్గురు సంతానం
కృష్ణమూర్తి,అయుర్వేదవైద్యుడుగాను,సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు.కుమార్తె ఆండాళ్ళును మునగాల గ్రామవాస్తవ్యుడు గంధం నర్సయ్య వివాహం
చేసుకున్నాడు.
ఇతడు ఉపాధ్యాయునిగా,పనిచేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు.
కేశవదాసు వృద్ధాప్యంలో ఖమ్మం జిల్లా నాయకులగూడెం గ్రామంలో ఉంటూ, 1956లో అనారోగ్యంతో,కొంతకాలం బాధపడి అక్కడే మరణించారు. అక్కడే వారి సమాధి ఈనాటికీ రోడ్డుపక్కనే ఉంది. సూర్యాపేట నుంచి,ఖమ్మం పోయేదారిలో కనిపిస్తూ వుంటుంది.

నల్గొండ వాస్తవ్యులు ఎమ్. పురుషోత్తమా చార్యులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి చందాల కేశవదాసు
సాహిత్యం పై పరిశోధన చేసి గ్రంథాన్ని కూడా గతంలో
ప్రచురించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి