17, అక్టోబర్ 2020, శనివారం

సంపత్ నగర్ లక్ష్మణరావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
నేటి మన చిరస్మరణీయులు... అంజనేయపాత్రలో ఆలపించే మధుర కోయిల...
మన మహానటులు ఈ లక్ష్మణరావు పేపకాయల...
*శ్రీ #పేపకాయల #లక్ష్మణరావు* (పి.లక్ష్మణరావుగా సుపరిచితుడు) ప్రముఖ రంగస్థల నటులు. 
ఆయనకు నాటకరంగంలోనూ, అభిమానుల్లోనూ #సంపత్నగర్ #లక్ష్మణరావు* అన్న పేరు స్థిరపడింది. పలుపౌరాణిక నాటకాలలో అనేక పాత్రలను పోషించిన ఈయనకు ఎన్‌.టీ.ఆర్ రంగస్థల అవార్డుకు ఎంపికయ్యారు.

 శ్రీ పి.లక్ష్మణరావు గారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎలుగుబంద గ్రామంలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నపుడు చదువులో అంత శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి అతడి మేనమామ సూర్యనారాయణ వద్దకు పంపడంతో అక్కడ ఆయనకు వ్యవసాయంలో సహాయం చేయడం చేస్తుండేవారు. నాటకాలంటే ఉన్న శ్రద్ధను గమనించిన ఆయన రాజమండ్రి చింతా సుబ్బారావు గారి వద్ద శిష్యుడిగా చేర్పించారు. మూడేళ్ళు శిక్షణ పూర్తిచేసిన లక్ష్మణరావు తన 15వ యేట నాటకాల్లో అడుగుపెట్టారు.

అక్కడా ఇక్కడా నేర్చిన పద్యాలు పాడుకుంటూండేవారు. చిన్నప్పుడు ఆళ్లూ ఈళ్లూ పాడిన పద్యాలు నెమరేస్తూ గొడ్లు గాచుకుంటూ తిరిగేవారు. ఆయనలోని అసాధారణ ధారణశక్తిని, గాత్ర ధర్మాన్నీ గుర్తించిన వీర్రాజు అనే వ్యక్తి ఆయన చేత ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకంలోని పద్యాలను, సంభాషణలను పూర్తిగా బట్టీ పట్టించారు. అవి విన్నవారు ఆయనను బలవంతంగా నాటకరంగానికి ఎక్కించడంతో నటునిగా జీవితం ప్రారంభించారు.
 ★నాటకరంగ ప్రవేశం
లక్ష్మణరావు తన 15 వఏట నాటకాల్లో అడుగుపెట్టారు, తన గురువు సూర్యనారాయణ వద్ద మూడేళ్ళు సహాయకునిగా ఉంటూ తన మొదటి ప్రదర్శనను రాజమండ్రి దేవీచౌక్ వద్ద దసరా సంబరాలలో  ఆంజనేయునిగా చూపారు.ఆంజనేయుడి వేషంలో లక్ష్మణరావుని చూసి ఊళ్లో జనం ఆశ్చర్యపోయారు. ఆ వార్త ఆ నోట ఆ నోట చాలా వూళ్లకి పాకింది. అక్షర సంగీత జ్ఞానం లేకుండానే అమాంతంగా నాటకరంగంలోకి దూసుకొచ్చిన అతన్ని ఆపడం ఇక ఎవరివల్లా కాలేదు. అతని భాషకీ, బాణీకి వంకలు పెడుతున్న కొద్దీ చెలరేగిపోయారు. మద్రాసు నుంచి గ్రాముఫోను కంపెనీ వాళ్లొచ్చి లక్ష్మణరావు పద్యాలను రికార్డు చేసి మార్కెట్లోకి వదిల్తే ఆ గొంతు విని ఆంధ్రదేశం అదిరిపడింది. చావుకీ పెళ్లికీ బారసాలకీ అన్నిటికీ మైకుల్లో ఇతగాడి రికార్డు పెట్టి ఊళ్లకి ఊళ్లు పద్యనాటక మైకంలో తూలిపడుతుండేవి. నేల ఈనిందా అన్నట్టు జనం పోటెత్తి మరీ అతని నాటకం చూడ్డానికి ఎగబడ్డారు. ఒక్క సారిగా లక్ష్మణరావు సూపర్ స్టార్ అయిపోయారు. రేటు పెంచారు. రోజుకో నాటకం, పూటకో ఊరు తిరుగుతూ ఉర్రూతలూగించారు. వరస నాటకాలతో గొంతు రాసుకుపోయి బాధిస్తున్నా మహానుభావుడు ఆ బాధని దిగమింగి మరీ పద్యం అందుకున్నారు గానీ ఏరోజూ మద్యాన్ని మందుగానైనా దరిచేరనివ్వలేదు.

మరో సుప్రసిద్ధ నటులు షణ్ముఖి ఆంజనేయ రాజు శ్రీరామునిగా, లక్ష్మణ రావు ఆంజనేయునిగా ఎక్కువుగా నటించేవారు. వీరి నాటకం ఉందంటే పరిసర గ్రామాలనుంచి నాటకాభిమానులు వేలదిగా హాజరయ్యేవారు. తనతో పాటు ఎవరు శ్రీరాముని పాత్రలో నటించినా లక్ష్మణరావు నటనలో, ఏకాగ్రతలో లోపం ఉండేది కాదు. ఆంజనేయుడే ఆవహించినట్టు పాత్రలో లీనమైపోయేవారు. 1970ల నాటికే లక్ష్మణరావు రికార్డిస్టుగా పద్యనాటకాభిమానుల హృదయాలను చూరగొన్నారు.
 గత 55 సంవత్సరాలుగా రామాంజనేయ యుద్ధం నాటకాన్ని 15వేలకుపైగా ప్రదర్శనలను ఇచ్చి అందరి మన్ననలను లక్ష్మణరావు పొందారు. సంపతనగరం లక్ష్మణరావుగా రాష్ట్రప్రజలకు సుపరిచితుడైన ఆయన అంతగా చదువుకోకపోయినాగానీ శాస్ర్తియ సంగీతాన్ని నేర్చుకుని రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం నాటకాల్లో నటించారు.

★పేరు తెచ్చిన పాత్రలు 
ఆంజనేయుని పాత్ర, గయుని పాత్రలు
★విగ్రహావిష్కరణ ..
ఆయన 2017 ఏప్రిల్ 28న మరణించారు. ఎంతో ప్రతిభా పాటవాలు, పాండిత్యం ఉన్నా వ్యక్తిగత క్రమశిక్షణ లేక ఆర్థికంగా, శారీరకంగా క్షీణదశను అనుభవించిన ఎందరో కళాకారులు ఉన్న పౌరాణిక నాటక రంగంలో లక్ష్మణరావు ఎంతో క్రమశిక్షణతో మెలిగారు. లక్ష్మణరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఎలుగుబందలో అభిమానులు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

★అవార్డులు, సత్కారాలు 
1982లో అభినవ శ్రీరామదూతగా గుంటూరు వారిచే సత్కారం
1995లో కలెక్టర్ సమీర్ శర్మ ద్వారా సన్మానం
1999-2000లో తిరుమల తిరుపతి దేవస్థానం సన్మానం
2002లో ఘంటా కంకణం, నెల్లూరులో కనకాభిషేకం
2003లో విజయవాడలో కనకాభిషేకం
2006 నందమూరి కళాపరిషత్ వినుకొండ వారిచే ఎంటీఆర్ స్మారక అవార్డు
2007గాయని ఎస్.జానకి గారి ద్వారా సన్మానం.
2011 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి పురస్కారం.
2012 అక్కినేని నాగేశ్వరరావు నాతక కళాపరిషత్ అవార్డు.
2013 ఆంధ్రప్రదేశ్ సాంసృతిక శాఖ ప్రశంసాపత్రం.
2013 ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధిసంస్థ).
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
"ప్రద్మశ్రీ" లాంటి పురస్కారానికి అర్హుడైన సరస్వతీ అనుగ్రహ పాత్రుడైనవ్ వీరిని నిరక్షరకుక్షిగా భావించి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా...(ఆలాంటి పురస్కారాలు...లాంటి వెనక ఎన్నో పైరవీలు...ప్రయత్నాలు వుంటాయని సర్వులకూ విదితమే)50 ఏండ్ల గా తెలుగునాట వేల ప్రదర్శనలకు   ఆహ్వానించి,, ఈయన అద్భుత నటనను గానాన్నీ వీక్షించి, ప్రేక్షకదేవుల్ల అభిమానమే(బహు"మతు"లను మెప్పించిన వారికి బహుమతి ఏపాటిది) వీరికి వారిచ్చిన  "ప్రజాశ్రీ"  పురస్కారంగా భావించి ఆంజనేయ పాత్రలో ఆ రామ నామ జపంతో జీవించిన మహానుభావుడు..ధన్యుడు...ధన్యుడు...ధన్యుడు...!!
💐 వీరికి మా నివాళులు...!!💐
◆◆◆◆◆●●◆◆◆◆◆◆◆◆◆◆
★★సేకరణ-నూలు"★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి