17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ నెల్లూరి నగరాజరావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
ఈనాటి మన చిరస్మరణీయులు..
శ్రీ నెల్లూరు నగరాజారావు 
రంగస్థల నటులు, చిత్రకారులు, ఉపాధ్యాయులు,సినిమా నటులు...
 శ్రీ నగరాజారావు 1887లో నరసింహారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు. వీరి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, రాజోలు.

★ఉద్యోగం 
కొంతకాలం బుచ్చిరెడ్డిపాలెంలో చిత్రలేఖన ఉపధ్యాయుడిగా పనిచేశారు.

★రంగస్థల ప్రస్థానం 
నెల్లూరు జ్ఞానోదయ సమాజం ప్రదర్శించిన ప్రహ్లదలో ఇంద్రుడు పాత్రతో రంగస్థల ప్రవేశం చేశారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే లవకుశ, కృష్ణలీలలు, సారంగధర, పాదుక, విజయనగర రాజ్యపతనం వంటి నాటకాలలో నటించారు.

★నటించిన పాత్రలు
ఇంద్రుడు (ప్రహ్లాదుడు)
పఠాన్
హిరణ్యకశ్యపుడు
దాశరథి
నలుడు
దుష్టబుద్ధి
యుగంధరుడు
పాపారాయుడు
కంసుడు
శివాజీ
అక్బర్
ఔరంగజేబు
తానీషా
రాజరాజు
రుస్తుం
నందుడు
వీరనాయకుడు
కీచకుడు
నక్షత్రకుడు
శకుడు
కర్ణుడు
దశరథుడు
నటించిన సినిమాలు సవరించు
శకుంతల (1932)
శ్రీరామ పట్టాభిషేకం (1932)
రామదాసు (1933)
సీతాకళ్యాణం (1934)
సతీ తులసి (1936)
ద్రౌపతీ వస్త్రాపహరణం (1936) (శకుని)
చిత్రనాళీయం (1938)
రైతుబిడ్డ (1939) (తాసీల్దారు)
కాలచక్రం (1940) (జడ్జి)

ఈయన 1942లో మరణించారు.వీరికి మా నివాళులు💐💐💐

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి