9, నవంబర్ 2020, సోమవారం

శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఈనాటి మన చిరస్మరణీయులు తొలి తరం రంగస్థల నటులు... *శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య*
 రంగస్థల నటులు
★జననం
 శ్రీ సుందరరామయ్య 1895లో గుంటూరు జిల్లా, తెనాలి లో  కుమారస్వామి, శేషమాంబ దంపతులకు  జన్మించారు.

★రంగస్థల ప్రస్థానం 
 నాటకరంగంపై చిన్నప్పటినుండి ఆసక్తివున్న శ్రీ సుందరరామయ్య నటననే వృత్తిగా తీసుకుని ,పూర్తి కాలపు ప్రధాన పాత్రధారిగా తెనాలి రామవిలాస సభలో   చేరారు. అక్కడ గోవిందరాజులవెంకటసుబ్బారావు, 
పెద్దిభొట్లవేంకటాచలపతి మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, , స్థానం నరసింహారావు, ముదిగొండ లింగమూర్తి తదితర ఉద్దండ కళాకారులు  సుందరరామయ్య గారికి సహచర నటులు గా ఉండేవారు.

★నటించిన పాత్రలు
జనార్ధనమంత్రి;నారదుడ;రాంసింగ్;హరిశ్చంద్రుడు;పాపారాయుడు;భీముడు;నరకాసురుడు;రుక్మాంగదుడు;బిల్వమంగళ;రాజరాజనరేంద్రుడు;విశ్వామిత్రుడు;సుదేవ;అశ్వత్థామ

★మరణం ..
ఈయన 1933లో నటరాజులో ఐక్యం చెందారు.
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐        (-నూలు)
★★★★★★★★★★★

7, నవంబర్ 2020, శనివారం

శ్రీ ఎస్.కె. ఆంజనేయులు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఈనాటి మన చిరస్మరణీయులు
*శ్రీ ఎస్.కె. ఆంజనేయులు*
 ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు
★జననం
శ్రీ ఆంజనేయులు 1925, ఏప్రిల్ 8న జన్మించారు.
★వుద్యోగం
  నిజాం స్టేట్ రైల్వేలో 1945లో ఉద్యోగంలో చేరారు.

"★రంగస్థల ప్రస్థానం 
1952లో లక్ష్మీపతి సహకారంతో హైదరాబాద్ లో విశ్రుతీ నాట్యమండలిని స్థాపించి అనేక నాటకాల్ని ప్రదర్శించారు..
సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాలలో నటించి, దర్శకత్వం చేపట్టిన ఆంజనేయులు, 1962లో సారంగధర నాటకానికి దర్శకత్వం వహించి అనే ప్రదర్శనలు చేశారు
1955 నుంచి వందకుపైగా నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
. 1987లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన నాటిక రచనా పోటీలలో రాధికా స్వాంతం నాటికకు ప్రథమ బహుమతి, విశాఖ సాహితీ సేవా సమితి ట్రస్ట్ నిర్వహించిన నాటక రచనల పోటీలలో స్మృతి ప్రతీక నాటికకు తృతీయ బహుమతి అందుకున్నారు.  
★నటించిన నాటకములు
రాగరాగిణి:పవిత్రులు;చావకూడదు;నీడలు-నిందలుశిరోమణి
వలయం;ఆత్మీయులు

2005, సెప్టెంబర్ 11 న హైదరాబాద్ శివసాయుజ్యం పొందారు..
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (సేకరణ -నూలు)
★★★★★★★★★★

6, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీ ఆవేటి నాగేశ్వరరావు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
నేటి మన చిరస్మరణీయులు..
*శ్రీఆవేటి నాగేశ్వరరావు* దర్శకులు.రంగస్థల నటులు, , నటరాజేంద్ర, నాట్య కళాధురీణ బిరుదాంకితులు.ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు, 

*జననం - విద్యాభ్యాసం*.
నాగేశ్వరరావు వెంకటస్వామి, అంజనమ్మ దంపతులకు 1914, ఆగస్టు 1 న జన్మించారు.స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉత్తీరుడయ్యారు.భీమవరం, గుంటూరులలో విద్యను అభ్యసించారు. 
*రంగస్థల ప్రస్థానం* ..
నాగేశ్వరరావుది నాటక కళాకారుల కుటుంబం. చదువుకుంటున్న రోజులలోనే వంశానుగతమయిన నాటకకళ అభిరుచితో, తనతోటి వాళ్లతో నాటకాలు వేసేవారు. తండ్రి నేతృత్వంలో 1934, సెప్టెంబర్ 4న కుటుంబమంతా కలిసి ప్రదర్శించిన తులాభారం నాటకంతో రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆవేటి పూర్ణిమనాగేశ్వరరావు,  నాయకా నాయిక పాత్రలలో అనేక నాటకాలు ప్రదర్శించారు పూర్ణానంద థియేటర్స్ పేరుతో  క 1943లో  నాగేశ్వరరావు న్యూ సమాజం స్థాపించారు. క్షణంలో దృశ్యం మారడానికి వీలయ్యే ట్రాలీ స్టేజీని మొట్టమొదటగా నాగేశ్వరరావే ప్రవేశపెట్టారు. సురభి నాటక కళా సంఘం స్థాపించడంతో పాటు సురభి సప్తతి స్వర్లోత్సవాలు జరిపి, ప్రత్యేక సంచి) ప్రచురించారు.
రాజు (బలిదానం)
శ్రీకృష్ణదేవరాయులు
దుర్యోధనుడు
మాయల మరాఠిరామదాసు
శ్రీరాముడు
హరిశ్చంద్రుడు


తెనాలి వర్తక సంఘం నాగేశ్వరరావు దంపతులకు కనకాభిషేకం చేసి, నవరత్నహారం బహూకరించింది.
1959లో బాపట్ల విజ్ఞాన సమితి నాగేశ్వరరావుకు నట రాజేంద్ర అనే బిరుదునిచ్చి సన్మానించింది.

గాలివీడు గ్రామంలో సువర్ణ ఘంటాకంకణం బహూకరించారు
బలిదానం, శ్రీకృష్ణదేవరాయలు నాటకాలు ప్రదర్శనకు కావాలసిన లైటింగ్ మొదలైన పరికరాలు కొనుక్కోవడానికి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభించింది
శ్రీ  1967, సెప్టెంబర్ 26 న నాగేశ్వరరావు దివంగతులయ్యారు
★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐(సేకరణ-నూలు)
★★★★★★★★★★

5, నవంబర్ 2020, గురువారం

శ్రీ అక్కి వెంకటేశ్వర్లు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

అక్కి వెంకటేశ్వర్లు 
తెలుగు రంగస్థల నటులు.
జననం
వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం 
శ్రీవెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది.వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది.ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది.  ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు.

నవయువక నాట్యమండలి (చుండూరు) లోను, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి సమాజంలోను, ఇతర నాటక సమాజాల వారి నాటకాలలో నటించారు.
ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ నాటకరంగంలో  నటించేవారు.. 

నటించిన నాటకాలు .. పాత్రలు 
కురుక్షేత్రం - అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ
రామరావణ యుద్ధం - ఆంజనేయుడు
తులనీ జలంధర - శంకరుడు
గయోపాఖ్యానం - ధర్మరాజు
సీతారామకల్యాణం - విశ్వామిత్రుడు
సన్మానాలు 
చుండూరు, తెనాలి, గుంటూరు, నెల్లూరు, చిలకలూరి పేట, అన్నవరం, చేబ్రోలు, నారికేలపల్లె, చిలుమూరు రామూ రూరల్ కాలేజిలో, హైదరాబాద్ త్యాగరాయగాన సభ (10.6.96) లో ఘన సన్మానాలు జరిగాయి.

(సేకరణ-నూలు)

4, నవంబర్ 2020, బుధవారం

శ్రీ గూడూరు సావిత్రి

చలన చిత్ర రంగంలో  నాయక పాత్రలో,ఎంతమెప్పించారో...ప్రతినాయకపాత్రలోనూ అంతే మెప్పించిన ఏకైక నటుడు అన్న ఎన్టీఆర్ ... 

 తెలుగు నాటక రంగంలో సాద్వీమణి సీత పాత్రను... రాక్షస స్త్రీ శూర్పణఖ పాత్రను 
అలాగే సాత్వికమైన చంద్రమతిపాత్రను...రాజసమైన నాయకురాలు నాగమ్మ..అలాగే. రుక్మిణీ...కైక  లాంటి పరస్పర విరుద్ధమైన వైవిధ్య పాత్రలను పోషించి, మెప్పు పొందినదీ రంగస్థల నటీమణి.... 
ఆమే ఈనాటి మన చిరస్మరణీయురాలు...
శ్రీ గూడూరు(ఆవేటి) సావిత్రి

అందమైన రూపం.
మధురమైన గాత్రం... 
శ్రావ్యమైన స్వరం...
స్పష్టమైన పలుకులు...
నిరాడంబరత్వం...
వృత్తియెడల భక్తి...
మృదుస్వభావం...
 సమయపాలన..
అంకితభావం...
సహానటులయెడల సృహృదభావ వైఖరి...
నిగర్వం..లాంటి సద్గుణాలు ఆమె ను నాటకరంగంలో ఉన్నత శిఖరాలలో నిలిపాయనడంలో సందేహం లేదు.

ప్రశాంతమైన,నిర్మలమైన వదనం... 
కన్నుల్లో కనిపించే  ఆత్మీయత... 
పెదవులపై పలకరించే చిరుదరహాసం,... 
ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా....
 ఏ మాత్రం  మచ్చుకైనా కానరాని
అతిశయం...అహంకారం... 
చూడగానే ఆమె పై గౌరవభావాన్ని.. కలిగిస్తాయి...
 
1950 లో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే బాల పాత్రలతోనే పేరుతెచ్చుకున్నసావిత్రి గారు, యుక్తవయస్సు రాగానే స్త్రీ,పురుష పాత్రలను అలవోకగా -అద్వితీయంగా
అనితరసాధ్యంగా పోషించి,ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించి,నటిగాఉన్నత శిఖరాలను 
అధిరోహించారు.

గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆవేటి సావిత్రి ప్రముఖ రంగస్థల నటీమణి.

★జననం
ఈమె నారాయణరావు,
అంజనీదేవి దంపతులకు 1942 సంవత్సరములో కడపజిల్లా కస్తూరీ రాజుగారి పల్లెలో జన్మించారు.
★బాల్యం
తన ఐదవ యేటనే న్యూ పూర్ణానందా డ్రమేటిక్ థియేటర్ అనే  సురభి నాటక సమాజంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడు పాత్ర తో నాటకరంగ ప్రవేశం చేశారు..
 నెల్లూరు జిల్లా గూడూరు
ప్రాంతంలో నివసించడం వల్ల 
గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందింది.
 శ్రీ సాయన ప్రకాశరావు ఈమె రంగస్థల గురువు. 
బాల్యంలో,శ్రీకృష్ణ లీలల్లో కృష్ణుడు, కనకతారలో కనకసేనుడు, తార, ,లవకుశ లో లవుడు, కుశుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు,  మొదలగు పాత్రలు ధరించారు.

తరువాత కాలంలో..
సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య,ద్రౌపది, మండోదరి, శశిరేఖ,  వాసవి, లీలావతి, చింతామణి,చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, , రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు.

భరణి ఆర్టు థియేటర్ అనే నాటక సమాజాన్ని స్థాపించి, తాను , ఆ సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఆ సంస్థలోని నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు. ఇతర సమాజాలలో నటించడంతో పాటుస్వంత 
నాటకాలను ప్రదర్శించారు.

★నాటకాలు - పాత్రలు 
బాల్య దశలోనే కనకతారలో కనకసేనుడు, తార, శ్రీకృష్ణ లీలలు ల్లో కృష్ణుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు, లవకుశలో లవుడు, కుశుడు మొదలగు పాత్రలు ధరించారు. చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, ద్రౌపది, మండోదరి, శశిరేఖ, సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య, వాసవి, లీలావతి, చింతామణి, రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు. మరెన్నో సాంఘిక, చారిత్రక నాటకాల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు ధరించిన ఈవిడ పురుషపాత్రలను కూడా పోషించి, తన నటనా వైద్యుష్యాన్ని వెల్లడించారు. కృష్ణుడు, రాముడు, సత్యవంతుడు, కార్యవర్థి, బిల్వమంగళుడు మొదలగు పురుష పాత్రలు ధరించారు.

 పౌరాణిక పద్యనాటకాల్లో పలు ప్రధాన పాత్రలను పోషించి ప్రసిద్ధి చెందిన సావిత్రి గారు ప్రారంభంలో ఎన్నో సాంఘిక నాటకాల్లోనూ నటించారు.
ప‌రువుకోసం,నటరాజు, పునర్జన్మ, తుఫాను, తరంగాలు, దొంగలొస్తున్నారు జాగ్రత్త,ఎదురీత,పల్లెపడుచు,అన్నాచెల్లెలు,చీకటిదొంగలు,ఎండమావులు,కమల,
పెదవులు-పదవులు, 
మేనరికం, రాజీవం ,మొదలగు 
సాంఘిక నాటకాలలో 
తననటనా కౌశలాన్ని,
ప్రదర్శించారు.
 
అలనాటి నాటక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన ఉద్దండనటులు సర్వశ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు, బేతా రామచంద్రారావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, చీమకుర్తి నాగేశ్వరరావు, అబ్బూరి వరప్రసాదరావు,వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ఆచంట వెంకటరత్నం నాయుడు, వేమూరి రామయ్య, అమరాపు సత్యనారాయణ, కె. రఘురామయ్య, పులిపాటివెంకటేశ్వర్లు,ఎ.వి.సుబ్బారావు, 
డి.వి. సుబ్బారావు, బండారు రామారావు, వేమూరి రామయ్య , రేబాల రమణ, కాగిత సుబ్బారావు, వేమూరి గగ్గయ్య  పొన్నాల రామసుబ్బారెడ్డి, వై. గోపాలరావు, మద్దాలరామారావు,మొదలగు నట ప్రముఖుల సరసన వారికి దీటుగా నటించి ప్రశంసలందుకున్నారు.

 మూడు తరాల నటులయిన  తాత, తండ్రి, మనవడు అయిన వేటపాలెం డి.వి. సుబ్బారావుగారితో, వారి కుమారుడు వెంకట సుబ్బయ్య గారితో, మనవడు డి.వి. సుబ్బారావు గారితో ‘చంద్రమతి’గా అనేక ప్రదర్శనలు చేశారు.

ఈమె పలు పరిషత్తు పోటీలలో శతాధికంగా ‘ఉత్తమనటి’ బహుమతులందుకున్నారు. 

★అవార్డులు - సత్కారాలు
అవార్డులు ఈమెను వరించటమే వాటికి రివార్డుగా భావించేవి అనుటలో అతిశయోక్తి లేదేమో..

సినీనటి సావిత్రి అవార్డు, జమున అవార్డు,
స్థానం నరసింహారావు అవార్డు, 
ఆం.ప్ర.. ప్రభుత్వం వారిచే కళారత్న అవార్డు,
పైడి లక్ష్మయ్య అవార్డు, 
హంస అవార్డు,  , కృష్ణకుమారి అవార్డు, 
దక్షిణ మధ్య రైల్వేవారి లింకా అవార్డు మరెన్నో అవార్డులు ఈమెను వరించి తరించాయి.

సన్మానాలు...సత్కారాలు...
పురస్కారాలు...
కనకాభిషేకాలు..సువర్ణ హస్త కంకాణాలు,
పట్టు వస్త్రాలు...పట్టు శాలువాలు...
రజితపతకాలు...జ్ఞాపికలు...
ఒకటా.. రెండా,,ఎన్నో,,మరెన్నెన్నో.....
నాటకరంగంలో  అత్యంత గౌరవం పొందినదీ విదూషణిమణి..

మహానటి,అభినయ శారద, అభినవ శారద, కళాతపస్విని, సరస నయానాభినేత్రి,  మొదలగు బిరుదులను పొందారు.

సాయికృష్ణ యాచేంద్ర  వెంకటగిరి వారిచే సువర్ణ హస్త ఘంటా కంకణం,
విజయవాడ పురప్రముఖులచే కనకాభిషేకం, సువర్ణహస్త ఘంటా కంకణం, , 
నంద్యాల నంది పైపుల అధినేత ఎస్.పి.వై. రెడ్డి గారిచే బంగారు పతకం, 
పొదిలి పురప్రముఖులచే బంగారు పతకం, 
బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, 
ఆంధ్రా గవర్నర్ కృష్ణకాంత్, 
ఆంప్ర. ముఖ్యమంత్రులు డా. ఎన్.టి. రామారావు, 
నారా చంద్రబాబునాయుడు తదితర రాజకీయ ప్రముఖులు ఈమె ప్రతిభను వివిధ రీతుల  సత్కరించారు.  
అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు.

డి.వి. సుబ్బారావు గారితో (వేటపాలెం) తో శతాధికంగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనల్లో చంద్రమతిగా నటించడమేకాక, వారి కాంబినేషన్ లో గ్రామ్‌ఫోన్ రికార్డు కూడా ఇచ్చారు.చీమకుర్తి నాగేశ్వరరావు హరిశ్చంద్రుడిగా, ఈవిడ చంద్రమతిగా, అలాగే శ్రీకృష్ణతులాభారంలో పృథ్వి వెంకటేశ్వర్లు నారదుడిగా, ఈవిడ కృష్ణుడుగా గ్రామ్‌ఫోన్ రికార్డు,  సి.డి.లు వెలువడినాయి. 

ఆకాశవాణిలో ఎన్నోపౌరాణిక నాటకాల్లో నటించిన ఈమె సినిమాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ,  నటించారు.

పసి ప్రాయంలో తన 5 వయేట  నాడు లోహితాస్యుడుగా  అడుకుంటూ కట్టెలు కోసం అడవికెళ్లే పాత్రతో  నాటకరంగంలో కాలుమోపిన ఈ చిన్నారి పాప...  తదుపరి ఆరు దశాబ్దాలు సుదీర్ఘ నాటక రంగ ప్రస్థావనలో నాటక రంగంలో ఎన్నెన్నో వైవిధ్యమైనపాత్రలను,వాటి మూల స్వభావాన్ని,పాటలనూ,
పద్యాలనూ,రాగాలనూ.సంభాషణలనూ,అత్యంత ధారణ ప్రతిభతో తన మెదడు లో నిక్షిప్తం చేసుకుని,నటననూ,  నాటకాన్ని,,ఆహారహారం,,,ఆద్యంతమూ,,ప్రేమిస్తూ..ఆలోచిస్తూ,,ఆరాధిస్తూ..ఆవాహనచేస్తూ,,.ఆపోసనపడుతూ,...అనుభవిస్తూ.. రంగస్థలంపై ఆడుకుంటూ...అభినయిస్తూ,,
ఆలపిస్తూ,,అనుభూతి చెందుతూ...ఆనందిస్తూ...
ఆనందింపచేస్తూ...అభినందింపచేస్తూ..అశేష ఆంధ్రప్రేక్షకుల అత్యంత అభిమానం,ఆదరణలను 
పొందిన  అసమాన నటీమణి గా పేరుగాంచి, ..జాతస్య మరణం ధృవం... అని రుజువు చే సి 0-1-2012 న శివసాయుజ్యం పొండినదని
చెప్పక తప్పడం లేదు
 ఓం శాంతి... శాంతి...శాంతి...
★★★★★★★★★★★★★
ఆ మహా నటీమణి కివే మా నివాళులు...!!💐💐
★★★★★★★★★★★★★

..

 .

3, నవంబర్ 2020, మంగళవారం

శ్రీ అల్లు రామలింగయ్య

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

ఆయనదేమో పాలకొల్లు...
ఆంధ్రదేశానికి ఆయనో హాస్యపు విరిజల్లు..
ఎవరు...!!ఇంకెవరు..!!
ఆయనే మన రామలింగయ్య అల్లు..ఆయనే నేటి మన చిరస్మరణీయులు..

తెలుగు చిత్రసీమలో ఏమీ కానీ స్థాయి నుండి తెలుగు చిత్రసీమలో అంతా నా వారసులే అని చెప్పుకోదగ్గ స్థాయికి చేరిన మహానటుడు.. *శ్రీఅల్లు రామలింగయ్య* ..

 పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవారు అల్లు రామలింగయ్య .

★బాల్యము
"పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవారు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవారు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నారు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసారు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించారు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చారు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లారు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవారు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపారు.
★చలనచిత్ర జీవితం
అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించారు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చారు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్య సేవలందించేవారు.
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణి"ముత్యాలు"గా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటులు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించారు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటులు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పురస్కారాలు, సన్మానాలు
యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కోడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితం లో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
వీరు జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసారు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.
★★★★★★★★★★★★
ఆంధ్రదేశానికి చార్లీ చాప్లిన్లా నవ్వుల్లో ముంచిన..నవ్వులు పంచిన... ఆ మహనీయునుకి మా నివాళులు...!!💐     (-నూలు)
★★★★★★★★★★★

2, నవంబర్ 2020, సోమవారం

శ్రీ వంగర..( వంగర వెంకట సుబ్బయ్య)

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

5 అడుగుల చిలుకు ఎత్తు..
పూజారి పంచెకట్టు..
నుదిటిపై నిలువు బొట్టు
ఒంటిపైన ఉత్తరీయం...
చేతిలోకర్ర...
 పలికే పలుకుల్లో  స్పష్టత...
తీక్షణమైన కంటి చూపులు.. 
ప్రతిపదాన్ని నొక్కి పలికే మధురమైన ఉచ్ఛారణా మాధుర్యం...
 వెరసి, ఒక సనాతన సత్ బ్రాహ్మణోత్తముని రూపానికి మనసులో పడే ముద్ర...
ఆయనే వంగర..
శ్రీ వంగర వెంకట సుబ్బయ్య..  నాటక రంగాలలో "వంగర" గా ప్రసిద్ధుడైన  రంగస్థల చలన చిత్ర హాస్యనటులు. 
వీరే నేటి మన చిరస్మరణీయులు...

ఏమిటయా నీ లీల.... కృష్ణా...
ఏమిటయా నీ లీలా... 
అనే పాట..గుర్తొచ్చిందా.. !!

సురేష్ పొడక్షన్ వారి "శ్రీకృష్ణ తులాభారం" చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుని నుండి రుక్మిణికి సందేశం చేరవేసే వార్తాహరుని పాత్ర లో వీరి నటన 
న భూతొ...న భవిష్యతి..
వీరే ఈ పాత్రలకు సాటి... 

"మాయా బజార్" సినిమా అల్లు రామ లింగయ్య గారి జోడీగా వీరు పండించిన హాస్యం చెప్పనక్కరలేదు..

 ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న జన్మించారు.తండ్రిపేరు కోటయ్య...తల్లిపేరు వెర్రెమ్మ...

★రంగస్థల ప్రవేశం
1901 లో 4 ఏండ్ల పసి ప్రాయంలో చిత్రనళినీయం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు వంగర..

యుక్తవయస్సులోకొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.పిదప తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. పిమ్మట రామావిలాస సభలో చేరి,ప్రసిద్ధ నటులు యడవల్లి సూర్యనారాయణ గారితో కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో నాటకాల్లో వేషాలు వేశారు.. వారితో విదేశాలకు కూడా వెళ్లి నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు.

★చలనచిత్రరంగ ప్రస్థానం 
1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.

వీరు 1976లో  శివ సాన్నిధ్యం పొందారు...
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (-నూలు)
★★★★★★★★★★★

1, నవంబర్ 2020, ఆదివారం

శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
శ్రీ ఋష్యేంద్రమణి
ప్రముఖ తెలుగు రంగస్థల, చలనచిత్ర నటి...నర్తకి..
అలనాటి ప్రముఖ కథానాయకులకు...తల్లిగా...పెద్దమ్మగా...అక్కగా..అత్తగారిలా  ..సాదుస్వభావ పాత్రలలో నటించి,తన కంఠం లోనూ.. మాటలలోనూ..హావభావములలోనూ చక్కని తెలుగుతనాన్ని చిలికించి,,అచ్చం  మా అమ్మ లాగావుందే..అక్కలాగా ఉందే... మా నానమ్మ లా ఉందే... అని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేటట్లు తనదైన నటనతో రంజింపచేసినది.. కొన్ని చిత్రాలలో గయ్యాళి పాత్రలలో కూడా  గడ గడ
లాడించింది...ఈ సీనియర్ నటీమణి...శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి...ఈనాటి మన చిరస్మరణీయురాలు...

ఈమె కృష్ణా జిల్లా విజయవాడ పట్టణములో 1917 సం:లో జనవరి నెల ఒకటవ తేదీన జన్మించింది..
తన 10 వయేటనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె సాంప్రదాయ...క్లాసికల్ సంగీతంతో పాటు కూచిపూడి నాట్యం  కూడా చిన్నతనము నుండీ నేర్చుకున్నది...
కృష్ణ,,ప్రహ్లద పాత్రలతో నట జీవితమును ఆరంభించింది.. తదుపరి కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీ విలాస నాటకసభ లో చేరింది.
శ్రీమతి పువ్వుల రామతిలకం...శ్రీ కపిలవాయి రామనాధశాస్త్రి లాంటి ఉద్దండ నటులవద్ద నటనలో మెరుగులు దిద్దుకుంది...
కొన్ని నాటకాల్లో చింతామణి.. సావిత్రి లాంటి పాత్రలు పోషించింది...
1935సం:లో శ్రీ రాజారావు నాయుడు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రలో సినీరంగ ప్రవేశం చేసింది.ఆ చిత్రంలో ఈమె గాయనిగా...నటిగా మంచి ప్రశంసలు పొందినా... చిత్రం ఆర్థికంగా పెద్దగా విజయం పొందలేదు.
తదనంతరం...కడారు నాగభూషణం..
కన్నాంబ గారు స్థాపించిన రాజరాజేశ్వరీ నాట్యమండలి లోచేరి... మూడు సంవత్సరముల పాటూ..తమిళనాడు..కర్ణాటక..మహారాష్ట్ర..ఒరిస్సా..రాష్ట్రాల్లో తిరిగి పలు పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రంగూన్ రౌడీ లో ప్రభావతిగా...పౌరాణిక పాత్రలలో నారదుడు గా...సావిత్రిగా మంచి పేరు సంపాయించుకుంది...
1939 లో ప్రముఖ హార్మోనిస్ట్ జవ్వాది రామకృష్ణ నాయుడిని పెండ్లాడింది.
ఋష్యేంద్రమణి  భర్త జవ్వాది రామకృష్ణారావు "మాతృభూమి" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడా చెన్నై చేరి "పాండురంగ విఠల్" అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించింది. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన "శిలప్పాడికరం" ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో "కణగి" పాత్ర ధరించింది. ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి సూర్యప్రకాశరావు ధరించాడు. కణగి పాత్రను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఆ తరువాత "చెంచులక్ష్మిలో" ఆదిలక్ష్మి పాత్ర, "సీతారామ జననంలో" కౌసల్యగాను, సేతుబంధన్ లో ఇంద్రాణిగా, "భక్త సిరియాళలో" కథానాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తుందో, శోకభరిత కరుణారస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేది. మల్లీశ్వరిలో తల్లి పాత్రనూ, విప్రనారాయణలో వేశ్య పాత్రనూ, మాయాబజార్, జగదేకవీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలు పోషించింది.
..
1943 నాటి చెంచులక్ష్మి సినిమాలో ఋష్యేంద్రమణి పాడిన 'నిజమాడు దాన నీదాన" పాట. సినిమాలో ఋష్యేంద్రమణి ఆదిలక్ష్మి పాత్ర ధరించింది.
ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటానికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం ఇప్పటికికూడ ఎంతగానో ప్రజాదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
దాదాపు దక్షిణాది అన్ని భాషల్లోనూ 150 చిత్రాల్లో నటించిన ఈమె కార్వేటి నగరం మహారాజా గారి చేతుల మీదుగా "మధురగాన సరస్వతి" అనే బిరుదును అవార్డుగా అందుకుంది...
ఈమె తన మనమరాలయిన కన్నడి నటి భవానితో 1974లో" భూతయ్య" అనే కన్నడ చిత్రంలో కలిసి నటించింది..

శ్రీ ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.
★★★★★★★★★★★★★
💐ఆమె కివే మానివాళులు...!! (-నూలు)
★★★★★★★★★★★★★

31, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ దైతా గోపాలం

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈనాటి  మన చిరస్మరణీయులు *శ్రీ దైతా గోపాలం* 
రంగస్థల, సినీ నటులు, రచయిత..
వీరు కృష్ణా జిల్లా..శ్రీకాకుళం గ్రామం శివార్ల లో ఉన్న పాపనాశనం లో 1900 వ సం:లోజన్మించారు

తెలుగు నాటకరంగం, మరచిపోలేని మేటి కళాకారుడు. ఈయన అనేక నాటకాలు ఆడారు. అచ్యుత రామశాస్త్రి రచించిన 'సక్కుబాయి' నాటకాన్ని దైతా గోపాలం తన సొంత పాటలతో దర్శకత్వంతో నడిపించారు. సుప్రసిద్ధ చిత్రసంగీత 

దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు సక్కుబాయి పాత్రను నేర్పి చాలాసార్లు ప్రదర్శించారు. 
మైలవరం కంపెనీ లూ పూర్తి నాటక సభ్యులు గా వున్నారు. నాటకాల్లోనేకాక సినిమా రచయితగా కూడా పేరుగాంచారు. శ్రీరాజరాజేశ్వరీ ఫిలింకంపెనీ అధినేత కడారు నాగభూషణం ఆదరణతో వారి చిత్రాలు సతీసుమతి (1941) సతీ సక్కుబాయి (1954) శ్రీకృష్ణ తులాభారం (1955) మొదలగు చిత్రాలకు రచయితగా పనిచేశారు. 'సతీసుమతి'లో ఆయన వ్రాసిన నిన్న సాయంత్రమున అనేపాట ఎంతోపేరు తెచ్చిపెట్టింది. ఈయన 'వరవిక్రయం' చలన చిత్రంలో కూడా నటించారు. ఘంటసాల, అక్కినేని వీరిని తరచూ కలుస్తూ ఈయన సలహాలను గైకొనేవారు. 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం ఇతడు పాటలు సమకూర్చిన చివరి చిత్రం

దైతా గోపాలం రంగస్థలం బయట కూడా చాలా సౌమ్యంగా, సాధువులాగా ఉండేవారు. ఆయన సాధువు పాత్రలు వేయటంలో బాగా రాణించారు. విదురుడు, అక్రూరుడు ఈయనకు బాగా నచ్చిన పాత్రలు. సక్కుబాయి నాటకంలో శివయోగి పాత్రను కూడా ఈయన చిరస్మరణీయం చేశాడు.
వీరు 1958 లో దివంగతులయ్యారు.
★★★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★★★

29, అక్టోబర్ 2020, గురువారం

శ్రీకిలాంబి కృష్ణమాచార్యులు

★★★★★★★★★★
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈనాటి మన చిరస్మరణీయులు...
శ్రీ కిళాంబి కృష్ణమాచార్యులు 
రంగస్థల నటులు, దర్శకులు , నాట్యాచార్యలు
★జననం 
శ్రీ కృష్ణమాచార్యులు 1900, మే 5న ధర్మాచార్యులు...చూడమాంబ దంపతులకు జన్మించారు.

★నాటకరంగ ప్రస్థానం...
పండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే కాకినాడకు వెళ్లి, వెదురుమూడి శేషగిరిరావు, ముప్పిడి జగ్గరాజు, ఆలమూరు పట్టాభిరామయ్య మొదలైన మహానటులతో కలిసి నటించడమేకాకుండా, అనకాపల్లి లోని లలితా సమాజం ప్రదర్శించిన ప్రదర్శనలలో నటించారు. 1917లో లలితా సమాజానికి కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. నటులకు శిక్షణ ఇవ్వడంలో తగిన ప్రతిభ కలవారు. ఈయన శిక్షణలో రూపొందిన నటులు నాటక, సినీరంగాలలో రాణించారు. ఈయన నాటక కృషిని గుర్తించి ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1950లో ఘనంగా సన్మానించింది.

★దర్శకత్వం చేసినవి ...
అనార్కలి
చాణక్య
ఆంధ్రశ్రీ
వేనరాజు
కురుక్షేత్రం
★నటించిన పాత్రలు...
శ్రీరాముడు
శ్రీకృష్ణుడు
కంసుడు
రుక్మాంగదుడు
విశ్వామిత్రుడు
ధర్మరాజు
భవానీ శంకరుడు
బిల్వమంగళుడు
>లింగరాజు
శర్మ (మధుసేవ)
అక్బర్
భరతుడు
దుర్యోధనుడు<,>అర్జునుడు
1957లో కృష్ణమాచార్యులుకు చక్కెర వ్యాధి రావడంతో కుడికాలు తొలగించవలసివచ్చింది.  
వీరు1959, జూలై 27న శివ సాన్నిధ్యం పొందారు.
★★★★★★★★★★★
💐వీరికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

28, అక్టోబర్ 2020, బుధవారం

బి.వి.రంగారావు

శ్రీ బి.వి. రంగారావు
 ప్రముఖ రంగస్థల నటులు, కళాప్రవీణ బిరుదాంకితులు.

శ్రీ రంగారావు 1920, సెప్టెంబర్ 24 న నరసింహారావు, సీతారావమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, విజయవాడ సమీపంలోని తెన్నేరు లో జన్మించారు. 12 సంవత్సరాల వయసులో తల్లి మరణించడంతో మేనమామైన తెన్నేటి చలపతిరావు దగ్గర ఉండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరారు.

★రంగస్థల ప్రస్థానం
వెంట్రప్రగడ నారాయణరావు ప్రోత్సాహంతో మారుతీ సీతారామయ్య (హార్మోనిస్టు) దగ్గర శిక్షణ పొందారు. అనంతరం పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం మొదలైన నాటకాలలో అర్జునుడి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. పులిపాటి వెంకటేశ్వర్లు తరువాత అర్జున పాత్రలో విశేష గుర్తింపు పొందారు. బందా కనకలింగేశ్వరరావు ప్రోద్భలంతో ఏలూరు ప్రభాత్ నాటక సమాజంలో చేరి ఆయన పక్కన అర్జునుడు, భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం) పాత్రలలో నటించారు.

బందా విజయవాడలోని ఆలిండియా రేడియోలో చేరడంతో, బి.వి.రంగారావు వృత్తి నటుడిగా వెలుగొందారు. ప్రముఖ రంగస్థల నటులైన అబ్బూరి రామకృష్ణారావు, అద్దంకి శ్రీరామమూర్తి, మాధవపెద్ది వెంకటరామయ్య మొదలైన వారితో కలిసి నటించారు. అనంతరం పీసపాటి నరసింహమూర్తి పక్కన అర్జునుడి పాత్రలో రేడియో నాటకాలలో నటించారు. ఈయన వివిధ నాటకాలలో విభిన్న పాత్రలలో నటించినా, అర్జునుడి పాత్రలోనే ఎక్కువపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1975, సెప్టెంబర్ 30న రంగారావు ఉద్యోగ విరమణ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. అప్పుడు విజయవాడ పట్టణ పౌరులు, కళాకారులు రంగారావును ఘనంగా సన్మానించారు. కళారంగ వికాసం కోసం కృషి చేసిన బి.వి. రంగారావును ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కళాప్రవీణ బిరుదునిచ్చి సత్కరించింది.

★నటించిన పాత్రలు:
అర్జునుడు (పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం)
భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం)
హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్ర
శివాజీ (శివాజీ) - నెల్లూరు లో గవర్నరు చేతుల మీదుగా రజత పాత్ర బహుమతిగా వచ్చింది.
శ్రీ రంగారావు 1996లో ఆ నటరాజు సాన్నిధ్యం చేరారు.

శ్రీ ఆడబాల

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

 శ్రీ అడబాల
(కందిమళ్ల సాంబశివరావు)
 నటులు, రూపశిల్పి, 
లలిత కళా సమితిలో స్థాపక సభ్యులు, 
రంగస్థల అధ్యాపకులు.
ఈయన 1936, ఫిబ్రవరి 9 న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించారు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించారు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. 
ఈయన బి.ఏ పట్టభద్రుడు. 
డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశారు. విద్యార్థి దశలో భమిడిపాటి 'ఇప్పుడు' అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నారు. 
మద్రాస్ లో రైల్వేశాఖ ఉద్యోగం.
కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో 'ఫణి, రాగరాగిణి' వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నారు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, 
హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నారు. 

1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యులలో ఒకరయ్యారు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నారు. అందులో ముఖ్యమైనది 'మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా' మొదలైన నాటకాలు, 'మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి 'మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి.

 అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీస్ స్టేషను మొదలైన చిత్రాల్లో కూడా నటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశారు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశారు. ఈయన శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించారు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చారు.

నటుడిగా30 నాటకాల్లో నటించినా,
రూపశిల్పిగా రమారమి నాలుగు వేల
నృత్య,నాటక ప్రదర్శనకు మేకప్ చేసి,
రంగస్థలంతో దాదాపు ఆరుదశాబ్దాల అనుబంధం పెనవేసుకొన్న ఈయన,
ఆహార్యంలో  అగ్రతాంబూలం అందుకొన్న వీరు,
మార్చి 14, 2013న మరణించారు.
      (సేకరణ-నూలు)
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

23, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీ సురభి కమలాబాయి

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం వహించే సురభి నాటకాల చరిత్ర ఆంధ్రులందరికీ పరిచయమైనదే. ఆంధ్రనాటకరంగానికి తొలి ఉత్సాహాన్ని ఇచ్చిన ధార్వాడ కంపెనీవారూ, 
తోలు బొమ్మల ఆటలవారూ 
ఏ మహారాష్ర్టులో, 
ఈ సురభి నాటక కళాకారులు కూడా 
ఆ మహారాష్ట్రులే.
సురభి కళాకారులు ఆంధ్రనాటకరంగానికి 
అపార మైన సేవచేశారు. 
కేవలం భుక్తికొరకే కాక కళాదృష్టితో 
వారు నాటకాలను ప్రదర్శిం చారు. 
కుటుంబాలు కుటుంబాలే ఆంధ్రదేశపు 
నాలుగు చెరగులా విస్తరించి నాటకరంగానికి బహుముఖ సేవ చేశారు.

అలా సేవచేసిన కుటుంబాలకోవకు చెందినదే 
సుప్రసిద్ద చలనచిత్ర ప్రథమ కథానాయకి 
సురభి కమలాబాయి.

కమలాబాయి 1908 ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాదులో జన్మించింది. 
తండ్రి ప్రసిద్ధ సురభికళాకారుడు 
వనారస పెద కృష్ణాజీరావుగారు. 
తల్లి వెంకుబాయి. ఈమె మహా సంగీత విద్వాంసురాలు. జంఝూటి రాగాలాపన చేయడంలో అందెవేసిన విదుషీమణి. అందువల్ల ఈమెను 
జంఝూటి వెంకుబాయి 
అని పిలిచేవారు.

కమలాబాయి తండ్రి కృష్ణాజీరావుగారికి స్వంత 
సురభి నాటక సమాజం ఉండేది. 
కళాకారుల కుటుంబంలో పుట్టిన కమలాబాయి చిన్నతనంలోనే వారి సమాజ నాటకాలలో బాలకృష్ణుడు. ప్రహ్లాదుడు, లవుడు మొదలైన బాలపాత్రలను అద్భుతంగా పోషించింది.

కమలాబాయి నహజసౌందర్యవతి, 
కమ్మని కంఠం, స్వచ్ఛమైన, శ్రావ్యమైన ఉచ్చారణ, పాత్రపోషణలో ఆమెకు ఆమెయే సాటి.

బాలవేషాలతో పేరు తెచ్చుకున్న కమలాబాయి యుక్తవయస్సురాగానే సమాజంలోని కథానాయకి పాత్రలను అన్నిటినీ కడు సమర్థనీయంగా నటిస్తూ, తండ్రి గారి అనంతరం సమాజాన్ని స్వయంగా 
తానే నిర్వహించింది.

కమలాబాయ నటజీవితంలో 
కొన్ని వందల సువర్ణ, రజత పతకాలను 
బహమతిగా పొందింది.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనాలలో 
మధ్య మధ్య వచ్చే విరామసమయాలలోనూ, 
హాస్య సన్నివేశాలలోనూ 
అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేది.

ఆమెకు సహజ సంగీతజ్ఞానం ఉన్నా, 
హిందూస్థానీ సంగీతం నేర్చుకోవాలనే 
కుతూహలంతో బొంబాయి వాస్తవ్యుడు 
పరశురాంబువ వద్ద హిందూస్థానీ సంగీతాన్నీ అభ్యసించి బాలగంధర్వగా ప్రశంసలను అందుకుంది.

తెలుగు టాకీయుగం ప్రారంభమైన తరువాత ప్రప్రథమంగా చలన చిత్రాలలో కథా నాయకి పాత్రధరించిన ప్రప్రథమ తెలుగు వనిత సురభికమలాబాయి. 
ఆ ఘనత ఆమెకే దక్కింది.

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ,
1931లో  హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన 
తొలి టాకీ చిత్రం
'భక్త ప్రహ్లాద'లో హిరణ్యకశిపునిగా నటించిన 
మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన 
లీలావతిగా నటించారు.

తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో 
సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన 
'పాదుకా పట్టాభిషేకం'లో సీతగా 
అద్దంకి శ్రీరామమూర్తి సరసన, 
'శకుంతల'లో శకుంతలగా యడవల్లి సూర్యనారాయణతో నటించారు. 
బి.వి.రామానందం దర్శకత్వంలో 
కృష్ణా ఫిలింస్ నిర్మించిన 
'సావిత్రి'లో సావిత్రిగా 
టైటిల్‌ రోల్‌ పోషించారు. 
సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన 
'పృథ్వీపుత్ర'లో ఓ ముఖ్యపాత్ర పోషించారు.

కమలాబాయి ప్రతిభ గురించి విని, 
ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. 
అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. 
మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది.

1939లో విడుదలైన భక్తజయదేవ 
సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో 
నటించడం ప్రారంభించింది. 
విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే 
చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 
ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. 
ఈ రెండు భాషలలోనూ కమలాబాయే కథానాయకి. 
ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, 
సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. 
ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం 
సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, 
ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, 
చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ 
ఆశ్చర్యపరచింది కమలాబాయి.
అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం 
దర్శకుడిగా హిరేన్ బోస్ పేరే కనబడుతుంది.

అలాగే తొలి ద్విభాషా చిత్రమైన 
తుకారాం (1940) తెలుగు వెర్షన్లో 
ఈమె నటించింది. అప్పటి వరకు 
కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి
ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించింది. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, 
సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.

మద్రాసులో జరిగిన భారత చలన చిత్రోత్సవం సందర్భంలో దక్షిణభారత నటీనటసమాఖ్యవారు 
ప్రప్రథమంగా తెలుగు చిత్రాలలో నటించినందుకు 1957 జనవరి 17వ తేదీన ఒక షీల్డు, 
సన్మానపత్రం ఆమెకు ప్రదానంచేసారు.

1966లో ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్టుల అసోషియేషన్ వారు, 
1967లో ఏలూరులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలలో పరిషత్తువారు, 
1969లో ఏలూరు వై . ఎమ్. హెచ్. ఎ.వారు,  
నాటక సినిమా రంగాలకు 
ఆమె చేసిన సేవను ప్రశంసిస్తూ 
ఘనంగా సన్మానించారు.

హిందూస్థానీ సంగీతంతో పాటు హార్మనీ, 
సారంగీ, వయొలిన్ మొదలైన వాద్యాలను 
గొప్పగా వాయించేది.

కమలాబాయి హాస్య చతుర. 
సినిమా సెటులో ఉన్నప్పుడూ, 
విడిగానూ కడు చమత్కారంగా మాట్లాడేది.

అనేక తెలుగు నాటకాలలోనూ, 
సినిమాలలోనూ వివిధ పాత్ర లను 
అద్భుతంగా పోషించి ప్రసిద్ధ నటిగా 
వెలుగొందిన సురభి కమలాబాయి 
1971 ఫిబ్రవరి 18వ తేదిని ఏలూరులో 
ఆమె స్వగృహంలో స్వర్గస్థురాలైంది.

22, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ పసుపులేటి కన్నాంబ

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

నేటి మన చిరస్మరణీయురాలు..  ఆవేశంలో జగదాంబ...
అందంలో ఒక రంభ..
ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న *కన్నాంబ* పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1912లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.

పేరు తెచ్చిన సినిమాలు, 
ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.

ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.

సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.

కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964లో మే 7 వ తేదీన తుదిశ్వాస వదిలింది.

‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ..వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.

నటిగా ...
ఆత్మబలం (1964)
రామదాసు (1964)
పరువు ప్రతిష్ట (1963)
లవ కుశ (1963)
ఆప్తమిత్రులు (1963)
ఆత్మబంధువు (1962)
దక్షయజ్ఞం (1962)
స్త్రీ జీవితం (1962)
జగదేక వీరుని కథ (1961)
ఉషా పరిణయం (1961)
అభిమానం (1960)
రాజ మకుటం (1959/I)
అన్నా తమ్ముడు (1958)
మాంగల్య బలం (1958)
శ్రీకృష్ణ మాయ (1958)
కుటుంబ గౌరవం (1957) (1957)
తోడికోడళ్ళు (1957)
చరణదాసి (1956)
అనార్కలి (1955)
శ్రీకృష్ణ తులాభారం (1955)
మనోహర (1954)
సౌదామిని (1951)
పల్నాటి యుద్ధం (1947)
మాయాలోకం (1945)
మాయా మచ్చీంద్ర (1945)
పాదుకా పట్టాభిషేకం (1945)
మహామాయ (1944)
కన్నగి (సినిమా) (1942)
సుమతి (1942)
అశోక్ కుమార్ (1941)
తల్లిప్రేమ (1941)
భోజ కాళిదాస (1940)
ఛండిక (1940)
మహానంద (1939)
గృహలక్ష్మి (1938)
కనకతార (1937)
సారంగధర (1937)
ద్రౌపది వస్త్రాపహరణం (1936)
హరిశ్చంద్ర (1935)
సీతా కళ్యాణం (1934)
నేపధ్య గాయనిగా...
సుమతి (1942)
తల్లిప్రేమ (1941)
గృహలక్ష్మి (1938)
★★★★★★★★★B★★
💐ఆ మహానటికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★        (సేకరణ-నూలు)

శ్రీ విన్నకోట రామన్న పంతులు

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
కన్యాశుల్కం చిత్రంలో అగ్నిహోత్రావధానులు వేషంలో ఇప్పటివరకూ ఆయనే మేటి ...ఆయనది చక్కని స్పష్టమైన వాగ్దాటి...
వారే ఆనాటి మన చిరస్మరణీయులు...

శ్రీ *విన్నకోట రామన్న పంతులు* ఔత్సాహిక నాటక రంగానికి నటులుగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి.

తల్లిదండ్రులు
విన్నకోట వేంకటకృష్ణయ్య (తండ్రి)
అన్నపూర్ణమ్మ (తల్లి)
జీవిత విశేషాలు ..
ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తిరీత్యా న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటులుగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డారు. వీరు నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం,లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా రచించారు.. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని స్థాపించారు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించారు. జంధ్యాల, మురళీమోహన్, సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చారు. తెలుగు రంగస్థల, సినిమా నటుడు విన్నకోట విజయరాం ఇతని కుమారుడు. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు ప్రదీప్  వీరి మనుమడు.

నాటకరంగం 
ఇతడు 1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్‌.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవారు. ఇందులో అగ్నిహోత్రావధాన్లు పాత్రను రామన్నపంతులు గొప్పగా పోషించేవారు. రాఘవ కళాకేంద్రం ప్రదర్శించిన విశ్వం పెళ్ళి, ఇనుప తెరలు మొదలైన నాటకాల్లో రామన్నపంతులు విలక్షణమైన పాత్రలను ధరించి మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత డి.వి.నరసరాజు రచించిన "నాటకం" అనే నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించి తన కీర్తిని పెంచుకున్నారు. ఈ నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో రచన, ప్రదర్శనలకు బహుమతులు లభించాయి. ఇవే కాకుండా వరవిక్రయం, పెద్దమనుషులు, ఈనాడు, ఆసామి, శ్రీరంగనీతులు మొదలైన నాటకాలలో కూడా పాత్రలు ధరించారు. రామన్నపంతులు ఉత్తమ దర్శకుడిగా అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ఎన్.జి.వో., నాటకం, లేపాక్షి, సంభవామి యుగే యుగే, దశమగ్రహాలు ముఖ్యమైనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి మరణించేవరకూ అనేక నాటకాలలో పాత్రపోషణ చేసేవారు. సీతాపతి సంసారం ధారావాహిక నాటకంలో సీతాపతి పాత్ర ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది.

సినిమా రంగం
వీరు తెలుగు సినీరంగంలో ప్రవేశించి బి.యన్.రెడ్డి గారి బంగారు పాప (1954) చిత్రంలో మొదటిసారిగా జమిందారు పాత్రను పోషించారు. తర్వాత వినోదా సంస్థ నిర్మించిన కన్యాశుల్కం (1955) చిత్రంలో కూడా అగ్నిహోత్రావధాన్లు పాత్రను పోషించి తన నటనకు ప్రశంసలందుకున్నారు. బాపూరమణలు ఇతడిని పిలిచి తమ తొ_లిచిత్రం సాక్షి (1967) లో తడిగుడ్డతో గొంతులు కోసే ప్రతినాయకుడు మునసబు పాత్రను ధరింపజేశారు.

ప్రముఖ హాస్యరస చక్రవర్తి జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా ఇతని నాటకాల కంపెనీలో నటించారు. జంధ్యాల సినీ దర్శకునిగా మారిన పిదప తన తొలిచిత్రం ముద్ద మందారం (1981) లో కథకు కీలకమైన పాత్రను పంతులు చేత వేయించారు.

చిత్రసమాహారం 
బంగారు పాప (1954) - జమీందారు
కన్యాశుల్కం (1955) - అగ్నిహోత్రావధాన్లు
దొంగరాముడు (1955)
వరుడు కావాలి (1957)
బాటసారి (1961) - జమీందారు
శ్రీకృష్ణ కుచేల (1961)
చదువుకున్న అమ్మాయిలు (1963)
రామదాసు (1964)
ఇల్లాలు (1965)
శ్రీమతి (1966)
సాక్షి (1967) - మునసబు
బంగారు పిచిక (1968) - సన్యాసిరాజు
స్నేహం (1977)
ముద్ద మందారం (1981)
మల్లెపందిరి (1982)
ముగ్గురమ్మాయిల మొగుడు (1983)
వీరికి ఒక పుత్రుడు పేరు విన్నకోట విజయరాం 
వీరు 1982, డిసెంబర్ 19న
పరమపదించారు...
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

21, అక్టోబర్ 2020, బుధవారం

శ్రీ ఈవెన లక్షణస్వామి

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
ఈవెన లక్ష్మణస్వామి... 
 ప్రముఖ రంగస్థల నటులు. 

బందరు బుట్టయ్యపేట కంపెనీ అనే నేషనల్ థియేటర్ వారి నాటకాలలో ప్రముఖ పాత్రలను పోషించారు.. హిందీ నాటకాలలో కూడా నటించారు.

రంగస్థల నటులు
లక్ష్మణస్వామి 1864లో కొత్తపల్లి గ్రామంలో జన్మించారు.

★విద్యాభ్యాసం -
ఆంగ్లంలో లోయర్ సెకండరీ వరకు చదివిన లక్ష్మణస్వామి పార్సీ, హిందీ, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించారు.. బందరు ముస్లీం పారశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసి, అనంతరం విక్టోరియా పబ్లిక్ లైబ్రరీలో గుమస్తాగా పనిచేశారు..

★నటించిన పాత్రలు...
శివాజీ
పఠాన్ రుస్తుం
సుమేర్ సింగ్
భీమసింగ్
మంత్రి రామశాస్తీ
విక్రమార్కుడు
విశ్వామిత్రుడు (మేనక)
హరిశ్చంద్రుడు
హిరణ్యకశ్యపుడు
శ్రీకృష్ణుడు (సుభద్ర)
రాణా ప్రతాప్ సింగ్
హైదర్ జంగ్.
 
వీరు 1913, జనవరి 7న  దివంగతులయ్యారు.
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

19, అక్టోబర్ 2020, సోమవారం

నాటకం ఓ గొప్ప ప్రక్రియ. మహాకవి కాళిదాసు నాటకాన్ని “చాక్షూషమైన యజ్ఞం” అని గౌరవించాడు. యజ్ఞం చేసే ఋత్విక్వుల వంటివాడు నటుడు. అందరూ సుఖంగా భార్యాపిల్లలతో నిద్రపోయే ఎన్నోరాత్రులు, నటీనటులు నాటకనిర్మాణంలో, వ్యయపరచి, తమ సుఖాన్ని సంతోషాన్ని వదలుకొని, చెప్పలేనంత కష్టాన్ని, చెప్పుకోలేనంత శ్రమను ధారపోస్తారు. అప్పుడే ఓ నాటకం పుడుతుంది. పుట్టినబిడ్డను పదిమందికీ చూపించడానికి, పది ఊళ్ళూ తిరుగుతారు. చివరికి జనులా ప్రదర్శన చూసి, చప్పట్లు కొడితే ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు నటులు. ఎందుకోసం ఇదంతా? ఎవరికోసం ఇదంతా? ఈ జనం కోసమే. ఈ జనానందం కోసమే. అలా తమని తాము కొవ్యొతిలా కరిగించుకొంటూ, లోకానికి వెలుగునిచ్చే, నిస్వార్థ జీవులు కళాకారులు...

పువ్వుల రామతిలకం

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
చద్రబింబంలాంటి మంచి అందమైన వర్చస్సుగల మోము... అద్భుత హావభావాలు..వాచకం,పాట పద్యాలు చక్కని శృతితో శ్రావ్యంగా పాడటం.. మెరిసే చూపులు...వయ్యారపునడక...వీటన్నిటినీ కలగలిపి ఊహిస్తే కదిలే అందాల బొమ్మే పువ్వుల రామతిలకం...
అలనాటి ఆంధ్ర యువకుల హృదయ స్పందన...ఈమె సినిమా విడుదల రోజుల్లో గ్రామసీమలనుండి జనం కుటుంబం మొత్తం తో...
ఆహారపు ఏర్పాట్లతో చిరుదిళ్లులాంటి వాటితో, తాంబేటీకాయ మరచెంబులతో మంచినీళ్లు..పెట్టుకొని ఎడ్ల బండ్ల పై బారులు తీర్చి...పట్టణంలో ఉన్న సినిమా హాల్ కు వచ్చి చూచి...తెల్లవారి మరల తిరుగుప్రయానం చేసేవారు..ఈ సంఘటన అనుభవాన్ని మొత్తం మనసులో ప్రతిష్టించు కుని..నెమరవేసుకుంటూ కబుర్లు చెప్పుకునే వారు...
ఆరోజుల్లో విడుదల అయిన ఒక సినిమా ఇంచుమించు దక్షిణ భారతదేశంలో
అత్యంత ఆదరం పొందింది. అదే ""సావిత్రి"" చిత్రం...
1932లో, కలకత్తాలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన సావిత్రి చలన చిత్రం..సావిత్రి పాత్రలో పువ్వుల రామతిలకం జీవించింది..ఆ మరుసటేడే మదన్ ఫిలిమ్ కంపెనీ నిర్మించిన ""చింతామణి""సినిమాలో చింతామణిగా పేక్షకుల మనసులు దోచుకొంది..వేల్ పిక్చర్స్ ""కృష్ణ లీలలు""చిత్రంలో ఆమె యశోదగా నటించి,
ప్రేక్షకుల మనస్సులలో యశోదగా నిలచిపోయింది.."కలయో వైష్ణవ మాయయో"  అనే బమ్మెర పోతన గారి పద్యం ఆమె నోటివెంట ఎంత మధురంగా వినిపించిందంటే.. ఆ తరువాత మూడు దశాబ్దాల వరకూ..తెలుగు వారి ఇళ్ళలో ఆ పద్యం వినబడేదట.

ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందిన పువ్వుల రామతిలకం జన్మించినది మన బెజవాడ లోనే .
సుప్రసిద్ధ మృదంగ విద్వాంసులైన పువ్వుల వెంకట రత్నం గారు వీరి తండ్రి.
సంగీత విద్వాంసులైన పువ్వుల నారాయణ గారి దగ్గర ఈమె సంగీతం నేర్చుకొన్నారు.ఆమె గాత్ర మాధుర్యానికి కరిగిపోయిన మైలవరం కంపెని మానేజర్ కొమ్మూరు పట్టాభి రామయ్యగారు ఆమెకు తన లక్ష్మి విలాస సభలో అవకాశం కల్పించడం..అక్కడే ఆమె గొప్ప పేరు ప్రతిష్టలు ఆర్జించడం జరిగింది.
ఆ తరువాత గొప్ప నటులు,నిర్వాహకులైన కపిలవాయి రామనాధ శాస్త్రి గారి 
బాల భారతీ నాట్య మండలిలో చేరడం..తద్ద్వారా ఎన్నో గొప్ప పాత్రల్ని పోషించే అవకాశం,అదృష్టం ఆమెకు లభించాయి.

శ్రీ కృష్ణ లీలలు,శ్రీకృష్ణ తులాభారం,సతీ సక్కుబాయి,చింతామణి వంటి అనేక 
నాటకాలలో నటించి గొప్ప కీర్తి పొందింది..కాలం మారింది.సినీ ప్రపంచంలో నేపధ్య సంగీత ప్రాధాన్య పెరిగింది..తమ పాట తామే పాడుకోవడానికి ప్రాధాన్యత తగ్గడం ఆరంభమైంది..దానితో రామతిలకం క్రమంగా సినీ రంగానికి దూరమవక తప్పలేదు...

అపారమైన కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకొన్న రామతిలకం తిరిగి తన గూటికే చేరవలసి వచ్చింది..బెజవాడలోనే ఆమె 14-3-1952న 47 ఏళ్ల వయసులోనే ఈ  లోకాన్ని వీడింది..

"జాతస్య మరణం ధ్రువం."..కానీ కళాకారులు మరణించినప్పటికీ జనహృదయాలలో జీవిస్తా రణదానికి ..
నేను నేడు ఆమె పై వ్యాసం వ్రాయడం...
మీలాంటి రసజ్ఞులైన పాఠకలు చదవడం...      (-నూలు)
★★★★★★★★★★★💐ఆ మహా నట కిదే మా నివాళులు..!!💐
★★★★★★★★★★★

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్రయోధుడూ- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు! గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు. "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే.

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శిం చిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. అరవపల్లి సుబ్బారావు, ఆరణి సత్యనారాయణ, దేవతాసుబ్బారావు, నరసింహగుప్త, రెంటచింతల సత్యనారాయణ, భీమప్ప శ్రేష్టి, వంకాయల సత్యనారాయణ, రేపల్లె వెంకటశేషయ్య తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు.

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం! మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

రచనలు సవరించు
నటరత్నాలు (1980, 2002)
ఆంధ్ర నాటకరంగ చరిత్ర
తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
ప్రజా పోరాటాల రంగస్థలం
ఆంధ్రుల నృత్య కళావికాసం
తెలుగువారి చలన చిత్ర కళ
నటించిన సినిమాలు సవరించు
శాంతినివాసం (1986)
పులి బెబ్బులి (1983)
రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
గంధర్వ కన్య (1979)
చిరంజీవి రాంబాబు (1978)
దాన వీర శూర కర్ణ (1977) .... Bheeshma
సీతా కళ్యాణం (1976) .... జనకుడు
ఆడదాని అదృష్టం (1974)
బాల భారతం (1972) .... ధృతరాష్ట్రుడు
మావూరి మొనగాళ్ళు (1972)
సంపూర్ణ రామాయణం (1971) .... జనకుడు
బాలరాజు కథ (1970)
గండర గండడు (1969)
ప్రేమకానుక (1969)
దేవకన్య (1968)
కలిసొచ్చిన అదృష్టం (1968)
శ్రీకృష్ణావతారం (1967) .... ధర్మరాజు
పల్నాటి యుద్ధం (1966) .... కొమర్రాజు
అంతస్థులు (1965)
సి.ఐ.డి. (1965) .... రామదాసు
పాండవ వనవాసం (1965) .... దుశ్యాశనుడు
బభ్రువాహన (1964) .... ధర్మరాజు
మంచి మనిషి (1964)
పూజాఫలం (1964)
రాముడు భీముడు (1964)
నర్తనశాల (1963) .... ధర్మరాజు
తిరుపతమ్మ కథ (1963)
లక్షాధికారి (1963)
బందిపోటు (1963)
పరువు ప్రతిష్ఠ (1963)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) .... బలరాముడు
మహామంత్రి తిమ్మరుసు (1962)
గులేబకావళి కథ (1962)
గుండమ్మ కథ (1962) .... జమిందారు
దక్షయజ్ఞం (1962) .... బ్రహ్మదేవుడు
కులగోత్రాలు (1962) .... చలపతి
జగదేకవీరుని కథ (1961) .... ఇంద్రుడు
శ్రీ సీతారామ కళ్యాణం (1961) .... జనకుడు
రేణుకాదేవి మహత్యం (1960)
పెళ్ళి మీద పెళ్ళి (1959)
అప్పుచేసి పప్పుకూడు (1958)
మాయా బజార్ (1957) .... కర్ణుడు
సారంగధర (1957)
తెనాలి రామకృష్ణ (1956) .... కనకరాజు
సంతానం (1955)
పరివర్తన (1954)
మేనరికం (1954)
కన్నతల్లి (1953)
పుట్టిల్లు (1953)
పల్లెటూరు (1952)
పల్నాటి యుద్ధంలో కొమ్మరాజుగా నటించిన మిక్కిలినేని అనే కళావృక్షంలో సినీ జీవితం ఒక కొమ్మ మాత్రమే!

1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం పొందారు.