17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ పృథ్వి వెంకటేశ్వరరావు

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
ఈనాటి మన చిరస్మరణీయులు.. శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావుగారు రంగస్థల నటులు...
శ్రీ వెంకటేశ్వరరావు గారు 1928, మే 10న కోటి నాగేశ్వరరావు, రత్తమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, చీరాల మండలం, దేవాంగపురిలో జన్మించారు.

★రంగస్థల ప్రస్థానం
సంగీత కుటుంబమవడంతో వెంకటేశ్వరరావు గారు చిన్నప్పటినుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. ఈలపాట రఘురామయ్య దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. గయోపాఖ్యానం నాటకంలోని నారదుని పాత్రలో రంగస్థలంపై అడుగుపెట్టారు. విజయవాడ లోని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి, రాజమండ్రి లోకి చింతా సుబ్బారావు ట్రూపు ప్రదర్శించిన అనేక నాటకాలలో నటించారు.

ప్రముఖ రంగస్థల నటులైన కళ్యాణం రఘురామయ్య, పులిపాక వెంకటప్పయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, మాధవపెద్ది వెంకటరామయ్య, పంచాంగం పువ్వుల సూరిబాబు, పువ్వుల అనసూయ, ఆవేటి పూర్ణిమ, పువ్వుల రాజేశ్వరి, వేమూరి గగ్గయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు, నిడుముక్కల సుబ్బారావు లతో కలిసి నటించారు. టి. శ్రీరాములుతో కలిసి వీరు ఇచ్చిన రామాంజనేయ యుద్ధం గ్రామఫోన్ రికార్డు అప్పట్లో అత్యధిక సంఖ్యలో అమ్మడుపోయాయి. శ్రీ వెంకటేశ్వరమహత్యం నాటకంలోని సోది ఘట్టం రసవత్తర ప్రదర్శన వీరి ప్రత్యేకత...

★నటించినవి..

శ్రీకృష్ణరాయబారం
సతీ సక్కుబాయి
శ్రీకృష్ణతులాభారం
శ్రీరామాంజనేయ యుద్ధం
పాదుకా పట్టాభిషేకం
సీతా కళ్యాణం
తారాశశాంకం
చింతామణి
శ్రీవేంకటేశ్వర మహాత్యం
★పురస్కారాలు 
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం - నంది నాటక పరిషత్తు - 2002

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి