17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ కొచ్చర్లకోట సత్యనారాయణ

★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
శ్రీ కొచ్చర్లకోట సత్యనారాయణ, 
తొలితరం తెలుగు సినిమా, రంగస్థల నటులు, సినిమా సంగీత దర్శకులు, నేపథ్యగాయకులు

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా..చాగల్లు మండలం...వూనగట్ల గ్రామం.. లో జమీందారీ కుంటుంబంలో ఏప్రిల్ 2, 1915 న జన్మించారు. ఆయన బాల్యమంతా భీమడోలు యందు గల తాతగారింట్లో గడిచింది. ఆయన బాల్యంలో గ్రామఫోన్ ముందు కూర్చుని ఆ పాటలను శ్రద్ధగా వింటూండేవాడు. ఆయన రాజమండ్రిలో ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు "మాచిరాజు రామచంద్ర మూర్తి" గారి "కేసరి సమాజం"లో చేరారు. అచట రంగస్థలం పై నటనను ప్రారంభించారు. ఆయన చింతామణి , " ప్రతాపరుద్రీయం" వంటి నాటకాలలో నటించి వచ్చిన సొమ్మును పాఠశాలలకు గ్రంథాలయాలకు విరాళంగా యిచ్చేవారు.

ఆయన సినిమా రంగంలో "ద్రౌపది వస్త్రాపహరణం" చిత్రంతో ప్రవేశించారు. ఆ చిత్రం సరస్వతీ టాకీస్ వారిది. ఆయన "జరాసంధ" చిత్రంలో కృష్ణునిగా, "వరవిక్రయం" చిత్రంలో బసవరాజు గా, వై.వి.రావు గారి "మళ్ళీ పెళ్ళి" లోనూ, "పాదుకా పట్టాభిషేకం"లో లక్ష్మణునిగా నటించారు.

ఆయన మరల రంగస్థల రంగంలో ప్రవేశించి వేమూరి గగ్గయ్య , స్థానం నరసింహారావు లతో కలసి "జరాసంధ", "సారంగధర", "తులాభారం" నాటకాలలో నటించారు. ఆ తర్వాత ఆయన బందా కనకలింగేశ్వరరావు గారి ప్రభాత్ థియేటర్ లో చేరి "పాండవ" విత్రంలో అర్జునునిగానూ, "బొబ్బిలి యుద్ధం"లో వెంగళరావు గానూ, "సతీసావిత్ర"లో సత్యవంతునిగానూ, "చింతామణి"లో భవానీశంకరం గానూ, "కాళిదాసు"లో కాళిదాసు గాను నటించారు. ఆయన రామాంజనేయ యుద్ధంలో రామునిగా బేతా వెంకటరావుతో కలసి నటించారు.
ఆయన ఏలూరులో 1969 డిసెంబరు 21 లో  తనువు చాలించారు...
★★★★★★★★★★★★★
💐వారికివే మానివాళులు..!!💐
★★★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి