17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ రేబాల రమణ

★★★★★★★★★★★★★★★★★★
                          🎭 
      💥 తెలుగునాటకరంగ వైభవం💥
  ★★★★★★★★★★★★★★★★★★
తెలుగు నాటకరంగంలో పురుషులు, స్త్రీ పాత్రలో పోషించుటలో అగ్రగణ్యులు...స్థానం వారూ...బుర్రావారూ...
వారి తరువాత ఆ వారసత్వాన్ని తన చీరకొంగున కట్టుకొని తనదైన నటనతో..నాజూకు నడుముతో...వయ్యారి నడకలతో...మధురమైన ముద్దు ముద్దు పలుకులతో...క్రీగంటి చూపులతో...సిగ్గులతో...చెరగని చీరకుచ్చెళ్ళతో...ప్రేక్షకలోకాన్ని మైమరపింప చేసిన నెల్లూరి నెరజాణ(డు)...మన రేబాల రమణ నేటి మన చిరస్మరణీయులు...
శ్రీరేబాలరమణ....ప్రముఖ రంగస్థల నటులు..

సత్యభామ లోని స్వాభిమానం...నాగమ్మ పౌరుషం...చింతామణి జాణతనం...చంద్రమతిసహనం...సక్కుబాయిపాతివ్రత్యం...తార కామోద్రేకం...సంగు శృంగారం....

ఇలా వైవిధ్యభరితమైన 
పాత్రల స్వరూప
స్వభావాలను,సహజాతి సహజంగా,
అలవోకగా, అన్నులమిన్నగా
రసప్లావితంగా రంగస్థలంపై ప్రదర్శించిన
సహజ నటనా ధురీణ రేబాల రమణ.
ఏ స్త్రీ పాత్ర ధరించినా,
ఆ పాత్రను సజీవంగా 
ప్రేక్షకుల కళ్ళెదుట 
సాక్షాత్కరింపజేసిన 
'కళాప్రవీణ' రమణ.

రేబాల రమణ నెల్లూరు జిల్లా 
సమీపంలోని రేబాల గ్రామంలో 
1939 జనవరి 1న  జన్మించారు ఆయన తండ్రి పెంచలయ్య, 
తల్లి అంకమ్మ.
 
 బుచ్చిరెడ్డిపాలెం 
డీఎల్‌ఎన్‌ఆర్‌ పాఠశాలలో 
రమణ ఎస్‌ఎస్ఎల్‌సి చదివారు. 
తరువాత ప్రముఖ విద్వాంసుడు 
ఆర్‌. నారాయణ రెడ్డి వద్ద 
నటనను అభ్యసించారు. 
పాఠశాల వార్షికోత్సవంలో
‘పగలు’ అనే నాటకంలో 
తొలిసారి స్త్రీ పాత్ర వేసి మెప్పించారు. 
తరువాత చదువుకు స్వస్తి పలికి 
అభినయం, పద్యపఠనంలో 
మెలకువలు నేర్చుకున్నారు. 
హరిశ్చంద్ర పాత్రకు ప్రాణంపోసిన 
బండారు రామారావు పక్కన 
చంద్రమతిగా నటించి 
'నటస్థానం’ బిరుదు పొందారు. 

1955లో బండారు రామారావుతో కలిసి 
'శ్రీరామ నాట్యమండలి’స్థాపించారు. 
ఇది కేంద్ర రాష్ట్ర సంగీత నాటక అకాడమీ 
గుర్తింపు పొందింది. 

తరువాత చింతామణి, సత్యభామ, 
చాకలి లచ్చిగా విభిన్న స్త్రీ పాత్రలకు 
ప్రాణం పోశారు.
చంద్రమతి పాత్రలో 
కరుణ రసాన్ని 
అద్భుతంగా పలికించారు.. 
నాయకురాలు నాగమ్మ పాత్రలో 
అంతే గంభీరంగా కనిపించారు.. 
బాలనాగమ్మగా హుందాగా 
హొయలొలికించిన నటుడు  
కళా ప్రపూర్ణ రేబాల రమణ. 

పద్యపాఠశాలను స్థాపించారు. 
1974లో స్వర్ణ సింహ తలాటాన్ని 
అందుకున్నారు. 
1976లో టి.అంజయ్య, 
జలగం వెంకట్రావులు 
కనకాభిషేకం చేశారు. 
ఏలేశ్వరంలో సినీ నటి జమున 
సన్మానించారు. 
1980లో ఆంధ్రప్రదేశ్‌ 
సంగీత నాటక అకాడమీ 
రమణను 'కళాప్రవీణ’ 
బిరుదుతో సత్కరించింది. 
తరువాత అప్పటి సీఎం 
ఎన్టీఆర్‌ చేతులమీద 
ఉగాది పురస్కారం అందుకున్నారు. 

"నటనే-నాజీవితం
నాటకరంగమే-నా ప్రపంచం
రంగస్థలమే-నా కుటుంబం
కళకోసమే-జీవిస్తాను
కళకోసమే-తపిస్తాను
కళకోసమే-మరణిస్తాను"
అన్న రమణ
కళారంగానికి ఎనలేని 
సేవలందించిన రమణ 
1996 డిసెంబరు 31న 
రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు.
      (సేకరణ-నూలు)
★★★★★★★★★★
💐💐వారి కివే నివాళులు....!!💐💐
★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి