17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ బి.ఎన్. సూరి

★★★★★★★★★★★★★★★ 
💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★ 
శ్రీ బి.ఎన్. సూరి...
ఫకీరు పాత్రలో కేసరి....
 వీరు ప్రసిద్ధ రంగస్థల నటులు, రచయిత, సమాజ నిర్వాహకులు
శ్రీ బి.ఎన్. సూరి గారి పూర్తి పేరు
భావన నారాయణ సూరి.వీరు గుడివాడ దగ్గరవున్న బేతవోలు గ్రామములో1935 లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు
రామయ్య సూరి, రంగనాయకమ్మగారలు..
★రంగస్థల ప్రస్థానం
పోలీస్ వైర్ లెస్ సెట్ ఆపరేటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వీరు నాటకరంగంపై ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలి,నటుడు గా నటిస్తూ, నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు రాసి, ప్రదర్శించేవారు...
మాయల ఫకీరు పాత్రకు వీరు సుప్రసిద్ధులు...అజానుభాహులైన వీరు మాయల ఫకీరు ఆహార్యంలో...విరబోసిన దుబ్బు జుట్టుతో....గుండెలపై పుర్రె ఎముకల బొమ్మలతో ఉన్న.. పైనుంచి క్రిందవరకూ వేసిన నల్లటి అంగీతో..  కొద్దిగా ఎడమవైపుకు వంగి...కుడి వైపు కనుబొమ్మను విల్లులా పైకి లేపి..కుడిచేలో మనిషి పుర్రి..ఎడమచేతిలో తొంటి ఎముకను మంత్ర దండములా చేబూని...మధ్య మధ్యలో యడమకన్ను చిట్లిస్తూ.. వికృతమైన చూపుతో..భ యంకరాకారంతో... గంభీరమైన కంఠం తో...గగుర్పాటు కలిగించే వికట్టాట్టహాసాలతో...ఖాపాళీ..... !!!
అంటూ మేఘాఘర్జన లాంటి స్వరంతో..ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసే వారు.. నాటక నిర్వహకులు ఫకీరు పాత్ర ప్రవేశ సమయంలో, స్టేజీకి దగ్గరలో చిన్నవారినీ...ముసలివారినీ...గుండెజబ్బులు ఉన్నవారిని..గర్భిణీ స్త్రీలను  కూర్చోనిచ్చేవారు కాదు.. 
ఫకీరు పాత్రలో వీరిని చూచిన జనం సాధారణ మనిషిగా వున్నప్పుడు కలిస్తే జంకుతూ దూరంగా వుండేవారు..
వీరి నటన చూచిన నాలాంటి వారు  వీరిని ఇప్పటికీ మరువలేరు...
ఆ రోజుల్లో ఫకీరు పాత్ర పోషణ విషయంలో ఆంధ్రదేశంలో వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారికీ .. బి.ఎన్. సూరి గారికీ పోటా పోటీగా ఉండేది..ఆంధ్ర నాటకరంగం లోఫకీరు పాత్రతో గుడివాడకే గర్వకారణం గా నిలిచారు...
వీరి మాయల ఫకీరు నటనచూచి, గుడివాడ ప్రాంతచలన చిత్ర నిర్మాత ఒకరు వీరికి తన చిత్రంలో విలన్ పాత్ర కు బుక్ చేసి మేకప్ టెస్ట్...వోకల్ (ఆడిషన్) టెస్టింగ్ చేసే సమయాన వీరి నటన చూచిన, అక్కడ ఉన్న ఆనాటి విలన్ పాత్రలలో రాణిస్తున్న ఒక మాయల ఫకీరు మతి తప్పి, తనకు దుర్గతి పట్టకుండా, తన పరపతి మాయతో వీరిని చిత్రరంగానికి దూరం చేశారని అప్పట్లో చెప్పుకునే వారు... చిత్ర రంగంలో రాణించాలంటే ప్రతిభ ఎంతవున్నా, వెనక అనే "కుల అండ"వుండాలన్నది జగద్విఖితమే...!!
ఆది లేని వీరు తిరిగి గుడివాడవచ్చి నాటక సమాజాన్ని స్థాపించి..తన బృందం అయిన శ్రీ టి. పూర్ణచంద్రరావు(పూర్ణ), శ్రీ దేవి వరప్రసాద్,(ప్రసాద్) తన శ్రీమతి బి.ఎన్. సీతాకుమారితో కలిసి తాండ్ర వేంకట సుబ్రహ్మణ్యం రచించిన "మహిషాసుర మర్థని" నాటకాన్ని అనేకచోట్ల వేల ప్రదర్శనలు ఇచ్చారు.దీనిలో వీరి మహిషారుని పాత్రలో అద్భుతంగా జీవించేవారు. గుడివాడ ప్రాంతంలోని అనేకమంది నాటక కళాకారులకు, సాంకేతిక నిపుణుల ఉపాధిని కృషిచేశారు...
అలాగే గుడివాడలో వుండే అక్కినేని నాగేశ్వరరావు గారి అన్న అక్కినేని మల్లిఖార్జునరావు గారి అబ్బాయి అయిన అక్కినేని వెంకటరత్నం(వీరు అచ్చం అక్కినేని వారిలావుండేవారు) హీరోగా  కొన్నివేల ప్రదర్శనలు ఇచ్చిన "పూలరంగడు" సాంఘిక నాటకం లో  ప్రతి నాయకుడు  పాత్రతో నాటకాన్ని రక్తికట్టించేవారు.

ప్రత్యక్షంగా... పరోక్షంగా నాటకరంగానికి ఎనలేని సేవలు అందించి,నాటకాన్నే శ్వాసిస్తూ...నాటకంలో భాసిస్తూ...రాణిస్తూ...శెభాషని పిస్తూ... నాటకాన్నే ఊపిరిగా జీవించిన  శ్రీ బి.ఎన్ సూరి గారు 1995లో నాటకం వేస్తూ రంగస్థలంపైనే తుది శ్వాస విడిచారు...వీరికి మా నివాళులు...💐💐
బి.ఎన్. సూరి.... జిందాబాద్...!! 
      -నూలు సాంబశివరావు...గుడివాడ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి