17, అక్టోబర్ 2020, శనివారం

కలియుగ రామాంజనేయులు

హీరోకి హీరోయిన్ పరిచయం అయినట్టుగానే అనుకోకుండా  ఆంజనేయస్వామికి రావుడు  పరిచయం  అయ్యాడు.  రాముని  దివ్యమంగళ సౌందర్యం చూసి  ఆంజనేయుడు  ఆయనకు  ఆ చంద్రతారార్కం అపర భక్తుడుగా  మారిపోయాడు.  ఆ  శ్రీరామచంద్రుని కీర్తిస్తూ  స్తుతిస్తూ భజిస్తూ జీవితాంతం ఆయన పాదాలవద్దనే వుండిపోయాడు. ఇదీ రామాయణంప్రకారం రావుడికీ ఆంజనేయునికీ సంబంధించిన  ఎపిసోడు.  వాల్మీకి  రామాయణం  రాసేనాటికి సంపత్ నగర్ లక్మ్షణరావు లేడు  కాబట్టి కధ అట్లాసాగింది గానీ అదే బంఢన భీముడూ...!! ఆ.......ర్తజన బాంధవుడు...!! అంటూ  ఆంజనేయుని వేషంలో  లక్ష్మణ్రావు  ఆలపించే పద్యం  వినివుంటే నా సామి రంగా ఒక్క రావుడేం ఖర్మ... దేవాది దేవతలందరూ  కరిగి కన్నీరు మున్నీరై  ఆంజనీయస్వామి కాళ్లకి  మొక్కి మాక్కూడా ఒక్క పద్యం నేర్పు గురూ  అంటూ  పద్యనాటకం నేర్చుకోడానికి ఆయనింటి ముందు క్యూ కట్టేవాళ్లు. ఇంద్రలోక కన్యలందరూ ఒక్క అటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ సూర్పణకలై  ఆంజనేయుని ఆలింగనం కోసం పడిగాపులు పడుతుండేవాళ్లు.. ఇందులో అణుమాత్రంకూడా అతిశయమూ అసత్యమూ  అనాలోచిత  ప్రగల్భమూ లేదు. దేవుడి మీద  నమ్మకం లేని నాబోటి  వాళ్లక్కూడా లక్ష్మణ్రావ్ నాటకం చూస్తే  ఎందుకులే ఈ  ఎధవ గోల... దేవుడున్నాడని ఒప్పేసుకుంటే పోలా! అనిపించక మానదు.  ఆంజనేయుని పాత్రలో లక్మ్ణణ్రావ్ ని మించిన కళాకారుడు ఈ చరాచర సృష్టిలో ఇంకొకరు లేరని నేను గట్టిగా విశ్వశిస్తాను. నిజంగా ఆంజనీయస్వామి  నా ఎదురుగా నుంచొని చెప్పు  శ్రీరాముని పట్ల నా భక్తి గొప్పదా.... అక్షరం ముక్కరాని ఈ లక్షణ్రావు భక్తిగొప్పదా... అంటే నేను లక్ష్మణ్రావ్ గారి  వైపే  వేలు చూపిస్తాను.  
       లక్మ్షణ్రావ్  ఏనాడూ బడికి బోయింది, చదువు  నేర్చిందీ లేదు.  పేద కుటుంబం.  చిన్నప్పుడు  ఆళ్లూ ఈళ్లూ పాడిన పద్యాలు నెమరేస్తూ గొడ్లు గాచుకుంటూ తిరిగేవాడు.  ఎవుడో దార్నెబోయే దానయ్య ఆ పద్యాలు విని ఈడి గొంతు భలేవుందే అనుకొని బలవంతంగా స్టేజీ ఎక్కించి పుణ్యం కట్టుకున్నాడు.  ఆంజనేయుడి వేషంలో  లక్మ్షణ్రావుని చూసి ఊళ్లో జనం నోళ్లు వెళ్లబెట్టారు.  ఆ వార్త     ఆ నోట ఆ నోట చాలా వూళ్లకి పాకింది.  అక్షర సంగీత జ్ణానాలు లేకుండానే  అమాంతంగా నాటకరంగంలోకి  దూసుకొచ్చిన  అతన్ని ఆపడం ఇక ఎవరివల్లా కాలేదు. అతని భాషకీ, బాణీకి వంకలు పెడుతున్న కొద్దీ చెలరేగిపోయాడు.  మద్రాసు నుంచి గ్రాముఫోను కంపెనీ వాళ్లొచ్చి లక్మ్షణ్రావ్ పద్యాలను రికార్డు చేసి మార్కెట్లోకి వదిల్తే ఆ గొంతు విని ఆంధ్రదేశం  అదిరిపడింది.  చావుకీ పెళ్లికీ బారసాలకీ అన్నిటికీ మైకుల్లో ఇతగాడి రికార్డు పెట్టి ఊళ్లకి ఊళ్లు పద్యనాటక మైకంలో తూలిపడుతుండేవి.  నేల ఈనిందా అన్నట్టు  జనం పోటెత్తి మరీ అతని నాటకం చూడ్డానికి ఎగబడ్డారు. ఒక్క సారిగా లక్మ్షణ్రావ్ సూపర్ స్టార్ అయిపోయాడు. రేటు పెంచాడు. రోజుకో నాటకం, పూటకో ఊరు తిరుగుతూ ఉర్రూతలూగించాడు. వరస నాటకాలతో గొంతు రాసుకుపోయి బాధిస్తున్నా మహానుభావుడు ఆ బాధని దిగమింగి మరీ  పద్యం అందుకుంటాడు గానీ  ఏరోజూ మద్యాన్ని మందుగానైనా  దరిచేరనివ్వలేదు. 
                లక్ష్మణ్రావు గురించి ఇంతచెప్పి షణ్ముఖి ఆంజనేయ రాజు గురించి చెప్పకపోతే   మారాజు చచ్చి ఏలోకానవున్నాడో...శాపనార్ధాలు పెడతాడు. రాముడూ, కృష్ణుడూ పాత్రల్లో షణ్ముఖి రాజుగోరికొచ్చినంత  పేరు అంతా ఇంతా కాదు.  స్టేజి ఎక్కి పద్యంఅందుకున్నాడంటే  భూగోళం దద్దరిల్లిపోతుందంటే నమ్మండి!  షణ్ముఖి రాజు గారు  డేటిచ్చాడంటే  ఆ కాంట్రాక్టర్ ఇంట కనకవర్షం కురిసినట్టే!  మా వూళ్లో ఒకటో కృష్ణుడుగా స్టేజి ఎక్కి, అదే రోజు రాత్రి   మీ వూళ్లో రెండో కృష్ణుడు వేషం వేయడానికి బయల్దేరేవాడు. ఎన్టీఆర్ చైతన్యరధం మెయిన్టేన్ చేసినట్టు ఆరోజుల్లోనే షణ్ముఖి ఒక మెటాడోర్ వాన్ మెయిన్టేన్ చేసేవాడు. వెనక పరుపు, దిండ్లూ, అసిస్టెంట్లు..ఓయబ్బో ఒక చిన్నసైజు  శ్రీనాధుడులా బతికాడు.  సారు మంచి మందు ప్రియుడు.   ఒకసారి పోలవరంలో నాటకం వేయడానికి బయల్దేరి రాజమండ్రిలో దప్పిక తీర్చుకోడానికి వైను షాపుదగ్గర ఆగిన షణ్ముఖి సురాపానం శృతిమించి  అక్కడే రోడ్డుమీద పడిపోయాడు.  పొద్దుపోయింది. పోలీసులొచ్చి శరీరాన్నీ ఈడ్చుకొని పోయారు. ఎప్పుడో అర్ధరాత్రి  కళ్లు తెరిచి చూస్తే   జైల్లో  వున్నాడు.  అయ్యా సి.ఐ.గారు నేను షణ్ముఖి ఆంజనేయరాజుని! పోలవరంలో నాటకం వుంది. వేలాదిమంది జనం నాకోసం పడిగాపులు పడుతుంటారు! అంటూ పాపం పెద్దాయన ప్రాధేయపడ్డాడు. సీట్లో కూర్చున్న  సాయికుమార్  చిరునవ్వు చిందించాడు.  అదేం  చిత్రమో  పోలీసుల్లో కూడా కొందరు  కళా హృదయం కలవారు వుంటుంటారు. ఈ సి.ఐ కూడా అదే బాపతు.  పైగా గతంలో ఒకట్రెండు సార్లు షణ్ముఖి నాటకాలు చూసినవాడు. నన్నే బోల్తాకొట్టిద్దామనుకుంటున్నావా! షణ్ముఖి ఆంజనేయరాజు  ఎలావుంటాడో నాకు తెలియదనుకుంటున్నావా! నోర్మూసుకొని పడుకో! పొద్దున్నే కోర్టుకు  పోదాం అని అదిలించాడు.  షణ్ముఖి మైండు బ్లాకయ్యింది. ఏం చేయాలో అర్ధం కావట్లేదు. అవతల జనం పెట్టే గగ్గోలు గుర్తుకొచ్చి టెన్షన్ పెరిగిపోయింది.  ఇక లాభం లేదనుకొని దీర్ఘ శృతిలో తీవ్రధ్వనిలో జండాపై కపిరాజు అంటూ పద్యం  అందుకున్నాడు. సీ.ఐ చేతిలో లాఠీ జారి కిందపడింది. నోరెళ్లబెట్టాడు. అతని ప్రమేయం లేకుండానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.  పద్యం  పరమాధ్బుతంగా పరుగులు తీస్తుంటే సి.ఐ అచేతనంగా మోకాళ్లమీద సాగిలపడ్డాడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ పోలీసాయన... దేవా! ఎల్ల దేవతలూ ఎల్ల ప్రాణులూ నీయందు నాకు గోచరమగుచున్నవి. ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను జూచుటవలన నాకు  దిక్కులు తెలియకున్నవి. సారూ... నాయందు దయవుంచి నాకు ప్రసన్నుడివి కమ్మ్ము అంటూ షణ్ముఖి  పాద పద్మాలకు ప్రణమిల్లి  ‌క్షమించమని కోరాడు. అరనిమషంలో పోలీసు జీపు సిద్ధం అయ్యింది. షణ్ముఖిని సాదరంగా ఎక్కించుకొని ఆ సి.ఐ. స్వయంగా జీపు తోలుతూ పోలవరం తీసుకెళ్లి అశేష ప్రజావాహినికి ఆ మహాకళాకారుని  దర్శనభాగ్యం  కలిగించాడు.  అదీ షణ్ముఖి అంటే!
  మరి అట్లాంటి షణ్ముఖి రాముడిగా, మన లక్మ్షణ్రావ్ సారు ఆంజనేయుడిగా రామాంజనేయ యుద్ధం నాటకంలో ఒకే వేదిక మీద ఒకరి తర్వాత ఒకళ్లు పద్యం మీద పద్యం పాడుతూవుంటే ఎట్లావుంటుందో ఒక్కసారి ఊహించుకోండి! పూర్వజన్మ సుకృతం అంటారు చూశారూ అట్లాంటిది ఏదో  వుంటేగాని వాళ్ల నాటకం చూసే అదృష్టం దక్కదు.
       
అప్పటికి నాకింకా మీసాలుకూడా రాలేదు. మా వూళ్లో పొలం పనులన్నీ ముగిసిన ఎండాకాలపు తొలినాళ్లలో శ్రీరామాంజనేయ యుద్ధం నాటకం పెట్టించారు లక్మ్షణ్రావ్,షణ్ముఖి వేదికమీదకు వచ్చీరాగానే జనసద్రంలో ఒక పెను ఉత్సాహం మొదలయ్యింది. శ్రీరామ్ ... శ్రీరామ్ అంటూ లక్మ్షణ్రావ్ మొదటి పద్యం అందుకున్నాడు.  ముంచుకు రాబోతున్న ఒక మహా ప్రళయానికి సూచికగా మంద్రస్ధాయిలో పద్యం ప్రారంభించాడు. ఇక్కడో గమ్మత్తుంది. లక్మణ్రావ్ కీ ఆంజనేయరాజుకీ ఒకళ్లంటే ఒకళ్లకి పడిచచ్చేది కాదు. చదువు సంధ్యల్లేని వీడితో నాకు పోలికేంటి అన్నట్టుండేది ఆంజనేయరాజు ప్రవర్తన. నీకు సదువుంటే నాకేందీ మేడలుంటే నాకేందీ...నేను మాత్రం పాడట్లేదా ఏంది అన్నట్టుండేది లక్ష్మణ్రావు కోపం. పైగా ఈ నాటకంలో మరో తిరకాసుంది. రాముని బొక్కలన్నీ హనుమంతుడు బయటపెట్టి తిడతుంటాడు. హనుమంతుని కోతి చేష్టలన్నీ గుర్తుచేసి మరీ రాముడు ఎత్తిపొడుస్తుంటాడు. అప్పటిదాకా ఎంతో అన్యోన్యంగా వున్న ఇద్దరు వ్యక్తులు అట్లా బజారున పడి ఒకళ్లనొకళ్లు చెడామడా తిట్టుకూంటూవుంటే చూసేవాళ్లకి ఎంత వినోదంగా  వుంటుందో  వేరే చెప్పనక్కర్లేదు.   పైగా ఆ వేషాల్లో  ఒకళ్లంటే ఒకళ్లకి పడని లక్మణ్రావు, ఆంజనేయరాజు  వేదికెక్కి రాగయుక్తంగా  పోట్లాడుకుంటుంటే  అబ్బో చూసేవాళ్లకి కలిగే  ఆనందం  వర్ణనాతీతం.  ఆంజనేయరాజు పద్యానికి జనం చప్పట్లు కొడితే లక్మణ్రావుకి పౌరుషం పొడుచుకొచ్చేది. నేను మాత్రం ఏవన్నా తక్కువా అన్నట్టు రెచ్చిపోయి పాడేవాడు. జనం ఈలలూ, వన్సుమోర్లు.. అది చూసి ఆంజనేయరాజు కడుపు కాలిపోయేది. ఇప్పుడు రారా చూసుకుందాం అన్నట్టుగా పాత పద్యాన్నే కొత్త రాగంలో పాడి రాగం ఎక్కడ ఎత్తుకుంటున్నాడో ఎక్కడ దించుతున్నాడో అర్ధంకాకుండా లక్మ్షణ్రావుమీద పాసుపతాస్త్రాన్ని ప్రయోగించేవాడు. ఎదురుగా ఇంకొకడూ ఇంకొకడూ వున్నట్టయితే ఆ దెబ్బకి మూర్ఛనలు పోయుండాల్సింది. కానీ అక్కడుంది లక్షణరావ్ అనే  ఏకసంతాగ్రహి. జాగ్రత్తగా షణ్ముఖి పాడిన రాగాన్ని వినేవాడు.  షణ్ముఖి ఏ రాగంలో పద్యం అన్నాడో అదే రాగంలో క్షణాల్లో తానూ పద్యం అందుకునేవాడు..  ఒక్కసారిగా కళ్లముందు సాక్షాత్కరించిన ఈ మహా అద్భుతం చూసి జనాలకు పిచ్చెక్కేది.  కత్తులూ కొడవళ్లూ లేని కురుక్షేత్ర మహాసంగ్రామం  కళ్లముందే జరుగుతున్నట్లుండేది. ప్రేక్షకులు ఆనందంతో హాహాకారాలు చేసేవాళ్లు. వదలిన పాసుపతాస్త్రం శత్రువు మెడలో పూలహారంగా మారే సరికి శ్రీరామచంద్రుని వేషంలోవున్న షణ్ముఖికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేది. ఛీ ఇక వీడితోకలిసి  జన్మలో స్టేజీ ఎక్కను అని శభధం కూడా చేశాడు.  తర్వాతర్వాత ఇద్దరూ వేరు వేరుగానే నాటకాలు వేసుకుంటూ ఎవరిమానాన వాళ్లు ఎల్లలు లేని ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్నారు.   

‍                వాళ్లిద్దరి నాటకం మళ్లీ ఇప్పుడు చూద్దాం అంటే కుదర్దు. ఆంజనేయరాజు గారు కాలంచేసి చాలా ఏళ్లయ్యింది. లక్ష్మణ్రావ్ గారు మాత్రం అయురారోగ్యాలతో తన సొంతూరులోనే నివాసం వుంటున్నారు. ఒంట్లో శక్తి తగ్గిపోతున్నా, గొంతు సహకరించకపోయినా ఇంకా ఎవరన్నా పిలిస్తే  కాదనకుండా వెళ్లి  ఇప్పటికీ నాటకం వేస్తూనేవున్నారు. పాపం పెద్దాయన తనని ప్రజలు గుర్తించినంతగా ప్రభుత్వం గుర్తించలేదు అని అయినవాళ్ల దగ్గర అప్పుడప్పుడూ వాపోతుంటాడట! బాధపడకు పెద్దాయనా! సమైక్య రాష్ట్రంలో నీకు అవార్డు రాకపోయినా, ఆళ్లనీ ఈళ్లనీ పట్టుకొని రేపు ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లోనూ  రెండు ప్రభుత్వాల చేత నీకు ఘనసన్మానం చేయించే పూచి మాది... అంటే ఈ వ్యాసం చదువుతున్న వాళ్లది. నీలాంటి కళాకారులని గౌరవించుకునే  సంస్కారం  తెలుగుజాతిలో అంతో ఇంతో ఇంకా మిగిలేవుందిలే!    
       లక్మ్షణ్రావ్  ఏనాడూ బడికి బోయింది, చదువు  నేర్చిందీ లేదు.  పేద కుటుంబం.  చిన్నప్పుడు  ఆళ్లూ ఈళ్లూ పాడిన పద్యాలు నెమరేస్తూ గొడ్లు గాచుకుంటూ తిరిగేవాడు.  ఎవుడో దార్నెబోయే దానయ్య ఆ పద్యాలు విని ఈడి గొంతు భలేవుందే అనుకొని బలవంతంగా స్టేజీ ఎక్కించి పుణ్యం కట్టుకున్నాడు.  ఆంజనేయుడి వేషంలో  లక్మ్షణ్రావుని చూసి ఊళ్లో జనం నోళ్లు వెళ్లబెట్టారు.  ఆ వార్త     ఆ నోట ఆ నోట చాలా వూళ్లకి పాకింది.  అక్షర సంగీత జ్ణానాలు లేకుండానే  అమాంతంగా నాటకరంగంలోకి  దూసుకొచ్చిన  అతన్ని ఆపడం ఇక ఎవరివల్లా కాలేదు. అతని భాషకీ, బాణీకి వంకలు పెడుతున్న కొద్దీ చెలరేగిపోయాడు.  మద్రాసు నుంచి గ్రాముఫోను కంపెనీ వాళ్లొచ్చి లక్మ్షణ్రావ్ పద్యాలను రికార్డు చేసి మార్కెట్లోకి వదిల్తే ఆ గొంతు విని ఆంధ్రదేశం  అదిరిపడింది.  చావుకీ పెళ్లికీ బారసాలకీ అన్నిటికీ మైకుల్లో ఇతగాడి రికార్డు పెట్టి ఊళ్లకి ఊళ్లు పద్యనాటక మైకంలో తూలిపడుతుండేవి.  నేల ఈనిందా అన్నట్టు  జనం పోటెత్తి మరీ అతని నాటకం చూడ్డానికి ఎగబడ్డారు. ఒక్క సారిగా లక్మ్షణ్రావ్ సూపర్ స్టార్ అయిపోయాడు. రేటు పెంచాడు. రోజుకో నాటకం, పూటకో ఊరు తిరుగుతూ ఉర్రూతలూగించాడు. వరస నాటకాలతో గొంతు రాసుకుపోయి బాధిస్తున్నా మహానుభావుడు ఆ బాధని దిగమింగి మరీ  పద్యం అందుకుంటాడు గానీ  ఏరోజూ మద్యాన్ని మందుగానైనా  దరిచేరనివ్వలేదు. 
                లక్ష్మణ్రావు గురించి ఇంతచెప్పి షణ్ముఖి ఆంజనేయ రాజు గురించి చెప్పకపోతే   మారాజు చచ్చి ఏలోకానవున్నాడో...శాపనార్ధాలు పెడతాడు. రాముడూ, కృష్ణుడూ పాత్రల్లో షణ్ముఖి రాజుగోరికొచ్చినంత  పేరు అంతా ఇంతా కాదు.  స్టేజి ఎక్కి పద్యంఅందుకున్నాడంటే  భూగోళం దద్దరిల్లిపోతుందంటే నమ్మండి!  షణ్ముఖి రాజు గారు  డేటిచ్చాడంటే  ఆ కాంట్రాక్టర్ ఇంట కనకవర్షం కురిసినట్టే!  మా వూళ్లో ఒకటో కృష్ణుడుగా స్టేజి ఎక్కి, అదే రోజు రాత్రి   మీ వూళ్లో రెండో కృష్ణుడు వేషం వేయడానికి బయల్దేరేవాడు. ఎన్టీఆర్ చైతన్యరధం మెయిన్టేన్ చేసినట్టు ఆరోజుల్లోనే షణ్ముఖి ఒక మెటాడోర్ వాన్ మెయిన్టేన్ చేసేవాడు. వెనక పరుపు, దిండ్లూ, అసిస్టెంట్లు..ఓయబ్బో ఒక చిన్నసైజు  శ్రీనాధుడులా బతికాడు.  
                మరి అట్లాంటి షణ్ముఖి రాముడిగా, మన లక్మ్షణ్రావ్ సారు ఆంజనేయుడిగా రామాంజనేయ యుద్ధం నాటకంలో ఒకే వేదిక మీద ఒకరి తర్వాత ఒకళ్లు పద్యం మీద పద్యం పాడుతూవుంటే ఎట్లావుంటుందో ఒక్కసారి ఊహించుకోండి! పూర్వజన్మ సుకృతం అంటారు చూశారూ అట్లాంటిది ఏదో  వుంటేగాని వాళ్ల నాటకం చూసే అదృష్టం దక్కదు.
       అప్పటికి నాకింకా మీసాలుకూడా రాలేదు. మా వూళ్లో పొలం పనులన్నీ ముగిసిన ఎండాకాలపు తొలినాళ్లలో శ్రీరామాంజనేయ యుద్ధం నాటకం పెట్టించారు లక్మ్షణ్రావ్,షణ్ముఖి వేదికమీదకు వచ్చీరాగానే జనసద్రంలో ఒక పెను ఉత్సాహం మొదలయ్యింది. శ్రీరామ్ ... శ్రీరామ్ అంటూ లక్మ్షణ్రావ్ మొదటి పద్యం అందుకున్నాడు.  ముంచుకు రాబోతున్న ఒక మహా ప్రళయానికి సూచికగా మంద్రస్ధాయిలో పద్యం ప్రారంభించాడు. ఇక్కడో గమ్మత్తుంది. లక్మణ్రావ్ కీ ఆంజనేయరాజుకీ ఒకళ్లంటే ఒకళ్లకి పడిచచ్చేది కాదు. చదువు సంధ్యల్లేని వీడితో నాకు పోలికేంటి అన్నట్టుండేది ఆంజనేయరాజు ప్రవర్తన. నీకు సదువుంటే నాకేందీ మేడలుంటే నాకేందీ...నేను మాత్రం పాడట్లేదా ఏంది అన్నట్టుండేది లక్ష్మణ్రావు కోపం. పైగా ఈ నాటకంలో మరో తిరకాసుంది. రాముని బొక్కలన్నీ హనుమంతుడు బయటపెట్టి తిడతుంటాడు. హనుమంతుని కోతి చేష్టలన్నీ గుర్తుచేసి మరీ రాముడు ఎత్తిపొడుస్తుంటాడు. అప్పటిదాకా ఎంతో అన్యోన్యంగా వున్న ఇద్దరు వ్యక్తులు అట్లా బజారున పడి ఒకళ్లనొకళ్లు చెడామడా తిట్టుకూంటూవుంటే చూసేవాళ్లకి ఎంత వినోదంగా  వుంటుందో  వేరే చెప్పనక్కర్లేదు.   పైగా ఆ వేషాల్లో  ఒకళ్లంటే ఒకళ్లకి పడని లక్మణ్రావు, ఆంజనేయరాజు  వేదికెక్కి రాగయుక్తంగా  పోట్లాడుకుంటుంటే  అబ్బో చూసేవాళ్లకి కలిగే  ఆనందం  వర్ణనాతీతం.  ఆంజనేయరాజు పద్యానికి జనం చప్పట్లు కొడితే లక్మణ్రావుకి పౌరుషం పొడుచుకొచ్చేది. నేను మాత్రం ఏవన్నా తక్కువా అన్నట్టు రెచ్చిపోయి పాడేవాడు. జనం ఈలలూ, వన్సుమోర్లు.. అది చూసి ఆంజనేయరాజు కడుపు కాలిపోయేది. ఇప్పుడు రారా చూసుకుందాం అన్నట్టుగా పాత పద్యాన్నే కొత్త రాగంలో పాడి రాగం ఎక్కడ ఎత్తుకుంటున్నాడో ఎక్కడ దించుతున్నాడో అర్ధంకాకుండా లక్మ్షణ్రావుమీద పాసుపతాస్త్రాన్ని ప్రయోగించేవాడు. ఎదురుగా ఇంకొకడూ ఇంకొకడూ వున్నట్టయితే ఆ దెబ్బకి మూర్ఛనలు పోయుండాల్సింది. కానీ అక్కడుంది లక్షంణరావ్ అనే  ఏకసంతాగ్రహి. జాగ్రత్తగా షణ్ముఖి పాడిన రాగాన్ని వినేవాడు.  షణ్ముఖి ఏ రాగంలో పద్యం అన్నాడో అదే రాగంలో క్షణాల్లో తానూ పద్యం అందుకునేవాడు..  ఒక్కసారిగా కళ్లముందు సాక్షాత్కరించిన ఈ మహా అద్భుతం చూసి జనాలకు పిచ్చెక్కేది.  కత్తులూ కొడవళ్లూ లేని కురుక్షేత్ర మహాసంగ్రామం  కళ్లముందే జరుగుతున్నట్లుండేది. ప్రేక్షకులు ఆనందంతో హాహాకారాలు చేసేవాళ్లు. వదలిన పాసుపతాస్త్రం శత్రువు మెడలో పూలహారంగా మారే సరికి శ్రీరామచంద్రుని వేషంలోవున్న షణ్ముఖికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చేది. ఛీ ఇక వీడితోకలిసి  జన్మలో స్టేజీ ఎక్కను అని శభధం కూడా చేశాడు.  తర్వాతర్వాత ఇద్దరూ వేరు వేరుగానే నాటకాలు వేసుకుంటూ ఎవరిమానాన వాళ్లు ఎల్లలు లేని ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్నారు.   

‍                వాళ్లిద్దరి నాటకం మళ్లీ ఇప్పుడు చూద్దాం అంటే కుదర్దు. శ్రీఆంజనేయరాజు గారు కాలంచేసి చాలా ఏళ్లయ్యింది. లక్ష్మణ్రావ్ గారు 2017 లో ఆ రాముణ్ణి చేరారు. 
           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి