17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ అమరపు సత్యనారాయణ

★★★★★★★★★★★★★★★★
                         🎭 
               💥 *తెలుగు*💥
            *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★★★★★ ★★
ఈనాటి  మన చిరస్మరణీయులు...
శ్రీ అమరపు సత్యనారాయణ  ప్రసిద్ధ రంగస్థల నటులు.. గాయకులు.... సమాజ నిర్వాకులు...ఉపాధ్యాయులు.
వీరు శ్రీకృష్ణ పాత్రలో ప్రసిద్ధి గాంచారు..

★జననం
వీరు విజయనగరం జిల్లా,బొబ్బిలితాలూకా, తెర్లాం మండలం, పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు.
10 ఏండ్ల ప్రాయంలో పాదుకా పట్టాభిషేకం భజన నాటకంలో  పాటలు, పద్యాలు గొంతెత్తి శ్రావ్యంగా అ పాడేవారు.

1956లో ఉపాధ్యాయ శిక్షణ పొందే సమయంలో  వార్షికోత్సవము నందు,సహచర ఉపాధ్యాయుల ప్రోద్భలంతో గయోపఖ్యానంలో కృష్ణ పాత్రతో రంగస్థలం జీవితం ప్రారంభమయ్యింది.
  అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయణ అనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కళాకారుడవుతాడని చేరదీసారు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించారు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో నిష్ణాతులైన హార్మోనిస్ట్ శ్రీ ఎం. కృష్ణమూర్తి నాయుడు గారి దగ్గర స్వరవిన్యాసంలో మెళకువలు  పొందారు. శ్రావ్యమైన కంఠం, చూడచక్కని రూపం, భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది. ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. నిండుతనం కోసం పరితపించేవారు. అందువల్ల ఆయన పాత్రలకి ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అమరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి.

■అవార్డులు - రివార్డులు - సన్మానాలు...

"★1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పార్వతీపురం పోటీల్లో స్వర్ణ పతకం పొందాడు.
★1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందాడు.
★రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ 'నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది. ★మద్రాసు లో తెలుగు అకాడమీ వారు నిర్వహించే ఉగాదిపురస్కారాలలో అక్కినేని వారి అధ్యక్షతన జరిగిన సభలో అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా 'రాఘవ అవార్డు ' అందుకున్నాడు.
అప్పటి సినీ నటులైన కాంతారావు, ధూళిపాళ, అల్లురామలింగయ్య, చంద్రమోహన్, రాజనాల వంటివారితో కలసి రంగస్థలంపై నటించారు.1958 సూర్యకళా నాట్యమండలి అనే నాటకస మాజాన్ని స్థాపించారు.
గయోపాఖ్యానంలో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషణలు రికార్డులు తయారయ్యాయి..
వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ  చేశారు..
వీరు 2011, అక్టోబరు 20 న రాజాం లో కన్నుమూసినా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలచివున్నారు...
★★★★★★★★★★★★★■
💐వారి కివే మా నివాళులు..💐
★★★★★★★★★★★★★★     (సేకరణ-నూలు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి