1, నవంబర్ 2020, ఆదివారం

శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★
శ్రీ ఋష్యేంద్రమణి
ప్రముఖ తెలుగు రంగస్థల, చలనచిత్ర నటి...నర్తకి..
అలనాటి ప్రముఖ కథానాయకులకు...తల్లిగా...పెద్దమ్మగా...అక్కగా..అత్తగారిలా  ..సాదుస్వభావ పాత్రలలో నటించి,తన కంఠం లోనూ.. మాటలలోనూ..హావభావములలోనూ చక్కని తెలుగుతనాన్ని చిలికించి,,అచ్చం  మా అమ్మ లాగావుందే..అక్కలాగా ఉందే... మా నానమ్మ లా ఉందే... అని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేటట్లు తనదైన నటనతో రంజింపచేసినది.. కొన్ని చిత్రాలలో గయ్యాళి పాత్రలలో కూడా  గడ గడ
లాడించింది...ఈ సీనియర్ నటీమణి...శ్రీమతి జవ్వాది ఋష్యేంద్రమణి...ఈనాటి మన చిరస్మరణీయురాలు...

ఈమె కృష్ణా జిల్లా విజయవాడ పట్టణములో 1917 సం:లో జనవరి నెల ఒకటవ తేదీన జన్మించింది..
తన 10 వయేటనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె సాంప్రదాయ...క్లాసికల్ సంగీతంతో పాటు కూచిపూడి నాట్యం  కూడా చిన్నతనము నుండీ నేర్చుకున్నది...
కృష్ణ,,ప్రహ్లద పాత్రలతో నట జీవితమును ఆరంభించింది.. తదుపరి కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీ విలాస నాటకసభ లో చేరింది.
శ్రీమతి పువ్వుల రామతిలకం...శ్రీ కపిలవాయి రామనాధశాస్త్రి లాంటి ఉద్దండ నటులవద్ద నటనలో మెరుగులు దిద్దుకుంది...
కొన్ని నాటకాల్లో చింతామణి.. సావిత్రి లాంటి పాత్రలు పోషించింది...
1935సం:లో శ్రీ రాజారావు నాయుడు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్రలో సినీరంగ ప్రవేశం చేసింది.ఆ చిత్రంలో ఈమె గాయనిగా...నటిగా మంచి ప్రశంసలు పొందినా... చిత్రం ఆర్థికంగా పెద్దగా విజయం పొందలేదు.
తదనంతరం...కడారు నాగభూషణం..
కన్నాంబ గారు స్థాపించిన రాజరాజేశ్వరీ నాట్యమండలి లోచేరి... మూడు సంవత్సరముల పాటూ..తమిళనాడు..కర్ణాటక..మహారాష్ట్ర..ఒరిస్సా..రాష్ట్రాల్లో తిరిగి పలు పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రంగూన్ రౌడీ లో ప్రభావతిగా...పౌరాణిక పాత్రలలో నారదుడు గా...సావిత్రిగా మంచి పేరు సంపాయించుకుంది...
1939 లో ప్రముఖ హార్మోనిస్ట్ జవ్వాది రామకృష్ణ నాయుడిని పెండ్లాడింది.
ఋష్యేంద్రమణి  భర్త జవ్వాది రామకృష్ణారావు "మాతృభూమి" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడా చెన్నై చేరి "పాండురంగ విఠల్" అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించింది. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన "శిలప్పాడికరం" ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో "కణగి" పాత్ర ధరించింది. ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి సూర్యప్రకాశరావు ధరించాడు. కణగి పాత్రను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఆ తరువాత "చెంచులక్ష్మిలో" ఆదిలక్ష్మి పాత్ర, "సీతారామ జననంలో" కౌసల్యగాను, సేతుబంధన్ లో ఇంద్రాణిగా, "భక్త సిరియాళలో" కథానాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తుందో, శోకభరిత కరుణారస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేది. మల్లీశ్వరిలో తల్లి పాత్రనూ, విప్రనారాయణలో వేశ్య పాత్రనూ, మాయాబజార్, జగదేకవీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలు పోషించింది.
..
1943 నాటి చెంచులక్ష్మి సినిమాలో ఋష్యేంద్రమణి పాడిన 'నిజమాడు దాన నీదాన" పాట. సినిమాలో ఋష్యేంద్రమణి ఆదిలక్ష్మి పాత్ర ధరించింది.
ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటానికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం ఇప్పటికికూడ ఎంతగానో ప్రజాదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
దాదాపు దక్షిణాది అన్ని భాషల్లోనూ 150 చిత్రాల్లో నటించిన ఈమె కార్వేటి నగరం మహారాజా గారి చేతుల మీదుగా "మధురగాన సరస్వతి" అనే బిరుదును అవార్డుగా అందుకుంది...
ఈమె తన మనమరాలయిన కన్నడి నటి భవానితో 1974లో" భూతయ్య" అనే కన్నడ చిత్రంలో కలిసి నటించింది..

శ్రీ ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.
★★★★★★★★★★★★★
💐ఆమె కివే మానివాళులు...!! (-నూలు)
★★★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి