4, నవంబర్ 2020, బుధవారం

శ్రీ గూడూరు సావిత్రి

చలన చిత్ర రంగంలో  నాయక పాత్రలో,ఎంతమెప్పించారో...ప్రతినాయకపాత్రలోనూ అంతే మెప్పించిన ఏకైక నటుడు అన్న ఎన్టీఆర్ ... 

 తెలుగు నాటక రంగంలో సాద్వీమణి సీత పాత్రను... రాక్షస స్త్రీ శూర్పణఖ పాత్రను 
అలాగే సాత్వికమైన చంద్రమతిపాత్రను...రాజసమైన నాయకురాలు నాగమ్మ..అలాగే. రుక్మిణీ...కైక  లాంటి పరస్పర విరుద్ధమైన వైవిధ్య పాత్రలను పోషించి, మెప్పు పొందినదీ రంగస్థల నటీమణి.... 
ఆమే ఈనాటి మన చిరస్మరణీయురాలు...
శ్రీ గూడూరు(ఆవేటి) సావిత్రి

అందమైన రూపం.
మధురమైన గాత్రం... 
శ్రావ్యమైన స్వరం...
స్పష్టమైన పలుకులు...
నిరాడంబరత్వం...
వృత్తియెడల భక్తి...
మృదుస్వభావం...
 సమయపాలన..
అంకితభావం...
సహానటులయెడల సృహృదభావ వైఖరి...
నిగర్వం..లాంటి సద్గుణాలు ఆమె ను నాటకరంగంలో ఉన్నత శిఖరాలలో నిలిపాయనడంలో సందేహం లేదు.

ప్రశాంతమైన,నిర్మలమైన వదనం... 
కన్నుల్లో కనిపించే  ఆత్మీయత... 
పెదవులపై పలకరించే చిరుదరహాసం,... 
ఎన్ని కీర్తి ప్రతిష్టలు పొందినా....
 ఏ మాత్రం  మచ్చుకైనా కానరాని
అతిశయం...అహంకారం... 
చూడగానే ఆమె పై గౌరవభావాన్ని.. కలిగిస్తాయి...
 
1950 లో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే బాల పాత్రలతోనే పేరుతెచ్చుకున్నసావిత్రి గారు, యుక్తవయస్సు రాగానే స్త్రీ,పురుష పాత్రలను అలవోకగా -అద్వితీయంగా
అనితరసాధ్యంగా పోషించి,ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించి,నటిగాఉన్నత శిఖరాలను 
అధిరోహించారు.

గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆవేటి సావిత్రి ప్రముఖ రంగస్థల నటీమణి.

★జననం
ఈమె నారాయణరావు,
అంజనీదేవి దంపతులకు 1942 సంవత్సరములో కడపజిల్లా కస్తూరీ రాజుగారి పల్లెలో జన్మించారు.
★బాల్యం
తన ఐదవ యేటనే న్యూ పూర్ణానందా డ్రమేటిక్ థియేటర్ అనే  సురభి నాటక సమాజంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడు పాత్ర తో నాటకరంగ ప్రవేశం చేశారు..
 నెల్లూరు జిల్లా గూడూరు
ప్రాంతంలో నివసించడం వల్ల 
గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందింది.
 శ్రీ సాయన ప్రకాశరావు ఈమె రంగస్థల గురువు. 
బాల్యంలో,శ్రీకృష్ణ లీలల్లో కృష్ణుడు, కనకతారలో కనకసేనుడు, తార, ,లవకుశ లో లవుడు, కుశుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు,  మొదలగు పాత్రలు ధరించారు.

తరువాత కాలంలో..
సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య,ద్రౌపది, మండోదరి, శశిరేఖ,  వాసవి, లీలావతి, చింతామణి,చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, , రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు.

భరణి ఆర్టు థియేటర్ అనే నాటక సమాజాన్ని స్థాపించి, తాను , ఆ సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఆ సంస్థలోని నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు. ఇతర సమాజాలలో నటించడంతో పాటుస్వంత 
నాటకాలను ప్రదర్శించారు.

★నాటకాలు - పాత్రలు 
బాల్య దశలోనే కనకతారలో కనకసేనుడు, తార, శ్రీకృష్ణ లీలలు ల్లో కృష్ణుడు, భక్తప్రహ్లాద లో ప్రహ్లాదుడు, లవకుశలో లవుడు, కుశుడు మొదలగు పాత్రలు ధరించారు. చంద్రమతి, బాలనాగమ్మ, నాయకురాలు నాగమ్మ, సీత, లక్ష్మి, రుక్మిణి, ద్రౌపది, మండోదరి, శశిరేఖ, సులోచన, తార, మీరాబాయి, సక్కుబాయి, శూర్పణక, కైక, అహల్య, వాసవి, లీలావతి, చింతామణి, రాధ, శకుంతల మొదలగు పాత్రలు ధరించారు. మరెన్నో సాంఘిక, చారిత్రక నాటకాల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు ధరించిన ఈవిడ పురుషపాత్రలను కూడా పోషించి, తన నటనా వైద్యుష్యాన్ని వెల్లడించారు. కృష్ణుడు, రాముడు, సత్యవంతుడు, కార్యవర్థి, బిల్వమంగళుడు మొదలగు పురుష పాత్రలు ధరించారు.

 పౌరాణిక పద్యనాటకాల్లో పలు ప్రధాన పాత్రలను పోషించి ప్రసిద్ధి చెందిన సావిత్రి గారు ప్రారంభంలో ఎన్నో సాంఘిక నాటకాల్లోనూ నటించారు.
ప‌రువుకోసం,నటరాజు, పునర్జన్మ, తుఫాను, తరంగాలు, దొంగలొస్తున్నారు జాగ్రత్త,ఎదురీత,పల్లెపడుచు,అన్నాచెల్లెలు,చీకటిదొంగలు,ఎండమావులు,కమల,
పెదవులు-పదవులు, 
మేనరికం, రాజీవం ,మొదలగు 
సాంఘిక నాటకాలలో 
తననటనా కౌశలాన్ని,
ప్రదర్శించారు.
 
అలనాటి నాటక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన ఉద్దండనటులు సర్వశ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు, బేతా రామచంద్రారావు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, చీమకుర్తి నాగేశ్వరరావు, అబ్బూరి వరప్రసాదరావు,వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ఆచంట వెంకటరత్నం నాయుడు, వేమూరి రామయ్య, అమరాపు సత్యనారాయణ, కె. రఘురామయ్య, పులిపాటివెంకటేశ్వర్లు,ఎ.వి.సుబ్బారావు, 
డి.వి. సుబ్బారావు, బండారు రామారావు, వేమూరి రామయ్య , రేబాల రమణ, కాగిత సుబ్బారావు, వేమూరి గగ్గయ్య  పొన్నాల రామసుబ్బారెడ్డి, వై. గోపాలరావు, మద్దాలరామారావు,మొదలగు నట ప్రముఖుల సరసన వారికి దీటుగా నటించి ప్రశంసలందుకున్నారు.

 మూడు తరాల నటులయిన  తాత, తండ్రి, మనవడు అయిన వేటపాలెం డి.వి. సుబ్బారావుగారితో, వారి కుమారుడు వెంకట సుబ్బయ్య గారితో, మనవడు డి.వి. సుబ్బారావు గారితో ‘చంద్రమతి’గా అనేక ప్రదర్శనలు చేశారు.

ఈమె పలు పరిషత్తు పోటీలలో శతాధికంగా ‘ఉత్తమనటి’ బహుమతులందుకున్నారు. 

★అవార్డులు - సత్కారాలు
అవార్డులు ఈమెను వరించటమే వాటికి రివార్డుగా భావించేవి అనుటలో అతిశయోక్తి లేదేమో..

సినీనటి సావిత్రి అవార్డు, జమున అవార్డు,
స్థానం నరసింహారావు అవార్డు, 
ఆం.ప్ర.. ప్రభుత్వం వారిచే కళారత్న అవార్డు,
పైడి లక్ష్మయ్య అవార్డు, 
హంస అవార్డు,  , కృష్ణకుమారి అవార్డు, 
దక్షిణ మధ్య రైల్వేవారి లింకా అవార్డు మరెన్నో అవార్డులు ఈమెను వరించి తరించాయి.

సన్మానాలు...సత్కారాలు...
పురస్కారాలు...
కనకాభిషేకాలు..సువర్ణ హస్త కంకాణాలు,
పట్టు వస్త్రాలు...పట్టు శాలువాలు...
రజితపతకాలు...జ్ఞాపికలు...
ఒకటా.. రెండా,,ఎన్నో,,మరెన్నెన్నో.....
నాటకరంగంలో  అత్యంత గౌరవం పొందినదీ విదూషణిమణి..

మహానటి,అభినయ శారద, అభినవ శారద, కళాతపస్విని, సరస నయానాభినేత్రి,  మొదలగు బిరుదులను పొందారు.

సాయికృష్ణ యాచేంద్ర  వెంకటగిరి వారిచే సువర్ణ హస్త ఘంటా కంకణం,
విజయవాడ పురప్రముఖులచే కనకాభిషేకం, సువర్ణహస్త ఘంటా కంకణం, , 
నంద్యాల నంది పైపుల అధినేత ఎస్.పి.వై. రెడ్డి గారిచే బంగారు పతకం, 
పొదిలి పురప్రముఖులచే బంగారు పతకం, 
బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, 
ఆంధ్రా గవర్నర్ కృష్ణకాంత్, 
ఆంప్ర. ముఖ్యమంత్రులు డా. ఎన్.టి. రామారావు, 
నారా చంద్రబాబునాయుడు తదితర రాజకీయ ప్రముఖులు ఈమె ప్రతిభను వివిధ రీతుల  సత్కరించారు.  
అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నారు.

డి.వి. సుబ్బారావు గారితో (వేటపాలెం) తో శతాధికంగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటక ప్రదర్శనల్లో చంద్రమతిగా నటించడమేకాక, వారి కాంబినేషన్ లో గ్రామ్‌ఫోన్ రికార్డు కూడా ఇచ్చారు.చీమకుర్తి నాగేశ్వరరావు హరిశ్చంద్రుడిగా, ఈవిడ చంద్రమతిగా, అలాగే శ్రీకృష్ణతులాభారంలో పృథ్వి వెంకటేశ్వర్లు నారదుడిగా, ఈవిడ కృష్ణుడుగా గ్రామ్‌ఫోన్ రికార్డు,  సి.డి.లు వెలువడినాయి. 

ఆకాశవాణిలో ఎన్నోపౌరాణిక నాటకాల్లో నటించిన ఈమె సినిమాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ,  నటించారు.

పసి ప్రాయంలో తన 5 వయేట  నాడు లోహితాస్యుడుగా  అడుకుంటూ కట్టెలు కోసం అడవికెళ్లే పాత్రతో  నాటకరంగంలో కాలుమోపిన ఈ చిన్నారి పాప...  తదుపరి ఆరు దశాబ్దాలు సుదీర్ఘ నాటక రంగ ప్రస్థావనలో నాటక రంగంలో ఎన్నెన్నో వైవిధ్యమైనపాత్రలను,వాటి మూల స్వభావాన్ని,పాటలనూ,
పద్యాలనూ,రాగాలనూ.సంభాషణలనూ,అత్యంత ధారణ ప్రతిభతో తన మెదడు లో నిక్షిప్తం చేసుకుని,నటననూ,  నాటకాన్ని,,ఆహారహారం,,,ఆద్యంతమూ,,ప్రేమిస్తూ..ఆలోచిస్తూ,,ఆరాధిస్తూ..ఆవాహనచేస్తూ,,.ఆపోసనపడుతూ,...అనుభవిస్తూ.. రంగస్థలంపై ఆడుకుంటూ...అభినయిస్తూ,,
ఆలపిస్తూ,,అనుభూతి చెందుతూ...ఆనందిస్తూ...
ఆనందింపచేస్తూ...అభినందింపచేస్తూ..అశేష ఆంధ్రప్రేక్షకుల అత్యంత అభిమానం,ఆదరణలను 
పొందిన  అసమాన నటీమణి గా పేరుగాంచి, ..జాతస్య మరణం ధృవం... అని రుజువు చే సి 0-1-2012 న శివసాయుజ్యం పొండినదని
చెప్పక తప్పడం లేదు
 ఓం శాంతి... శాంతి...శాంతి...
★★★★★★★★★★★★★
ఆ మహా నటీమణి కివే మా నివాళులు...!!💐💐
★★★★★★★★★★★★★

..

 .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి