2, నవంబర్ 2020, సోమవారం

శ్రీ వంగర..( వంగర వెంకట సుబ్బయ్య)

☝️★★★★★★★★☝️
               🎭 
      💥 *తెలుగు*💥
    *నాటకరంగ వైభవం*
 ★★★★★★★★★★

5 అడుగుల చిలుకు ఎత్తు..
పూజారి పంచెకట్టు..
నుదిటిపై నిలువు బొట్టు
ఒంటిపైన ఉత్తరీయం...
చేతిలోకర్ర...
 పలికే పలుకుల్లో  స్పష్టత...
తీక్షణమైన కంటి చూపులు.. 
ప్రతిపదాన్ని నొక్కి పలికే మధురమైన ఉచ్ఛారణా మాధుర్యం...
 వెరసి, ఒక సనాతన సత్ బ్రాహ్మణోత్తముని రూపానికి మనసులో పడే ముద్ర...
ఆయనే వంగర..
శ్రీ వంగర వెంకట సుబ్బయ్య..  నాటక రంగాలలో "వంగర" గా ప్రసిద్ధుడైన  రంగస్థల చలన చిత్ర హాస్యనటులు. 
వీరే నేటి మన చిరస్మరణీయులు...

ఏమిటయా నీ లీల.... కృష్ణా...
ఏమిటయా నీ లీలా... 
అనే పాట..గుర్తొచ్చిందా.. !!

సురేష్ పొడక్షన్ వారి "శ్రీకృష్ణ తులాభారం" చిత్రంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుని నుండి రుక్మిణికి సందేశం చేరవేసే వార్తాహరుని పాత్ర లో వీరి నటన 
న భూతొ...న భవిష్యతి..
వీరే ఈ పాత్రలకు సాటి... 

"మాయా బజార్" సినిమా అల్లు రామ లింగయ్య గారి జోడీగా వీరు పండించిన హాస్యం చెప్పనక్కరలేదు..

 ఈయన ఒంగోలు తాలూకా సంగం జాగర్లమూడిలో 1897, నవంబరు 24 న జన్మించారు.తండ్రిపేరు కోటయ్య...తల్లిపేరు వెర్రెమ్మ...

★రంగస్థల ప్రవేశం
1901 లో 4 ఏండ్ల పసి ప్రాయంలో చిత్రనళినీయం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశారు వంగర..

యుక్తవయస్సులోకొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.పిదప తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. పిమ్మట రామావిలాస సభలో చేరి,ప్రసిద్ధ నటులు యడవల్లి సూర్యనారాయణ గారితో కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో నాటకాల్లో వేషాలు వేశారు.. వారితో విదేశాలకు కూడా వెళ్లి నాటక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు.

★చలనచిత్రరంగ ప్రస్థానం 
1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.

వీరు 1976లో  శివ సాన్నిధ్యం పొందారు...
★★★★★★★★★★★
💐వారికివే మా నివాళులు..!!💐    (-నూలు)
★★★★★★★★★★★

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి